asp sunitha reddy

వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్..

Submitted by arun on Mon, 02/12/2018 - 16:01

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డిల అక్రమ సంబంధం సంచలనం రేపిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరూ సస్పెన్షన్ లో ఉన్నారు. వివాహేత సంబంధానికి సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రముఖ తెలుగు యాంకర్ సోదరుడు లెనిన్ ను సునీతారెడ్డి తొలి వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు లెనిన్ ను వదిలేసి, వరకట్నం కేసును పెట్టింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డిని రెండో వివాహం చేసుకుంది. సునీత మొదటి పెళ్లి ఫొటోలను చూసి సురేందర్ రెడ్డి షాక్ అయ్యారు. ఇప్పడు కేసు విచారణలో మొదటి పెళ్లి ఫొటోలు కీలకంగా మారాయి. 
 

ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్‌

Submitted by arun on Wed, 01/31/2018 - 14:53

వివాహేతర సంబంధం కారణంగా సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సునీతా రెడ్డిని తాను ఓ రోల్ మోడల్ లా చూశానని... ఆమె ప్రవర్తనతో తాను మనస్తాపానికి గురయ్యానని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సునీతా రెడ్డే ఇలాంటి పని చేయడంతో, తనకు ఆత్మహత్యే శరణ్యమని వినయ్ అనే అభిమాని సూసైడ్ నోట్ విడుదల చేశాడు. ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉండేవారు... నీతివంతమైన జీవితం గడపాలని, నైతిక విలువలను పాటించాలని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో... వారు వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆ కేసుతో వీరి లింకేంటి?

Submitted by arun on Thu, 01/25/2018 - 14:35

అవును. వాళ్లిద్దరూ పోలీసులు. ఖాకీ చొక్కా ధరించి, చేతిలా లాఠీపట్టి, సమాజంలో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్ చేసే రక్షకభటులు. దారితప్పినవాళ్లను తమదైన స్టైల్‌లో దారికి తెచ్చే ఖాకీలు. కానీ వాళ్లిద్దరూ దారి తప్పారు. నీతి తప్పారు. నైతికత తప్పారు. పక్కచూపులకు లొంగిపోయి, కుటుంబ జీవితాలను బజారుకీడ్చుకున్నారు. పోలీసు శాఖ పరువు తీశారు. ఖాకీ చొక్కాకున్న విలువతకు పాతరేశారు. ఔను. వాళ్లిద్దరూ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జున్‌ రెడ్డి. మీడియా సాక్షిగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిని ఒక్క‌టి చేసిన ఓటుకు నోటు కేసు

Submitted by arun on Tue, 01/23/2018 - 11:07

వాళ్లిద్దరూ పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులు... ఆమె అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఆయనేమో కల్వకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వీళ్లిద్దరూ పోలీస్‌ శాఖకే తలవంపులు తెచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న ఏఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా ఆమె కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌ 13వ ఫ్లోర్‌ నివసిస్తోంది.