Uttam Kumar Reddy

తొక్కారు.. గిల్లారు

Submitted by arun on Mon, 03/12/2018 - 17:43

తొక్కారు.. కొట్టారు.. గిల్లారు.. అణచివేశారు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. మార్షల్స్ పై చేస్తున్న ఆరోపణలు. అందుకే అసెంబ్లీలో తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే మార్షల్స్ తమపైకి దాడికి దిగారంటూ.. ఆరోపించారు. 

106 సీట్లొస్తే నేను తప్పుకొంటా

Submitted by arun on Thu, 03/01/2018 - 09:50

సంగారెడ్డి జిల్లాలో TPCC చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సక్సెస్ కావడం స్థానిక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల్లో అపూర్వ స్పందన రావడంతో కాంగ్రెస్ నాయకులు ఉబ్బితబ్బిబవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదనే ధీమా వ్యక్తమైంది. మొదటి విడత TPCC ప్రజాచైతన్య బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు సాగింది. సంగారెడ్డితో పాటు జహీరాబాద్, నారాయణ్ ఖేడ్‌లలో జరిగిన యాత్రకు మూడు చోట్లా అపూర్వ స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట నుంచి సంగారెడ్డి వరకు 5వేల బైకులతో ఘనస్వాగతం పలికారు.

బ‌స్సు యాత్ర వాయిదా..?

Submitted by arun on Sun, 02/18/2018 - 16:27

ప్రధాన ప్రతిపక్షంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఉత్తమ్ కుమార్ అధిష్టానాన్ని ఒప్పించి బస్సుయాత్రకు తేదీలు ఖరారు చేసుకుంటే.. సీనియర్లంతా మూకుమ్మడిగా విభేదించి, ఖరారైన తేదీలు మళ్లీ వాయిదా పడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరితో చర్చించకుండా బస్సుయాత్ర ఎలా చేస్తారని పార్టీ సీనియర్లంతా వ్యతిరేకించడంతో ఆ యాత్ర తేదీలు మరోసారి అయోమయంలో పడ్డాయి. 

మంత్రిగారి ముచ్చట్లు..రాహుల్ ను మించిన దద్దమ్మ ఎవరున్నారు

Submitted by arun on Thu, 02/08/2018 - 11:38

తెలంగాణ మంత్రి కేటీఆర్.. జాతీయ పార్టీల విధానాలపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయన్న కేటీఆర్.. మోడీ ఒకరు చెబితే వినే వ్యక్తి కాదంటూ నిష్టూరమాడారు. మిత్రపక్షం ఆందోళననే పట్టించుకోని బీజేపీ నేతలు తాము ఆందోళన చేస్తే పట్టించుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీల్లేవని పెద్ద ప్రాంతీయ పార్టీలు, చిన్న ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు కేటీఆర్. 

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య వెనుక వీరేశం హస్తముంది..

Submitted by arun on Mon, 02/05/2018 - 10:26

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నల్గొండ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాపం సభకు రాష్ట్ర కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా కదలి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉందని కదా అని రెచ్చిపోతే.. భవిష్యత్‌‌లో చింతించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా హెచ్చరించారు. నల్గొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యలో ఎమ్మెల్యే వీరేశం హస్తముందని మాజీ ఎంపీ వీహెచ్‌ ఆరోపించారు. లోకల్‌ పోలీసు అధికారులు కూడా అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.

బస్తీమే సవాల్‌: కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?

Submitted by arun on Thu, 02/01/2018 - 17:19

గద్వాలలో మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..కేటీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పకుంటుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పవర్ లోకి వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. 

శ్రీనివాస్‌ హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు ప్రధాన నిందితులు

Submitted by arun on Fri, 01/26/2018 - 18:16

బిడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు లొంగిపోయారు. శ్రీనివాస్‌ హత్యతో సంబంధం ఉన్న రాంబాబు, మల్లేష్‌, శరత్‌ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. శ్రీనివాస్‌ హత్య తర్వాత గోపి, చక్రి, దుర్గయ్య, మోహన్‌లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ పరామర్శించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య ముమ్మాటికీ ప్రభుత్వానిదే అని ఉత్తమ్‌ అన్నారు. శ్రీనివాస్‌ హత్యలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయం ఉందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

'శ్రీనివాస్‌ హత్య.. సూత్రధారి ఎమ్మెల్యే వీరేశం'

Submitted by arun on Fri, 01/26/2018 - 16:45

నల్గొండలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ పరామర్శించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య ముమ్మాటికీ ప్రభుత్వానిదే అని ఉత్తమ్‌ అన్నారు. శ్రీనివాస్‌ హత్యలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయం ఉందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ప్రాణభయం ఉందని శ్రీనివాస్‌ దంపతులు గతంలోనే సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. హత్య జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్న ఉత్తమ్

Submitted by arun on Thu, 01/11/2018 - 11:18

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌‌కు తిరుగులేదా ? ఆయన కెప్టెన్సీలోనే కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలకు వెళ్తుందా ? ఉత్తమ్‌ పనితీరుపై అధిష్టానం సంతృప్తిగా ఉందా ? అంటే అవునంటున్నాయ్ కాంగ్రెస్‌ వర్గాలు. ఉత్తమ్‌కు రెండో పీసీసీ చీఫ్‌గా కొనసాగించడమే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యమంటున్నారు.