anushka

నువ్వు లేకుండా నేను లేను.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

Submitted by arun on Tue, 07/31/2018 - 13:19

అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసిన అనుష్క 'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అనుష్క త‌న త‌ల్లి బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. త‌ల్లి ప్ర‌పుల్లా శెట్టి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పున‌స్క‌రించుకొని తల్లి చేత కేక్ క‌ట్ చేయించింది ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. `నువ్వు, నీ ప్రేమ‌ లేక‌పోతే నేను ఏ ప‌నీ చేయ‌లేను. నువ్వు నా ప‌క్క‌నుంటే జీవితంలో ఏదైనా సాధించ‌గ‌లుగుతాను.

నా కూతురికి ప్రభాస్ వంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలి: అనుష్క తల్లి

Submitted by arun on Thu, 07/19/2018 - 17:34

టాలీవుడ్ నటీనటులు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులపై వాళ్లిద్దరూ స్వయంగా స్పందించినప్పటికీ ఆ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలనే ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి’’ అని తెలిపారు. రీసెంట్ గా అనుష్క కూడా ఈ విషయంపై మాట్లాడింది.

భానుమ‌తిగా అనుష్క‌

Submitted by lakshman on Sun, 02/18/2018 - 18:54

"నేత్రాభినయంతోనే జన స్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామని ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. అంత‌టి మ‌హ‌న‌టిని బ‌యోపిక్ గా  తెర‌కెక్కుతుంది. నాగ్ అశ్విన్ డైర‌క్ట‌ర్ గా, వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ లో షూటింగ్ కొన‌సాగుతుంది.

అనుష్క ‘భాగమతి’పై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Fri, 01/26/2018 - 14:25

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ స్పందన రావడంతో చిత్ర యూనిట్ సంబరాలకు సిద్ధమైంది. భాగమతి సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ కూడా రివ్యూ ఇచ్చాడు. భాగమతి సినిమా హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్ అని ట్వీట్ చేశాడు. అనుష్క తన పాత్రలకు న్యాయం చేసిందన్నాడు. జయరామ్, ఆషాశరత్ సరికొత్తగా కనిపించారని చెప్పాడు.

‘భాగమతి’పై మారుతి కామెంట్

Submitted by arun on Fri, 01/26/2018 - 12:51

అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్‌ రోల్‌ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన డైరెక్టర్ మారుతి సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.
 

ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో స్వీటీ

Submitted by lakshman on Sat, 01/13/2018 - 13:50

అస‌లే హిట్ పెయిర్ అయిన  ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు. ప్ర‌భాస్ - అనుష్క‌లు నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసి వ‌రుస బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కొట్టారు. దీంతో వారిపై ఏదో ఒక‌రూమ‌ర్ క్రియేట్ అవుతూనే ఉంది. తాజాగా రూమ‌ర్లుకు అగ్నికి ఆజ్యం పోసేలా అనుష్క సాహో షూటింగ్ లో ద‌ర్శ‌నిమిచ్చింది.