whatsapp

వాట్సాప్‌కు పోటీగా పతంజలి కొత్త మెసేజింగ్ యాప్..!

Submitted by arun on Thu, 05/31/2018 - 12:15

ప్రఖ‌్యాత మెసేజింగ్ యాప్ వ్యాట్సాప్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా కింబో అనే పేరుతో ఓ సరికొత్త మెసేజింగ్ యాప్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. సరికొత్త ఫీచర్లతో ఉన్న ఈ యాప్ ను ఇప్పటికే వేలాది మంది డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు.

ప్రాణాలు తీస్తున్న పుకార్లు

Submitted by arun on Wed, 05/23/2018 - 12:35

చెడ్డీ గ్యాంగ్ , పార్థీ గ్యాంగ్  పుకార్లను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నా...జనానికి ఎక్కడం లేదు. ఇంకా బీహార్ గ్యాంగ్ వదంతుల భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే బీహారీ గ్యాంగ్ సంచరిస్తోందన్న సోషల్ మీడియా ప్రచారంతో కొన్ని గ్రామాల్లో నిద్రాహారాలు మాని జాగారం చేస్తున్నారు జనం. దండుపాళ్యం టైపు అరాచకాలు చేసే ఈ గ్యాంగ్ ఊళ్లల్లో తిరుగుతోందన్న ప్రచారంతో అలర్ట్  అయిన గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే చాలు చితకబాదుతున్నారు.  

వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్

Submitted by lakshman on Sat, 03/31/2018 - 00:57

క‌ష్ట‌మ‌ర్లను ఆక‌ట్టుకునేందుకు వాట్సాప్ మార్పులు చేర్పులు చేస్తూ వ‌స్తుంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్ అడ్మిన్ లో మార్పులు చేసింది. ఇప్పుడు వాట్సాప్ నెంబ‌ర్ల‌ను ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా బ‌దిలీ చేసుకునే స‌దుపాయాన్ని అందుబాటులో తెచ్చింది. 

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ

Submitted by arun on Tue, 03/20/2018 - 10:04

మొన్న ఏపీ.. నిన్న తెలంగాణ.. తెలుగు రాష్ట్రాల్లో.. టెన్త్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే.. ఇంగ్లీష్ పేపర్ వాట్సాప్‌లో బయటకు వచ్చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు టీచర్లపై కేసు నమోదైంది.

వాట్సాప్ లో ఈ ఫీచర్ గురించి తెలుసుకున్నారా?

Submitted by arun on Tue, 03/06/2018 - 10:55

వాట్సాప్ లేనిదే.. మనకు తెల్లారదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా.. చెప్పిన విషెస్ కు రిప్లై చూసుకోవాలన్నా.. కొత్త అప్ డేట్స్ తెలుసుకోవాలన్నా.. ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారన్న స్టేటస్ తెలుసుకోవాలన్నా.. అంతా ఇప్పుడు వాట్సాప్ మయమే అయిపోయింది. ఇలా పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ.. అప్ డేట్స్ అన్నీ అందులోనే అప్ డేట్ అవుతున్నాయి.

Tags

స్మార్ట్‌ఫోన్ల వాడకం టీనేజర్స్‌ బీకేర్‌ఫుల్‌ అంటున్న నిపుణులు

Submitted by arun on Thu, 01/25/2018 - 15:43

స్మార్ట్‌‌ఫోన్లు మన జీవితాన్నే మార్చేస్తున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తున్నాయి. ఇక ఇందులోని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతో అయితే ఎక్కడో ఉన్న వారితో లైవ్‌లో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, బంధువులు, సహచరులను టచ్‌లో ఉంచుకుంటున్నాం. ఆ బంధమే సామాజిక వల విసురుతోంది. ప్రతీ ఒక్కరితో కనెక్టయిన వాట్సప్‌ గ్రూప్స్‌ శుభోదయం మెసేజ్‌లతో నిండిపోతున్నాయి.

వాట్సాప్ తో డిజిటల్ పేమెంట్స్

Submitted by lakshman on Fri, 01/19/2018 - 07:10

దేశ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా వినియోగ‌దారుల్ని సొంతం చేసుకున్న వాట్సాప్ స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించ‌నుంది. ఈ యాప్ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకన్నాయి. ఈ నేప‌థ్యంలో వాట్సాప్ ద్వారా బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్స్ చేసుకునే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. గ‌తంలో ఈ యాప్ యాజ‌మాన్యం  యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునే స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన  తెలిసిందే. అందులో భాగంగా ఇప్ప‌టికే యూపీఐ చెల్లింపుల కోసం వాట్సాప్ ప‌లు బ్యాంకుల‌తో ఒప్పందాలు కుర్చుకుంది.

వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్

Submitted by lakshman on Fri, 01/12/2018 - 17:57

వాట్సాప్‌లో మరో అడుగుముందుకేసింది. సాధార‌ణంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ను తొల‌గించాలంటే వారు సంబంధిత గ్రూప్ ను బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. అయితే త్వ‌ర‌లో వాట్సాప్ కొత్త ఫీచ‌ర్ తో ఆ స‌మ‌స్య ఉండ‌ద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ఈ ఫీచ‌ర్ ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే అడ్మిన్ ను  తొల‌గించేందుకు వీలుగా ‘డిస్మిస్‌’ బటన్‌ను వాట్సాప్‌ కొత్తగా తీసుకురాబోతోంది.
 

నిలిచిన వాట్సాప్ సేవ‌లు

Submitted by arun on Mon, 01/01/2018 - 15:01

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ వాట్సాప్ మొరాయించింది.  దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు అస‌హ‌నానికి లోన‌య్యారు. 2018కి స్వాగ‌తం చెప్పేందుకు ఆదివారం సాయంత్రం నుంచి వాట్సాప్ వినియోగ‌దారులు సిద్ద‌మ‌య్యారు. త‌మ స్నేహితుల‌కు విష‌స్ చెప్పేందుకు మిలియ‌న్ల కొద్ది మెసేజ్ ల‌ను షేర్ చేశారు. దీంతో వాట్సాప్ క్రాష్ డౌన్ అయ్యింది. అయితే వాట్సాప్ మొరాయించ‌డంతో యూకే, భార‌త్ , యూర‌ప్‌, బ్రెజిల్ దేశాల్లో 54 శాతం మందికి క‌నెక్టింగ్, 27 శాతం మందికి మెసేజ్ సెండింగ్, 17 శాతం మందికి లాగిన్ సమ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో వినియోగ‌దారులు వాట్సాప్ సేవ‌లు నిలిచిపోవ‌డంతో ట్విట్ట‌ర్ ను ఆశ్ర‌యించారు.

వాట్సాప్‌ తలాక్‌

Submitted by lakshman on Thu, 12/21/2017 - 21:08

 కరీంనగర్‌లో ఓ ముస్లిం మహిళకు భర్త వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. మరో మహిళలను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాధిత మహిళ... అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. కోర్టు తీర్పును కూడా లెక్కచెయ్యడం లేదంటూ మహిళ ఆవేదన చెందుతుంది. అయితే ఇస్లాం నిబంధనల ప్రకారమే తలాక్‌ చెప్పానని, డబ్బుల కోసమే ఆమె ఇలా డ్రామా చేస్తుందంటూ భర్త ఆరోపిస్తున్నాడు.