women

మహిళలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారా?

Submitted by arun on Sat, 04/07/2018 - 14:38

నిజమా... లేడీస్‌ జీన్స్‌ వేసుకోవద్దా? వేసుకుంటే నపుంసకులు పుడతారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు కేరళ ప్రొఫెసర్‌ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు? పుట్టకతోనే హిజ్రాలుగా పుడతారా? ఇంటర్‌ సెక్స్‌ అనే అరుదైన కేసుకు జీన్స్‌కు ఎందుకు లింక్‌ పెట్టారు?

పేరు డాక్టర్‌ రజిత్‌కుమార్‌. కేరళలో ప్రొఫెసర్‌. అధ్యాపక వృత్తిలో ఉన్న రజిత్‌కుమార్‌ అంత చదువుకొనీ ఇలా మాట్లాడరని చర్చించుకుంటుంది మహిళాలోకం. కేరళలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ తీసుకుంటున్న రజిత్‌కుమార్‌ తమను తీవ్రంగా అవమానంచారంటారు ట్రాన్స్‌జెండర్లు. 

‘అమ్మ’లకు పరీక్ష: పరీక్ష రాసిన 47వేల మంది మహిళలు

Submitted by arun on Mon, 03/26/2018 - 12:14

అమ్మలు బడిబాట పట్టారు..! ఒక్కరు కాదు ఇద్దరు కాదు... 47వేల మంది మహిళలు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లోని పాఠశాలల్లో ఆదివారం ఉదయం పరీక్ష రాస్తున్న మహిళలే కనిపించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పరీక్షలు రాయడమేమిటీ..? ఏం పరీక్షలు అని అనుకుంటున్నారు కదా..? ఇటీవలే బదిలీపై వెళ్లిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగాత్మకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వారి పిల్లలు చదువు నేర్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

ఈ విగ్రహాలను తాకితే గర్బవతులవుతారు

Submitted by lakshman on Tue, 02/06/2018 - 04:24

ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ... ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం. అయితే ఈరోజుల్లో అమ్మతనం పొందాలంటే చాలాకష్టపడాల్సి వస్తుంది. వాతావరణం, ఆహారం, ఒత్తిడి రకరకాల కారణాలతో అమ్మతనానికి దూరం అవుతున్నారు. అందుకోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది.

సీమా భవానీ.. సూపర్ షో..

Submitted by arun on Fri, 01/26/2018 - 14:07

ఢిల్లీ... రాజ్ పథ్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన చేశారు.  సీమా భవానీ వుమన్ బైకర్స్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్డీ పరేడ్‌లో మహిళా మోటర్ సైకిల్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెకాన్‌పూర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించాయి. సీమా భవానీ డ్రైవింగ్ స్కిల్స్ అందర్నీ అబ్బురపరిచాయి. రైడింగ్ స్టంట్స్‌తో థ్రిల్ చేశారు. ప్రెసిడెంట్‌కు సెల్యూట్ చేయడంతో పాటు ఫిష్ రైడింగ్, సైడ్ రైడింగ్ లాంటి స్టంట్లతో సీమా భవానీలు స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచారు. 

మంత్రి దేవినేని నుంచి ప్రాణహాని ఉంది: ప్రవిజ

Submitted by arun on Thu, 01/11/2018 - 17:52

ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని  ఉందని, రక్షణ కావాలని గురువారం యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న అట్లూరి ప్రవిజ, ఆమె భర్త జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్లూరి ప్రవిజ అనే యువతి గతంలో విజయవాడలో నివాసం ఉంది. ఓ భూమి వివాదం కేసులో లోకాయుక్తలో కేసు వేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటోంది. అయితే అపరిచిత వ్యక్తులు తమ ఇంటికి వస్తున్నారని, మంత్రికి అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో వివరించింది.

నాయకత్వ లక్షణాలు దాచితే దాగవు

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:19

130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల్లో... నాయకులుగా తయారవుతున్నది ఎంతమంది? ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్నది మన దేశమే. మరి వీరిలోంచి నాయుకులన్నవారు ఎవరూ పుట్టరా? నాయుకత్వం అంటే కేవలం రాజకీయాలు.. ఎన్నికలు.. ఓట్లు.. కుట్రలు.. కుతంత్రాలేనా? మహిళలు అసలు ఇందులోకి అడుగు పెట్టరా? నాయుకత్వ లక్షణాలు అనేవి ఒకరు నేర్పితే వచ్చేవి కావు.. అవి పుట్టుకతోనే రావాలి. అలాంటివి ఉన్నవారిని కూడా లక్ష్యాల పేరుతో తొక్కేస్తే.. ఇక ఆ నాయుకుడు ఎప్పటికీ పైకి రాడు. ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థిసంఘం ఎన్నికల బరిలో నిలిచిన ఆరుగురూ... అమ్మాయిలే! మరి వాళ్లెలా ముందుకొచ్చారు.. మనమెందుకు రాకూడదు..

కన్న కొడుకు శవంతో వర్షంలో రాత్రంతా నడిరోడ్డుపై ..!

Submitted by lakshman on Fri, 09/15/2017 - 21:18
కన్నతల్లి నడిరోడ్డుపై కొడుకు శవంతో వర్షంలో తడుస్తూ గడిపిన దయనీయ దుస్థితిని హైదరాబాద్ మహానగరం మౌనంగా తిలకించింది. సెప్టెంబర్ 14న ఈ ఘటన జరిగింది. నగరంలో గత రెండు రోజులుగా.....