Sports

మాస్టర్ @ 45

Submitted by arun on Tue, 04/24/2018 - 16:11

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ 45వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. క్రికెటర్ గా, రాజ్యసభ సభ్యుడిగా రిటైరైన
సచిన్ ప్రస్తుతం క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా వ్యవహరిస్తూనే పలు రకాల సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. తన పూర్తిసమయాన్ని కుటుంబానికే కేటాయిస్తూ గడుపుతున్నాడు. 

తల్లి కాబోతున్న సానియా

Submitted by arun on Tue, 04/24/2018 - 14:29

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది, అక్టోబర్‌ నెలలో సానియా మీర్జా అమ్మతనాన్ని ఆస్వాదించనుంది. పుట్టబోయే బిడ్డకు మీర్జామాలిక్ అని పేరు పెట్టాలని షోయబ్‌ మాలిక్‌, సానియా మీర్జా డిసైడ్ అయ్యారు.

నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్‌

Submitted by arun on Fri, 04/20/2018 - 17:23

ఐపీఎల్ 11వ సీజన్లో తాను సాధించిన సెంచరీని ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న తన కుమార్తెకు అంకితమిస్తున్నట్లు కింగ్స్ పంజాప్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రకటించాడు. తనకు వయసైపోయిందీ తన పనైపోయిందంటూ వేలంలో తనను ఏమాత్రం పట్టించుకోని ఫ్రాంచైజీలు, విమర్శకులకు తన ఈ సెంచరీనే సమాధానమని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంటూ గేల్ చెప్పాడు. వేలంలో తనను ఫ్రాంచైజీలు
పక్కనపెట్టినా కింగ్స్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనను ఎంపిక చేయడం ద్వారా ఐపీఎల్ ను కాపాడాడని గుర్తు చేశాడు. కనీసం రెండుమ్యాచ్ ల్లో విజయాలు అందించమని తనను సెహ్వాగ్ కోరాడని

విరాట్ కళ కళ...బెంగళూరు వెల వెల

Submitted by arun on Wed, 04/18/2018 - 17:14

ఐపీఎల్ 11వ సీజన్ మొదటి 14 మ్యాచ్ లు ముగిసే సమయానికి...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ముంబై వాంఖెడీ స్టేడియం

ధావన్‌ కొంటె పని.!

Submitted by arun on Tue, 04/17/2018 - 18:00

టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్.. టీమ్ మేట్స్‌ను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఐపీఎల్ పదకొండో సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో ధావన్ మాంచి మూడ్‌లో ఉన్నాడు. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని  సోషల్‌ మీడియాలో​ పంచుకుంటున్నారు.

బీజేపీలోకి ద్రవిడ్‌..కుంబ్లే ?

Submitted by arun on Tue, 04/17/2018 - 16:32

టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరినీ ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఐతే, వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.

ఐపీఎల్ లో క్రిస్ గేల్ హవా షురూ

Submitted by arun on Mon, 04/16/2018 - 16:40

ఓడలు బళ్లు...బళ్లు ఓడలు అన్నమాట ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు అతికినట్లు సరిపోతుంది. ఐపీఎల్ గత సీజన్ వరకూ బెంగలూరు రాయల్ చాలెంజర్స్ ప్రధాన ఆటగాడిగా ఏడాదికి 10 కోట్ల రూపాయల వరకూ అందుకొన్న గేల్ 11వ సీజన్ వేలంలో ఎవరికీ అవసరం లేని ఆటగాడిగా మిగిలాడు. అయితే కింగ్స్ పంజాబ్ మెంటార్ కమ్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ చొరవతో కనీసధర 2 కోట్ల రూపాయలకే క్రిస్ గేల్ ను తమజట్టులో చేర్చుకొంది. అంతేకాదు ప్రస్తుత సీజన్లో తన తొలిమ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ఆడిన గేల్ కేవలం 33 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 63 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

నాన్నకు ప్రేమతో.....

Submitted by arun on Mon, 04/16/2018 - 16:31

కంటే కూతుర్నే కనాలి ...అన్నమాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తండ్రి హర్ వీర్ సింగ్ కు అతికినట్లు సరిపోతుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదిగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో టీమ్, వ్యక్తిగత విభాగాలలో స్వర్ణపతకాలు సాధించిన తన బంగారు కొండ సైనా ను చూసి ఆమెతండ్రి హర్ వీర్ సింగ్ మురిసిపోతున్నారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు.

సైనా వర్సెస్ పీవీ సింధూ...

Submitted by arun on Sat, 04/14/2018 - 13:00

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. 2010లో బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సైనా... గాయాల కారణంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో నిరాశగా వెనుదిరిన సంగతి తెలిసిందే.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

Submitted by arun on Sat, 04/14/2018 - 11:17

21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఈ రోజు స్వర్ణాల పంట పండింది. భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు, ఓ రజతాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో మేరికోమ్ స్వర్ణాన్ని దక్కించుకోగా ... 52 కిలోల బాక్సింగ్ విభాగంలో గౌరవ్ సోలంకి మరో స్వర్ణాన్ని  కైవసం చేసుకున్నాడు. 50 మీటర్ల షూటింగ్ లో రాజ్‌పుత్ స్వర్ణాన్ని  దక్కించుకోగా బాక్సింగ్ పురుషుల 49 కిలోల విభాగంలో అమిత్ రజతాన్ని సాధించాడు.  దీంతో భారత్ ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు దక్కించుకుని మూడో  స్ధానంలో కొనసాగుతోంది.