cm kcr

3.70 కోట్ల మందికి కంటి పరీక్షలు

Submitted by arun on Thu, 08/16/2018 - 08:54

దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. 3 కోట్ల 70 లక్షల మందికి పరీక్షలు చేసేందుకు 825 టీఎంలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కరెంట్, మంచినీటి సమస్యలను అధిగమించామన్న కేసీఆర్‌ మల్కాపూర్ గ్రామానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 

‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్

Submitted by arun on Wed, 08/15/2018 - 15:35

సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తూప్రాన్ మండలం మల్కాపూర్ చేరుకున్నారు. మల్కాపూర్‌లో సీఎం ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న ఓ మహిళకు సీఎం కంటి అద్దాలు అందజేశారు. కంటి పరీక్షల గురించి సీఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు. కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటివెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

నేటి నుంచి రైతుబీమా అమలు

Submitted by arun on Wed, 08/15/2018 - 14:10

తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని, సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. గొల్కోండ జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని, జాతీయ జెండా ఎగురవేశారు. బ్యాంకులతో సంబంధంలేకుండా బీసీలకు నేరుగా లోన్స్ ఇస్తున్నట్లు తెలిపారు.  నేటి నుంచి రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, రెండో విడత రైతు బంధు పథకం చెక్కులు నవంబర్ లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

గోల్కొండకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Submitted by arun on Wed, 08/15/2018 - 10:17

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనాన్ని సీఎం స్వీకరించారు. అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా కేసీఆర్ గోల్కొండ కోటకు బయల్దేరారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మూడు మీటింగులు,ఆరు సర్వేలు

Submitted by arun on Tue, 08/14/2018 - 12:29

ఎన్నికలపై ఇప్పటికే ఆరు సర్వేలు చేసినారట,

వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయడంఖనట,

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి తప్పదట,

తము చేసిన అభివ్రుద్దే తమ కంటివెలుగట. శ్రీ.కో

ఇద్దరిదీ మోసమే..

Submitted by arun on Tue, 08/14/2018 - 10:38

తెలంగాణ టూర్ లో రాహుల్ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని కడిగేశారు. అటు మోడీ, కేసిఆర్  వ్యవహార శైలిపై చురకలేశారు. మహిళలు లేనిదే పురోగతి సాధ్యం కాదన్న రాహుల్ డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. 

రాహుల్ కామెంట్స్ కు కేసీఆర్ కౌంటర్...మా కుటుంబ పాలన మంచిదే

Submitted by arun on Tue, 08/14/2018 - 10:17

రాహుల్ తెలంగాణ టూర్ సందర్భంగా ఫ్యామిలీ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ పాలనతో పోల్చితే, తమ పాలన బెటర్ అన్నారు. కుటుంబపాలన అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసే క్రమంలో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ పాలన సాగుతోందని ఆరోపించారు. 
  

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

Submitted by arun on Mon, 08/13/2018 - 17:12

వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే లక్ష్యంగా కేసీఆర్‌ పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగుతోంది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు అయినా, గడువు మేరకు అయినా ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎన్నికల్లో గెలుపుకు కేసిఆర్ వ్యూహాలు...ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు.. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు

Submitted by arun on Sat, 08/11/2018 - 12:23

వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహన్ని సిద్దం చేసారా? పనితీరు ఒక్కటే సరిపోదు అభ్యర్ధుల ఎంపిక కూడా పక్కాగా ఉండాలని భావిస్తున్నారా? సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆదారంగా అభ్యర్ధుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ కు ఆయన అధిక ప్రధాన్యత నిస్తున్నారా? నియోజకవర్గాల్లో కులాలు, వారి బలాల అధారంగా అభ్యర్ధులను గుర్తిస్తున్నారా? 

కేసీఆర్‌‌ను కలిసిన డీఎస్‌...డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

Submitted by arun on Thu, 08/09/2018 - 14:03

టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌‌తో డీఎస్‌ సమావేశమైనట్లు చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌పై ఆరోపణలు రావడం, అదే సమయంలో డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌‌కు ఫిర్యాదుచేశారు. అయితే హైదరాబాద్‌లో కేసీఆర్‌‌ను కలిసేందుకు అనేకమార్లు డీఎస్‌ ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో సీఎం ఢిల్లీ టూర్‌‌లో కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.