supreme court

ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు

Submitted by arun on Mon, 11/05/2018 - 14:42

ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తవుతుందని ఏపీ సర్కార్ వివరణ ఇచ్చింది. దీంతో జనవరి 1న ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, మౌలిక వసతులు పూర్తయ్యాక విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని వ్యాఖ్యానించింది. అప్పటి వరకు జడ్జిల నివాసాలు అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 
 

ఓటుకు నోటు కేసు.. ఫిబ్రవరిలో విచారణ

Submitted by arun on Fri, 11/02/2018 - 14:36

తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ త్వరితగతిన చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు... ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. అయితే, ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. 2015, మే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు లంచాలు ఇచ్చారని కోర్టుకు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టుకు తెలిపాడు.

రాఫెల్‌పై కేంద్రానికి సుప్రీం షాక్.. పదిరోజుల్లోగా..

Submitted by arun on Wed, 10/31/2018 - 17:18

వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ధరలు, వ్యూహాత్మక వివరాలు వెల్లడించాలంటూ ఆదేశించింది. పదిరోజుల్లోగా సీల్డ్ కవర్‌లో వివరాలు సమర్పించాలంటూ గడువు విధించింది. ఈ ఒప్పందంలో ఆఫ్‌సెట్ భాగస్వాముల వివరాలు కూడా చెప్పాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీం కోర్టులో సానా సతీష్‌కు చుక్కెదురు

Submitted by arun on Tue, 10/30/2018 - 12:30

హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ విచారణ నుంచి మినహాయించలేమన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన సమన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రాణహాని ఉంటే హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరించాల్సిందేనంటూ మరోసారి స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది. 
 

సీబీఐ డైరెక్టర్‌ వివాదంలో కీలక మలుపు

Submitted by arun on Fri, 10/26/2018 - 17:10

రచ్చకెక్కిన సీబీఐ అధినాయకుల వర్గ పోరు మరో మలుపు తిరిగింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్ ఆస్తానాలను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. కేంద్ర ఆదేశాలను సవాలు చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక ఆదేశాలిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, సీవీసీలకు నోటీసులు జారీ చేసింది.

బాణసంచా అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు

Submitted by arun on Tue, 10/23/2018 - 11:35

బాణసంచా అమ్మకాలు, తయారిపై దేశ అత్యున్నత న్యాయస్ధానం కీలక తీర్పునిచ్చింది. బాణసంచాను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరస్కరించిన న్యాయస్ధానం ఇది వరకే ఉన్న పలు నిబంధనలను గుర్తు చేసింది.  లైసెన్స్ ఉన్నవారు మాత్రమే విక్రయాలు జరపాలన్న కోర్టు తగిన భద్రత లేకుండా విక్రయాలు జరపరాదంటూ ఆదేశించింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో అమ్మకానికి అనుమతి నిరాకరించింది. బాణసంచాను రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్యే కాల్చాలంటూ సూచించింది. 
 

సుప్రీంకోర్టుకు చేరిన రాఫెల్ ఢీల్ వివాదం

Submitted by arun on Mon, 10/08/2018 - 14:53

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య రగులుతున్న వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 10న వీటిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం తాలూకు వివరాలతో పాటు ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాల ఒప్పందాల మధ్య ధరల వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్‌లో ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని లాయర్ వివేక్ ధండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కూడా వెల్లడించాలని ఆయన కోరారు.

భారత న్యాయవ్యవస్థ పై దీపక్ మిశ్రా చెరగని ముద్ర...పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులు

Submitted by arun on Tue, 10/02/2018 - 13:03

భారత న్యాయవ్యవస్థలో తమదైన ముద్ర వేసిన చీఫ్ జస్టిస్ లు అరుదుగా ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కూడా చేరారు. భారత్ 45వ చీఫ్ జస్టిస్ గా, సుమారు 14 నెలల కాలంలో  వివిధ ధర్మసనాల్లో ఉంటూ ఆయన ఇచ్చిన తీర్పులు సంచలనం సృష్టించాయి. గత నెల రోజుల కాలంలో ఆయన ఇచ్చిన తీర్పులు దేశంలో  న్యాయవ్యవస్థ చరిత్రలో మైలు రాళ్ళుగా నిలిచిపోతాయి. మరీ ముఖ్యంగా చివరి పది రోజుల్లో ఇచ్చిన తీర్పులు సంచలనం సృష్టించాయి. తాజాగా సోమవారం నాడు ఆయన తన చివరి పనిదినాన్ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తీర్పులు, అవి సృష్టించిన ప్రకంపనలు . గత వారం సుప్రీం కోర్టుకు ఈ ఏడాదిలో అత్యంత ముఖ్యమైన వారమైంది.

సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షోకాజ్‌ నోటీసులు

Submitted by arun on Fri, 09/28/2018 - 13:43

తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఓటర్ల జాబితాలో సుమారు 70 లక్షల ఓట్లపై స్పష్టత రావాల్సి ఉందంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణా ప్రభుత్వానికి షోకాజు నోటీసులు జారీ  చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు

Submitted by arun on Fri, 09/28/2018 - 13:32

భీమా కొరేగావ్ హింస కేసును దర్యాప్తు కొనసాగించడానికి పుణె పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పౌర హక్కుల నేతలు వరవర రావు, వెర్నన్ గొనె సాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖా అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పౌరహక్కుల సంఘం నేతల అరెస్టు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. సిట్ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.