nara lokesh

‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’

Submitted by arun on Sat, 07/14/2018 - 10:34

రానున్న ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లోకేష్ అడిగితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట సీటును ఇచ్చేస్తానని చెప్పారు. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వడానికి 175 నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోకేష్ కు సీటు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.

2019 ఎన్నికల బరిలో లోకేష్.. ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారంటే...

Submitted by arun on Thu, 06/28/2018 - 16:10

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటూ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. 2019 ఎన్నికల్లో బరిలోకి  దిగుతానంటూ ప్రకటించడంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. గెలుపుకంటే బంపర్ మెజార్టే లక్ష్యంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, మామ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం తనయుడు నారా లోకేష్‌ 2019 ఎన్నికలపై దృష్టి సారించారు.

లోకేష్‌ మామూలు పప్పు కాదు: రోజా

Submitted by arun on Thu, 06/28/2018 - 15:57

హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు. కంపెనీలు తెచ్చామని లోకేష్‌ గొప్పలు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలంటూ ఆమె మండిపడ్డారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లం: నారా లోకేశ్

Submitted by arun on Tue, 06/26/2018 - 17:48

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమన్నారు మంత్రి నారా లోకేశ్. మీడియాతో చిట్‌చాట్ చేసిన లోకేశ్... ముందస్తు ఎన్నికలను రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని, టీడీపీ ఐదేళ్ల పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. మోడీ హామీలు అమలు చేయకపోవడంపై టీడీపీ చిత్తశుద్ధితో పోరాడుతుందని చెప్పారు లోకేశ్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే లోపల వేస్తామని హెచ్చరించారు. సైబర్ చట్టం ప్రకారం వ్యవహరిస్తామన్నారు.

జగన్మోహన్‌ రెడ్డి పేరు మారింది: నారా లోకేశ్‌

Submitted by arun on Thu, 06/21/2018 - 16:31

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటిస్తోన్న లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్‌, పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భ‌యంప‌ట్టుకుంద‌ని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్‌ మోడీ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

లోకేశ్‌ ట్విట్టర్‌ నాయుడులా వ్యవహరిస్తున్నారు

Submitted by arun on Mon, 06/18/2018 - 17:05

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. అవగాహన లేకుండా నియోజకవర్గాల అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఇవ్వాలని 36 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామంటూ ట్విట్టర్‌లో చెప్పిన లోకేశ్‌ను...ట్విట్టర్‌ నాయుడుగా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గ నిధులపై మంత్రి లోకేశ్‌ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.

ట్విట్టర్‌లో జగన్ పై లోకేష్ సెటైర్లు

Submitted by arun on Tue, 06/12/2018 - 14:15

సహజ వనరులను దోచుకుంటున్నారని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని.. ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్‌లో విమర్శించారు.. అసలు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న తర్వాత ఏమైనా మిగిలిందా అంటూ సెటైర్లు వేసిన లోకేష్... జగన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లుగా సహజ ఖనిజాలైన.. బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నాడన్నారు.. నీ మీద ఉన్న 13 ఛార్జ్ షీట్లలో నువ్వు దోచుకున్న మెనూ మొత్తం ఉందని ఒక్కసారి చూసుకో.. అంటూ విమర్శించారు.. రాష్ట్రంలో సహజవనరులను సీఎం, లోకేష్‌తో పాటు, టీడీపీ నేతలు దోపిడీ చేసి, దాచుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సందర్భంగా నిన్న జరిగిన సభలో ఆరోపించిన విషయం తెలిసిందే.

పవన్‌ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్

Submitted by arun on Sat, 06/09/2018 - 17:02

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా… చంద్రబాబు సర్కార్‌ విదేశీయులకు కట్టబెడుతోందంటూ విశాఖ జిల్లాలో శుక్రవారం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. పవన్ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ… ఎవరికి, ఎక్కడ భూములు కేటాయించామో వివరించారు.

జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై లోకేశ్ కౌంటర్

Submitted by arun on Tue, 06/05/2018 - 13:41

బీజేపీ నాయకుడు.. జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. యూసీలు సరిగ్గా లేవని చెప్పడానికి ఆయన ఎవరంటూ ట్వీట్ చేశారు. ఒకవేళ యూసీలు సరిగ్గా లేకపోతే.. కేంద్రంలోని సంబంధిత శాఖలు చూసుకుంటాయని.. తెలిపారు. అయితే ఆయా శాఖలన్నీ రాష్ట్రం పంపించిన యూసీలను ఆమోదించాయని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందన్న లోకేశ్.. ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి నెరవేర్చేందుకు యూసీలు అవసరమా అని.. లోకేశ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. 

నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌‌

Submitted by arun on Tue, 06/05/2018 - 13:00

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్‌ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న ఆమె.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. ‘‘నారా లోకేశ్‌ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.