high court

రోజాపై కామెంట్స్: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Submitted by arun on Tue, 09/18/2018 - 13:26

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే రోజా తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 

టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 12:35

టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపైదాఖలైన పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగేలా సభను నిర్వహిస్తున్నారంటూ న్యాయవాది శ్రీధర్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. అయితే లక్షలాది మంది ఒకే చోటుకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటూ పిటీషనర్ అభ్యంతరం లేవనెత్తారు. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ ..సభ ఏర్పాట్లను అడ్వకేట్ జనరల్ వివరించారు.

కోమటిరెడ్డి–సంపత్‌ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

Submitted by arun on Wed, 08/15/2018 - 10:55

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాల రద్దుపై హైకోర్టు సంచలనాత్మక చర్యలకు దిగింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల గన్‌మెన్లు ఎలా ఉపసంహరిస్తారంటూ తెలంగాణ డీజీపీతో పాటు రెండు జిల్లాల ఎస్పీలకు నోటీసులిచ్చింది.

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు

Submitted by arun on Tue, 08/14/2018 - 16:07

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే, అసెంబ్లీ, లా సెక్రటరీలు సెప్టెంబర్‌ 17న విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేత!

Submitted by arun on Tue, 08/14/2018 - 11:39

పరిపూర్ణానందస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. నెలరోజుల క్రితం పరిపూర్ణానంద స్వామిపై నగర పోలీసులు బహిష్కరణ విధించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయనహైకోర్టు కు వెళ్లారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ధర్మపురి సంజయ్‌కి కోర్టులో చుక్కెదురు..

Submitted by arun on Thu, 08/09/2018 - 11:23

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు ధర్మపురి సంజయ్‌కి బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలన్న వినతిని కూడా తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. నిజామాబాద్‌లోని శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన 11 విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులుకు పాల్పడినట్లు కేసు నమోదైంది.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Submitted by arun on Sat, 07/28/2018 - 07:17

తెలంగాణ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.

హైకోర్టును ఆశ్రయించిన కత్తి మహేశ్‌

Submitted by arun on Wed, 07/25/2018 - 17:19

హైదరాబాద్ బహిష్కరణ అంశాన్ని సీని విశ్లేషకుడు కత్తి మహేష్ హైకోర్టులో సవాలు చేశారు. తనపై పోలీసులు జారీ చేసిన హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులు రద్దు చేయలని పిటిషన్ దాఖలు చేశారు. కత్తి మహేష్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే.

బాలాపూర్ భూముల ఆక్రమణ

Submitted by arun on Thu, 07/12/2018 - 11:02

దేవతా గుట్టలను గుట్టుగా గుటకేస్తుంటే,

ప్రభుత్వ భూములను పంచుకు తింటుంటే,

అధికారులంతా అంధులైనారా అని,

అడిగెను, కడిగెను హైకోర్టు. శ్రీ.కో

హైకోర్టుకు స్వామి పరిపూర్ణానంద

Submitted by arun on Wed, 07/11/2018 - 16:35

స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనను హైదరాబాద్‌ నుంచి బహి‌ష్కరిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసిన పరిపూర్ణానంద తనపై బహిష్కరణ వేటు తొలగించేలా తెలంగాణ పోలీస్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన స్వామి పరిపూర్ణానంద ఇది భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనన్నారు.