chandhrababu naidu

సీఎం చంద్ర‌బాబును ఏకాకిని చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..?

Submitted by lakshman on Sun, 04/08/2018 - 12:16

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి వర్గంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోవర్టులున్నారా? అమరావతిలో విస్తృతంగా జరిగే చర్చల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు. స్వయానా కొందరుమంత్రులు, మరికొందరు ఎంఎల్ఏలు పవన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వారి వైఖరిపై ముఖ్య మంత్రి చంద్రబాబు పూర్తి అసంతృప్తితో ఉన్నారట.

ప్ర‌త్యేక‌హోదా..ఏపీ ప్ర‌భుత్వంపై బాంబు పేల్చిన జైట్లీ

Submitted by lakshman on Sun, 03/18/2018 - 09:47

ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌న రూటును మార్చుకుంద‌ని  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. 14వ ఆర్ధిక సంఘం సూచ‌న‌ల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జైట్లీ స్ప‌ష్టం చేశారు. కానీ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. 

బీజేపీతో క‌టిఫ్..చంద్ర‌బాబు అధికారిక ప్ర‌క‌ట‌నే కీలకం..?

Submitted by lakshman on Fri, 03/16/2018 - 14:05

యూపీ ఉప ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోక ముందే… బీజేపీకి ఆంద్రప్రదేశ్ లో మరో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేబినెట్ పెదవులని తృణప్రాయంగా త్యజించిన టీడీపీ ఇక బీజేపీ కూటమిలో కూడా కొనసాగరాదని నిర్ణయించింది. కమలం పార్టీతో పూర్తిస్థాయిలో ‘కటీఫ్‌’ చెప్పాలని నిర్ణయించింది. ఎన్డీయే కూటమి నుంచి తక్షణం బయటకు రావాలని నిర్ణయించుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై అధికారికమైన ప్రకటన చేయనున్నారు.

ఇద్దరి మ‌ధ్య పొత్తు షురూ..?

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:10

ఏపీ లో ఎన్నికల సందడి అప్పుడే మొదలయ్యిపోయింది..ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి..ఎన్ని సీట్లు అడగాలి ఇలా ఎవరి అంచానాలు వారికి ఉన్నాయి అయితే టిడిపి –జనసేన పొత్తు ఉంటుంది ముందు నుంచీ భావిస్తున్న తరుణంలో..ఇద్దరి పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి..అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపి ని ఈ సారి చంద్రబాబు దూరం పెట్టారనే చెప్పాలి…వచ్చే ఎన్నికల్లో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు..

టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న‌లు..?

Submitted by lakshman on Mon, 01/29/2018 - 22:11

సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ పార్టీ నేత‌లు గ‌ణాంకాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ గ‌ణాంకాల ఆధారంగా  టీడీపీ ఎలా వెన్నుపోటు పొడిచిందో కేడ‌ర్ కు చెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. ఇందులో భాగంగా ఆ పార్టీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు అమరావతి, రాజమండ్రి, విజయనగరాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌నలో టీడీపీ మిత్ర ధ‌ర్మం, పార్టీపై  కేడ‌ర్ కు ఉన్న అపోహ‌లు, టీడీపీ - బీజేపీ మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా వున్నది ? పీఎం మోడీ వచ్చాక ఎలా ఉంది ? టీడీపీ  నాడు ఎలాంటి వెన్నుపోట్లు  పొడించింది..?

హ్యాట్సాఫ్ సీఎం సాబ్

Submitted by lakshman on Thu, 01/25/2018 - 07:45

సీఎం చంద్ర‌బాబు దావోస్ టూర్ లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఓ వైపు స‌ద‌స్సు మరోవైపు రాష్ట్రానికి పెట్టుబ‌డులు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అది చాల‌దన్న‌ట్లు ఏపీ లో తూర్పు గోదావ‌రి జిల్లా వైర. రామ‌వ‌రం మండ‌లం జాజి వ‌ల‌స‌ గ్రామంలో ఏం జ‌రుగుతుంద‌నే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప్ర‌య‌త్నానికి  సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు చంద్ర‌బాబు మ‌నిషా రోబోనా అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.