trailer

దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల

Submitted by arun on Mon, 06/11/2018 - 14:50

అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి దఢక్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న జాన్వి... ట్రైలర్ లో అద్భుతంగా నటించింది..  మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సైరాట్ కు ఇది రీమేక్‌గా రాబోతుండతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మరింత హైప్‌ని క్రియేట్ ను చేస్తోంది. వచ్చేనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్. మరాఠాలో హిట్టయిన ‘సైరత్’కి ఇది రీమేక్. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం..

అజ్ఞాతవాసి చంద్ర‌బాబు కోస‌మా..జ‌గ‌న్ కోస‌మా

Submitted by lakshman on Tue, 01/09/2018 - 13:01

అజ్ఞాతవాసి సినిమాలోని ఆ ఒక్క‌డైలాగ్ ను రాజకీయ పార్టీకి చెందిన నేత‌లు ఆపాదించుకుంటున్నారు. ఆ డైలాగ్ నీదంటే నీద‌ని తెగ కామెంట్లు చేసుకుంటున్నారు. ఏ కామెంట్లు ఎలా ఉన్నా ఆ ఒక్క‌డైలాగ్ మాత్రం ఇప్పుడు పొలిటిక‌ల్ గా వైర‌ల్ అవుతుంది. రీసెంట్ గా అజ్ఞాతవాసి ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. అందులో పొలిటిక‌ల్ యాంగిల్ ను క‌వ‌ర్ చేసేలా 'వీడు మళ్లీ సైకిల్‌ ఎక్కుతాడంటావా వర్మా?' అని అడిగితే 'వాడు ఏది ఎక్కినా ఫర్వాలేదు కానీ మనల్ని ఎక్కకుండా వుంటే అదే చాలు' అని డైలాగ్ ఉంది. ఇప్పుడా డైలాగ్ తో  తెలుగుత‌మ్ముళ్లు - వైసీపీ నేత‌లు  ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

మహేశ్ బాబు స్పైడర్ సినిమా ట్రైలర్ విడుదల

Submitted by lakshman on Fri, 09/15/2017 - 15:52

మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 2మిలియన్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగింది. మురుగదాస్ మేకింగ్, మహేశ్ బాబు యాక్టింగ్‌ కలిస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌లో విలన్‌కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్, విలన్ సృష్టించే విధ్వంసం, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సంభాషణలను కనిపిస్తాయి.