central government

ప్ర‌త్యేక‌హోదా కోసం బ‌లిదానం అవుతా

Submitted by lakshman on Wed, 03/14/2018 - 23:49

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ కేంద్రానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏపీకి ప్ర‌త్యేక‌హ‌దా ఇచ్చే విష‌యం పై బీజేపీ గ‌డిగ‌డికో మాట‌మాట్లాడుతుంద‌ని అన్నారు. మాకు పౌరుషం, ఆత్మ‌గౌర‌వం ఉన్నాయి. ఒక‌రోజు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని , మ‌రోసారి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌లేమ‌ని చేత‌లు దులుపుకుంటే చూస్తూ ఊరుకోం.  ఆమ‌ర‌ణ దీక్ష చేసైనా స‌రే సాధించుకుంటామ‌ని తెలిపారు. 

ప్ర‌తిప‌క్షం టీడీపీనా..? వైసీపీనా..?

Submitted by lakshman on Wed, 03/14/2018 - 12:41

సీఎం చంద్ర‌బాబు కేంద్రంపై మండిప‌డ్డారు. ఏపీ ప‌ట్ల కేంద్ర వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. పార్ల‌మెంట్ లో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే త‌మ పోరాటాన్ని ఉదృతం చేసేలా  ఆ పార్టీ ఎంపీల‌కు చంద్ర‌బాబు దిశా నిర్ధేశం చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు కేంద్రం తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. 

బీజేపీకి ఏపీ అంటే ఎంత చిన్న‌చూపో..?

Submitted by lakshman on Tue, 03/13/2018 - 16:41

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌లన్నా కేంద్రంలోని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, అధికార గ‌ణానికి ఎంత‌టి అక్క‌సో వెల్ల‌డించే విష‌యం ఇది. తానే గొంతు నులిమి రోడ్డున ప‌డేసిన ద‌క్షిణాది రాష్ట్ర‌మైన ఏపీ అంటే కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఎంత‌టి చిన్న‌చూపో తెలియజేసే ఉదంతం ఇది. పార్ల‌మెంట్‌లో త‌లుపులు మూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల‌పై దాడులు చేసి వారి నోళ్లు మూయించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని ముక్క‌లు చేస్తుంటే తాను ఓ చేయి వేసిన బీజేపీ ఇప్పుడు నేరుగా తానే మిగిలిన ప్రాణాన్ని తీయాల‌ని చూస్తోంది.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్రం గురి

Submitted by arun on Sat, 03/10/2018 - 11:35

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్టేట్‌మెంట్ తర్వాత.. తెలంగాణపై కేంద్రం ఫోకస్ పెంచిందా..? మంత్రులతో పాటు కీలక పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై ఎందుకు నిఘా పెంచారు.? రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రానికి రిపోర్ట్ ఇస్తోందా.? కేసీఆర్‌, కేంద్రం, ఫెడరల్ ఫ్రంట్‌.. అంతా బాగానే ఉన్నా.. సింక్ లేకుండా వెనక కనిపిస్తున్న వాట్సాప్ సింబల్‌కు ఏంటి లింక్.? అది తెలుసుకోవాలంటే.. ముందు ఇది తెలుసుకోవాలి..

అన్నదాతలకు ఆసరా ఏదీ?

Submitted by lakshman on Wed, 09/20/2017 - 16:55

రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. కానీ ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండటం లేదు. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న తాను రోజుకు మూడు పూట్లా నాలుగు వేళ్లు నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. పిల్లలకు సరైన చదువులు చెప్పించే పరిస్థితి కూడా ఉండట్లేదు. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా కష్టపడినా దానికి తగిన ఫలితం రావడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసేవాళ్లయినా దాని ఉత్పత్తి కోసం అయిన ఖర్చు, పన్నులు, రవాణా, నిల్వ, మార్కెటింగ్.. వీటన్నింటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఆ ధరకు అమ్ముతారు.

డ్రైవింగ్ లైసెన్స్‌కూ ఆధార్‌ను లింక్ చేయాలి: కేంద్రం

Submitted by lakshman on Fri, 09/15/2017 - 18:34
ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయడానికి వచ్చే ఫిబ్రవరిని డెడ్‌లైన్‌గా విధించిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు...