it raids

తమిళనాడులోనూ ఐటీ దాడులు...ఏక కాలంలో వంద చోట్ల సోదాలు

Submitted by arun on Thu, 10/25/2018 - 12:32

తమిళనాడు ఇసుక మాఫియాపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో దాదాపు 100 ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు. నాలుగు ఇసుక మైనింగ్ కంపెనీల యజమానులు, వారి బంధుమిత్రులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. న్యూస్ 7 అధినేత వైకుందరాజన్, వీవీ మినరల్ కంపెనీ, మణికందన్, చంద్రసేన్, సుకుమార్ తదితరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. సముద్రపు ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం సేకరించిన అధికారులు, ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆపరేషన్‌ గరుడలో భాగమే

Submitted by arun on Fri, 10/12/2018 - 12:10

ఏపీలో ఐటీ దాడులపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోడీ కక్ష గట్టారని విమర్శించారు. కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు అని అన్నందుకే ఎంపీ సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్‌ స్పష్టం చేశారు.

మేం కరుడుగట్టిన టీడీపీ వాదులం.. మేం మీకు లొంగం

Submitted by arun on Fri, 10/12/2018 - 11:48

కక్ష సాధింపులో భాగంగానే తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్‌. ఐటీ దాడుల వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నారు. అన్ని చట్టపరిధిలోనే ఉన్నాయి.. తాము చట్టానికి వ్యతిరేకంగా పోలేదని సీఎం రమేష్‌ తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంటే.. తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్. తాము కరుడుగట్టిన టీడీపీ వాదులమని.. తమను ఎవరు లొంగదీసుకోలేరని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం రమేష్ తెలిపారు. 

నెక్ట్స్‌ ఎవరు...హడలెత్తిస్తున్న ఐటీ దాడులు...

Submitted by arun on Mon, 10/01/2018 - 16:24

వరుస కేసులతో కాంగ్రెస్‌ నాయకుల్లో వణుకుపుడుతోంది. గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి. తర్వాత క్యూ లో ఉన్నదెవరు..? రాజకీయ కక్షలు అనే ఆరోపణలు కావచ్చు లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందేమో కావచ్చు ఏదేమైనా వరుసగా కాంగ్రెస్‌ నాయకులు రకరకాల కేసుల్లో చిక్కుకుంటున్నారు. మరి తర్వాత ఎవరు..? ప్రతిపక్ష పార్టీలో తదుపరి గురి ఎవరిపై..? అధికారులు ఎవరిని టార్గెట్‌ చేయబోతున్నారు..? 

Tags

ఆస్తుల చిట్టా విప్పిన రేవంత్‌

Submitted by arun on Sat, 09/29/2018 - 16:32

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను  విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు.

చెప్పింది గోరంత..బయట పడుతోంది కొండంత: రామారావు

Submitted by arun on Fri, 09/28/2018 - 12:40

రేవంత్ రెడ్డి సంస్ధలపై రెండు నెలల పాటు సమాచారం సేకరించాకే .. దర్యాప్తు సంస్ధలను ఆశ్రయించినట్టు న్యాయవాది రామారావు తెలిపారు. దర్యాప్తు సంస్ధల విచారణ నుంచి తప్పించుకునేందుకు రాజకీయ కుట్రలంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదులో తాను చెప్పిన దాని కంటే ఎక్కువ మొత్తంలోనే అక్రమాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. పన్నులు కట్టకుండా తప్పించుకునేందుకు 19 డొల్లకంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించారన్నారు. ఈ వ్యవహారంలో 15 రోజుల ముందే రేవంత్‌కు ఐటీ నోటీసులు అందాయని న్యాయవాది రామారావు తెలిపారు.

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు‌: షబ్బీర్ అలీ

Submitted by arun on Thu, 09/27/2018 - 17:25

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేసి భయాందోళనలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ పాస్ పోర్టులతో విదేశాలకు పంపించారని జగ్గారెడ్డిని అరెస్టు చేయించారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసి ఐటీ సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసులు, సోదాలకు భయపడేది లేదన్న ఆయన కేసీఆర్‌కు పిచ్చిపట్టి ఏదో ఒకటి చేయాలని ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు షబ్బీర్ అలీ. 
 

ఓటుకు నోటు కేసు: సెబాస్టియన్ ఇంట్లోనూ ఐటీ సోదాలు

Submitted by arun on Thu, 09/27/2018 - 13:56

కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల నేపధ్యంలో ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి వచ్చింది. రేవంత్‌ రెడ్డితో పాటు బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్న ఐటీ, ఈడీ అధికారులు ... తాజాగా ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు సెబాస్టియస్‌‌ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మోతీనగర్‌లోని స్వస్తిక్‌ కాంప్లెక్స్‌లో ఐటీ అధికారులు తనఖీలు చేపట్టారు. డోర్స్‌ లాక్‌ చేసి సెబాస్టియన్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం

Submitted by arun on Thu, 09/27/2018 - 13:33

రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం వెలుగు చూసింది.  జూన్‌ 27వ తేదిన రామారావు అనే న్యాయవాది రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. మనీల్యాండరింగ్ ద్వారా మూడు వందల కోట్ల నగదు దారి మళ్లించారంటూ రామారావు గతంలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్ధలకు నగదు మళ్లించినట్టు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.  నగదు మళ్లిన సంస్దలు రేవంత్ కంపెనీల చిరునామాలతో ఉన్నట్టు ఫిర్యాదులో  రామారావు పేర్కొన్నారు.  దీనిపై స్పందించిన సీబీఐ విచారణ జరపాలంటూ ఈడీ,ఐటీలను ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. 
 

పవన్ సంచలన కామెంట్స్ : నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయి

Submitted by arun on Wed, 03/07/2018 - 17:10

కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాల‌ను బెదిరించి, ప‌రిపాలించాల‌ని చుస్తోంద‌న్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్. కేంద్రం అన్ని రాష్ట్రాల పట్ల బాధ్యత‌గా వ్యవ‌హారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో అన్నీపార్టీలు.. ప్రజ‌ల బాగ‌స్వామ్యం లేకుండానే పోరాటం చేస్తోన్నాయిని పవన్ ఆరోంచారు.