Amrapali

వైభవంగా కలెక్టర్‌ అమ్రపాలి వివాహం

Submitted by arun on Mon, 02/19/2018 - 11:04

 

జమ్ము, కాశ్మీర్‌లో ఐపీఎస్‌ అధికారితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి వివాహాం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ నెల 21 వరకు కలెక్టర్‌ దంపతులు జమ్మూలోనే ఉంటారు. అమ్రపాలి మ్యారెజ్‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో ఈ నెల 23న, వరంగల్‌లో 25న నిర్వహించబోతున్నారు. ఇదే నెల 26 కొత్త దంపతులు హానీమూన్‌ కోసం టర్కీకి వెళ్లనున్నారు. తిరిగి మార్చి ఏడున తిరిగి ఇండియాకి రానున్నారు. 

 

ఆమ్రపాలి పెళ్లి కూతురాయెనే..

Submitted by arun on Sun, 02/18/2018 - 09:32

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి కూతురయ్యారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మతో ఇవాళ పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమ్రపాలిని సంప్రదాయ పద్ధతిలో పెళ్ళికూతురిని చేశారు. అందంగా ముస్తాబైన అమ్రపాలి.. పెళ్లికూతురు గెటప్ లో తన చెల్లెలితో కలిసి ఫొటోకు పోజిచ్చారు. ఈ నెల 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో మిత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమ్రపాలి విందు ఇవ్వనున్నారు.
 

కలెక్టరమ్మ ప్రేమ కథ!

Submitted by arun on Wed, 02/14/2018 - 17:12

యంగ్ అండ్ డైనమిక్.... అట్రాక్ట్ చేసే అందం. చిన్న వయస్సులోనే ఉన్నత స్థాయి. కట్టిపడేసే చలాకీ తనం అమె సొంతం. జిల్లా ప్రథమ పౌరురాలిగా .... విధుల్లోనూ తనకు తానే సాటి. ఆ ఐఏఎస్ కూడా ప్రేమలో పడింది. ఐపీఎస్ కు మనసిచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి బంధానికి చేరుకుంది. త్వరలోనే మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా ప్రేమికురాలు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.
  

అదిరిపోయిన ఆమ్రపాలి వెడ్డింగ్ కార్డు

Submitted by arun on Sat, 02/10/2018 - 17:41

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే.. ఒక కలెక్టర్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే కేవలం ఆమె పనితీరు మాత్రమే.. ఒక అధికారిగా కాకుండా మాములు వ్యక్తి గా ఆమె అందరిని ఆకర్షించింది.. అయితే ఈ నెల 18న ఆమె ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకోనుంది.. ఈ ఇరువురి వివాహం జమ్మూ కశ్మీర్‌లో వీరి పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన సమీర్ శర్మతో ఆమ్రపాలి ప్రేమలో ఉండి చివరకు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నెల 23వ తేదీన వరంగల్‌, 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు.
 

ఆమ్రపాలి పెళ్లి డేట్ ఫిక్స్

Submitted by arun on Sat, 02/10/2018 - 17:31

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ ఐఎఎస్ పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ పుల్‌స్టాప్ పడేలా పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 18న ఐపీఎస్ సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. కాగా పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది.

కలెక్టర్ ఆమ్రపాలి ‘నవ్వుల ప్రసంగం’పై సర్కార్ సీరియస్

Submitted by arun on Mon, 01/29/2018 - 18:32

గణతంత్ర వేడుకల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్పీ సింగ్‌  సీరియస్ అయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూసుకోవడంతో నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్ వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

వచ్చే నెలలో కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి.. వరుడు ఎవరంటే...

Submitted by arun on Mon, 01/22/2018 - 11:12

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి జమ్మూకశ్మీర్‌లో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు.

కారు జప్తుపై స్పందించిన కలెక్టర్ ఆమ్రపాలి

Submitted by arun on Sat, 01/20/2018 - 17:15

కారు జప్తుపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్పందించారు. వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కిషన్‌పురలో ఉంటున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన  భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయం కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అయితే 2014 నాటికి 3,30,958 అద్దె చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలేదు.  

కలెక్టర్‌ అమ్రపాలికి కోర్టు షాక్‌

Submitted by arun on Sat, 01/20/2018 - 13:46

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్‌ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్‌ వాహనం జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయానికి వాడుకుంటూ...రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... జిల్లా కలెక్టర్‌ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.