attharintiki daaredi

నాలుగేళ్ల 'అత్తారింటికి దారేది'

Submitted by kasi on Wed, 09/27/2017 - 11:08

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే అత్తారింటికి దారేది చిత్రం'. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా.. అత‌ని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే టైటిల్ పెట్ట‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుద‌ల‌కి ముందు లీక‌యినా.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించడం అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాలో కంటెంట్ బ‌లంగా ఉంటే..

మ‌రో రీమేక్‌లో సుదీప్‌

Submitted by kasi on Thu, 09/21/2017 - 12:33

'ఈగ' చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. క‌న్న‌డ చిత్రాల్లో హీరోగా న‌టించే సుదీప్ తాజాగా ఓ రీమేక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించిన 'విక్ర‌మ్ వేద' ఆధారంగా ఈ క‌న్న‌డ  సినిమా తెర‌కెక్క‌నుంది. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ప‌వ‌న్‌కిది వ‌రుస‌గా నాలుగోసారి

Submitted by kasi on Fri, 09/15/2017 - 17:58

 ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. విడుద‌ల‌ రోజు క‌చ్చితంగా పండ‌గ వాతావ‌రణం క‌నిపిస్తుంది. చిత్రంగా.. 'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించే ప్ర‌తి సినిమా కూడా పండ‌గ సంద‌ర్భాల్లోనే  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.  'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించిన 'గోపాల గోపాల' 2015 సంక్రాంతికి విడుద‌లైతే.. ఆ త‌రువాత వ‌చ్చిన 'స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్' 2016 ఉగాదికి రిలీజైంది. అలాగే ప‌వ‌న్ గ‌త చిత్రం 'కాట‌మ‌రాయుడు' కూడా ఈ ఏడాది ఉగాదికే వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ 25వ చిత్రం కూడా 2018 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చూస్తుంటే..

త్రివిక్ర‌మ్‌కిదే మొద‌టిసారి

Submitted by kasi on Fri, 09/15/2017 - 17:25

దర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ వ‌య‌సు 8 సినిమాలు. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాల్లో సింహ‌భాగం విజ‌యాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌న తొమ్మిదో చిత్రాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్నాడీ మాట‌ల మాంత్రికుడు. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రమిది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి విడుద‌ల తేదిని మాత్రం జ‌న‌వ‌రి 10గా ఖాయం చేశారు. విశేష‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఏ చిత్రం కూడా సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల కాలేదు.