Telangana cabinet

మంత్రిగా ప్రమాణస్వీకారంచేసే ఆ ఒక్కరు ఎవరు...ఆ ఇద్దరిలో ఒకరు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ

Submitted by arun on Thu, 12/13/2018 - 10:13

గులాబీ బాస్‌ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని కేసీఆరే స్వయంగా చెప్పారు. దాంతో ఆ ఒక్కరూ ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుత అసెంబ్లీలో తానే సీనియర్‌ ఎమ్మెల్యేనన్న కేసీఆర్‌ ఆ తర్వాత రెడ్యానాయక్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారన్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరుంటారనే చర్చ జరుగుతోంది, అదే సమయంలో ఈటల రాజేందర్‌, కడియం శ్రీహరిల్లో ఒకరు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చనే టాక్‌ నడుస్తోంది.  

ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌

Submitted by arun on Thu, 09/06/2018 - 14:33

అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు. ఇక.. అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్‌ కార్యాలయం పంపించింది. ఎన్నికలపై  కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం.

రెండు నిమిషాల్లోనే ముగిసిన మంత్రివర్గ సమావేశం

Submitted by arun on Thu, 09/06/2018 - 13:58

ఉత్కంఠకు తెరపడింది. అనుకుంటున్నదే జరిగింది. 9 నెలలకు ముందుగానే అసెంబ్లీ రద్దయింది. ముందస్తుకు లైన్‌క్లియర్‌ చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకవాక‌్య తీర్మానం ఆమోదించింది. కేవలం రెండంటే రెండు నిమిషాలే భేటీ అయిన కేబినెట్‌ ఈ మేరకు రద్దుకే మొగ్గు చూపింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు ఏకవాక్యం తెరదించినట్టయింది. అసెంబ్లీ రద్దు తర్వాత ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్న పాలకపక్షం ఒకరకంగా ప్రతిపక్షానికి సవాల్‌ విసిరినట్టయింది. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాజీలవగా... ప్రభుత్వం అపద్ధర్మంగా కొనసాగనుంది. 

ముందస్తు ఉత్కంఠకు ఈ మధ్యాహ్నాంతో తెర ..?

Submitted by arun on Thu, 09/06/2018 - 11:35

క్షణం .. క్షణం ఉత్కంఠ రేపుతున్న ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు కాసేపట్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రగతి నివేదన సభ అనంతరం వరుస పరిణామాలతో అసెంబ్లీ రద్దు దాదాపు ఖాయమైంది.  మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే ముందు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఉన్న పళంగా హైదరాబాద్ రావాలంటూ ఎమ్మెల్యేలకు  సీఎంఓ కబురు పంపింది. ఎమ్మెల్యేల సూచనలతో పాటు తాజా పరిణామాలు , మంత్రి వర్గంలో తీసుకునే నిర్ణయాలపై చర్చించనున్నట్టు సమాచారం. 

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైందా?

Submitted by arun on Wed, 09/05/2018 - 15:56

ముందస్తు ఎన్నికలకు ఇక ముహూర్తం ఖరారే,

ఇగ రాష్టంలోని  రాజకీయ నిర్ద్యోగులంతా హుషారే,

పైసలు పంచడాలు, మందులో ముంచడాలు షురురే,

ఎన్నికలంటే ఎవరికి వచ్చెనో పండగలాగా మహా పబ్బారే. శ్రీ.కో. 

ఈ నెల 6న ముందస్తు కేబినెట్‌...పలు కీలక...

Submitted by arun on Tue, 09/04/2018 - 08:53

తెలంగాణ కేబినెట్‌ మరోసారి భేటీకానుంది. ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ శాసనసభ రద్దుకు సిఫార్సు చేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో రెండు రోజుల్లో జరగనున్న కేబినెట్ సమాశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలనపరమైన నిర్ణయాల కోసం ఒకసారి..  శాసనసభను రద్దు చేసే తీర్మానం చేయడానికి మరోసారి మంత్రిమండలి భేటీకానుందని ప్రచారం జరిగింది. అయితే, చివరికి మాత్రం ఒక సమావేశమే ఉండొచ్చని ఈ భేటీలోనే పలు విధానపరమైన నిర్ణయాలతోపాటు అసెంబ్లీ రద్దుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఐదుగురు మంత్రుల‌కు సీఎం కేసీఆర్ చెక్

Submitted by arun on Wed, 01/24/2018 - 11:08

కేబినెట్ విస్తరణకు తెలంగాణ సర్కార్ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందుకు దాదాపు మూహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గం విస్తరణ చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజుల నుంచి ఫామ్‌హౌజ్‌లో సీఎం.. పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 01/12/2018 - 16:48

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్న మాటలు నూటికి నూరుపాళ్లు వాస్తవమన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు క్యాబినెట్‌లో ఉన్నారని శ్రీనివాసగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అది తలుచుకుంటే కన్నీరు వస్తుందని వాపోయారు శ్రీనివాసగౌడ్‌. కేసీఆర్‌ నిర్ణయం వెనుక ఏదో కారణం ఉండి ఉండొచ్చన్న శ్రీనివాసగౌడ్‌.... ఉద్యోగులు లేనిదే అసలు సకల జనుల సమ్మె లేదన్నారు.