janasena party

పవన్ ఆశయాలు నచ్చి జనసేనలోకి-రావెల కిషోర్ బాబు

Submitted by chandram on Sat, 12/01/2018 - 15:47

తెలుగు దేశం పార్టీ తనను అనేక విధాలుగా అవమానించిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. పని చేయకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యనించారు. గుంటూరులో మంత్రులు పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మన్నవ సుబ్బారావులు ప్రతి విషయంలోనూ కలుగజేసుకునే వారని తెలిపారు. టీడీపీలో దళితులకు స్వేచ్ఛ లేదని వెల్లడించారు. పవన్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. 

జనసేనలో గంగిరెద్దుల హడావుడి..:జవహర్ విమర్శ

Submitted by chandram on Sat, 12/01/2018 - 15:29

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠత్మకంగా ఏర్పాటుచేసిన జనసేన పార్టీపై మరోసారి విరుచుకపడ్డారు టీడీపీ మంత్రి జవహర్. జనసేన పార్టీ కార్యాలయం చూడటానికి గంగిరెద్దుల హడావుడి కనిపిస్తోందని మండిపడ్డారు. ఇన్ని దినాలు ఎం పని పాటలేక ఖాళీగా ఉండి ఇప్పుడు ఎక్కడ తలదాచుకోవాళ్లో తెలియని నేతలు జనసేన పడవలోకి వెళ్లున్నారని ఎద్దేవా చేశారు. అయితే నేడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబు చేరిన సందర్భంగా మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజారాజ్యం స్థాపించిన రోజు నుంచే చిరంజీవి కుటుంబం చుట్టూ బొంగురంలా తిరుగుతున్నారని ఆరోపించారు.

చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్

Submitted by chandram on Wed, 11/21/2018 - 12:20

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చెన్నైలో పవన్ కమల్‌హాసన్‌తోపాటు పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. కమల్‌తో భేటీ అనంతరం రాజకీయ సమాలోచనలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3గంటలకు తాజ్‌ కొనమేరాలో మీడియాతో మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రానలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, అభివృద్ధి కేంద్రీకరణ జరగాలని ఇప్పటికే గళమెత్తిన పవన్ తాజాగా చెన్నైలో పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌తో పనిచేసేందుకు సిద్ధమైన చలమలశెట్టి సునీల్

Submitted by arun on Mon, 10/15/2018 - 10:02

జనసేన లోకి వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పవన్‌ కళ్యాన్‌తో కలిసి పనిచేసందుకు ముందుకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా జనసేన లోకి రంగ ప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే ఆయన పలు సార్లు జనసేన తో కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

తెలంగాణలో పోటీకి సిద్ధమైన జనసేన...24 స్థానాలకు పోటీ...

Submitted by arun on Sat, 10/13/2018 - 12:26

తెలంగాణపై జనసేన అధినేత పవన్‌ దృష్టి పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ నిర్ణయించారు. 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలపాలని పవన్‌ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ, అభ్యర్థులకు సంబంధించి నాలుగైదు రోజుల్లోగా ఫుల్‌ క్లారిటీ రానుంది.

నేడు జనసేనలోకి నాదెండ్ల మనోహర్..

Submitted by arun on Fri, 10/12/2018 - 10:08

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈరోజు జనసేన పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి తిరుమల వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో మనోహర్ పార్టీని వీడటం కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. 

తిరుపతిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

Submitted by arun on Fri, 09/21/2018 - 11:43

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, అధినేత చంద్రబాబు పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. గతంలో వైసీపీలో చేరతారని ప్రచారం జరగ్గా, అనూహ్యంగా ఆయన హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. పవన్‌తో దాదాపు గంటసేపు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. విజయదశమి నాటికి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

జనసేనలో మోత్కుపల్లికి ఇచ్చేది ఆ పదవేనా?

Submitted by arun on Thu, 08/02/2018 - 13:44

టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోతుపల్లి జనసేన పక్షాన చేరారు.  తిరుపతి పర్యటన తరువాత పవన్‌తో టచ్‌లోకి వచ్చిన మోతుపల్లి తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానంటూ హామి ఇచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాన్‌ మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు . కాసేపట్లో మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాన్‌‌ను కలవనున్న మోత్కుపల్లి  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించడంతో జూన్‌లో మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారు. మోత్కుపల్లి జనసేనలో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే అంశం కూడా చర్చకు వస్తోంది.

జగన్ ఇంటి ఆడపడుచులను వివాదంలోకి లాక్కండి: పవన్

Submitted by arun on Thu, 07/26/2018 - 10:12

తనపై జగన్ చేసిన వ్యక్తిగత వ్యా‍ఖ్యలపై మరోసారి పవన్ కల్యాణ్ స్పందించారు. జగన్ వ్యా‍ఖ్యలు తన అభిమానులను, జనసైనికులను బాధించాయన్న పవన్‌ ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయాలని కోరారు. ఈ వివాదంలోకి జగన్‌ కుటుంబసభ్యులను కానీ, ఆ ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి  లాగొద్దని జనసేన నేతలకు, కార్యకర్తలకు సూచించారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాల్లేవన్న జనసేనాని రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనన్నారు. కేవలం విధివిధానాలపైనే పార్టీలతో విభేదిస్తానన్నారు. 

నేడు సాగర తీరంలో జనసేన భారీ కవాతు

Submitted by arun on Sat, 07/07/2018 - 07:25

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కవాతు నిర్వహించనున్నారు. కవాతులో అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఆర్కే బీచ్ కాళీ మందిర్ నుంచి వైఎంసీఏ వరకు కవాతు సాగనుంది. ఈ కవాతులో ఆరెంజ్, ఆలీవ్ గ్రీన్, వైట్ డ్రెస్‌లలో జన సైనికలు పాల్గొననున్నారు. ఆరెంజ్ కోడ్ వివకానందుడు స్పూర్తిగా, ఆలీవ్ గ్రీన్ సైనికులు, భగత్ సింగ్ స్పూర్తిగా వైట్‌డ్రెస్ కోడ్‌తో అభిమానులు ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను గళమెత్తడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ర్యాలీని ఎంచుకున్నారు పవన్‌ కల్యాణ్‌.