gang

అభిమానులపై మండిపడ్డ హీరో సూర్య

Submitted by arun on Fri, 01/19/2018 - 17:11

ప్రముఖ నటుడు సూర్య తన అభిమానులపై మండిపడ్డారు. మరొకసారి అలా చేయకండంటూ హెచ్చరించారు. అయితే అభిమానులపై ప్రేమతోనే ఇదంతా చేశాడు. సూర్య నటించిన తమిళ సినిమా ‘గ్యాంగ్’ సక్సెస్ మీట్ లో భాగంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో సూర్య సందడి చేశాడు. ఈ సందర్భంగా సూర్య అభిమానులు బైక్ లపై హెల్మెట్లు లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఇది గమనించిన సూర్య తన కారులో నుంచి కిందకు దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రివ్యూ: గ్యాంగ్‌

Submitted by arun on Fri, 01/12/2018 - 16:00

నటీనటులు : సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ , కార్తీక్‌
జానర్‌ : యాక్షన్‌, డ్రామా, వినోదం
దర్శకుడు : విఘ్నేశ్‌ శివన్‌
సంగీతం : అనిరుధ్‌
నిర్మాత : కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా

సూర్య హీరోగా, యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంయుక్తంగా నిర్మించిన ‘గ్యాంగ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడులైంది. మొదటిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తమిళ హీరో అయిన సూర్యకి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. తన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతుంటాయి. మరి సూర్య గత సినిమాల్లాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చేరువైందో లేదో తెలుసుకుందాం..