syraa narasimha reddy

న‌య‌న్‌..నెగటివ్ ట‌చ్‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 16:27

ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రూ.3 కోట్ల‌కి పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెది న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ని.. ఆ పాత్ర‌లో కాస్త నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌య‌న్‌

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 20:54

తెలుగులో 'మ‌యూరి'గా వ‌చ్చిన త‌మిళ చిత్రం 'మాయ'.. కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార కెరీర్ గ్రాఫ్‌నే మార్చివేసింది. న‌య‌న్ 'లేడీ సూప‌ర్‌స్టార్ 'అని పిలిపించుకోవ‌డానికి ఈ సినిమా కూడా ఓ కార‌ణంగా నిలిచింది. ఈ చిత్రం త‌రువాత 'డొర'తో పాటు 'అర‌మ్' త‌దిత‌ర హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన న‌య‌న‌తార‌.. తాజాగా మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంత‌కం చేసింది.

చిరంజీవి న‌ట‌న‌కి 39 ఏళ్లు

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 19:34

'ప్రాణం ఖ‌రీదు'.. మెగాస్టార్ చిరంజీవిని తెలుగు తెర‌కు అందించిన సినిమా ఇది. చిరు సంత‌కం చేసిన తొలి సినిమా 'పునాది రాళ్లు' అయినా.. తెర‌పైకి వ‌చ్చిన తొలి చిత్రం మాత్రం 'ప్రాణం ఖ‌రీదు'నే. కె.వాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్ర‌మోహ‌న్‌, జ‌య‌సుధ‌, రావు గోపాల‌రావు, కోట శ్రీ‌నివాస‌రావు, రేష్మారాయ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌మందించ‌గా.. జాలాది సాహిత్యంలో వ‌చ్చిన 'ఏత‌మేసి తోడినా ఏరు ఎండ‌దు' అనే పాట బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. 1978, సెప్టెంబ‌ర్ 22న విడుద‌లైన 'ప్రాణం ఖ‌రీదు'.. నేటితో 39 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది. అంటే.. చిరు న‌ట‌న‌కి 39 ఏళ్లు నిండాయ‌న్న‌మాట‌.

'సైరా'.. రెగ్యుల‌ర్ షూటింగ్ అప్ప‌ట్నుంచే

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 11:49

'ఖైదీ నెం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు త‌న 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్నారు. 'సైరా న‌ర‌సింహారెడ్డి' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గ‌త నెల లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యింది. అలాగే చిరు పుట్టిన‌రోజున ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంతో వ‌చ్చిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల్ని అల‌రించింది. 

సురేంద‌ర్‌కి ఆ విష‌యంలో బ్రేక్ ప‌డుతోంది

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 12:19

రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. 12 ఏళ్ల కెరీర్‌లో 8 చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కెరీర్ ప్రారంభంలో సంవ‌త్స‌రానికో సినిమా అన్న‌ట్లుగా ఉన్న సూరి.. త‌రువాత రెండేళ్ల‌కో సినిమా అన్న‌ట్లుగా త‌న‌ శైలిని మార్చుకున్నాడు. అయితే 2014లో వ‌చ్చిన 'రేసు గుర్రం' త‌రువాత వ‌రుస‌గా 'కిక్ 2' (2015), 'ధృవ' (2016) చిత్రాలు చేసి.. మ‌ళ్లీ సంవ‌త్స‌రానికో సినిమా అంటూ పాత రూటునే ఎంచుకున్నాడు.

'సైరా న‌ర‌సింహారెడ్డి'లో సునీల్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 11:24

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' భారీ తారాగ‌ణంతో, టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

'సైరా' తోనైనా బ్రేక్ చేస్తాడా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:27

 

జ‌యాప‌జ‌యాలు అనేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ సాధార‌ణం. కాక‌పోతే.. ఒక్కోసారి వ‌రుస‌గా విజ‌యాలు ప‌ల‌క‌రిస్తే.. మ‌రోసారి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తాయి. అయితే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్  రెడ్డి విష‌యంలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుందీ ప‌రిస్థితి. 'కిక్' నుంచి సురేంద‌ర్ రెడ్డి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ హిట్, ఆ త‌రువాత ఫ్లాప్,  ఆ త‌రువాత మ‌ళ్లీ హిట్ .. ఇలా సినిమాకో ఫ‌లితం వ‌స్తోంది.

నాగ్ త‌ర్వాత చిరుతో?

Submitted by nanireddy on Tue, 09/05/2017 - 11:00

ఇప్ప‌టివ‌ర‌కు అర‌డ‌జ‌ను సినిమాలు చేసినా.. ఒక్క‌టంటే ఒక్క విజ‌యం కూడా సొంతం చేసుకోలేకపోయింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 'కంచె' చిత్రంతో న‌టిగా మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఆ సినిమా కార‌ణంగానే ఇప్ప‌టికీ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది. ఆ మ‌ధ్య నాగార్జున, కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంలో ఇలాగే ఛాన్స్ కొట్టేసింది ప్ర‌గ్యా. ఆ సినిమాలో ఆమెది చిన్న వేష‌మే అయినా.. నాగ్‌తో ఓ రొమాంటిక్ సాంగ్‌లో క‌నిపించి గ్లామ‌ర్ ప్రియుల‌ను మెప్పించింది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో.. ఇక ప్ర‌గ్యాకి పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్లు క‌ష్ట‌మే అనుకున్నారు. అయితే అనూహ్యంగా..