Public Talk

‘రంగస్థలం’ పబ్లిక్ టాక్!

Submitted by arun on Fri, 03/30/2018 - 11:36

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ రంగస్థలం. ప్రపంచవ్యాప్తంగా 17వందల థియేటర్లలో విడుదలైంది. మూడు గంటల నిడివితో వచ్చిన రంగస్థలం...ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా సూపర్‌ హిట్‌ అంటూ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్‌ కళ్లకు కట్టినట్లు బాగా చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. 

‘ఏ మంత్రం వేసావె’ టాక్: సబ్జెక్ట్ ఉంది కానీ..!

Submitted by arun on Fri, 03/09/2018 - 14:38

సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం తర్వాత హీరో విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేసావే. వాస్తవానికి ఈ చిత్రం అర్జున్‌రెడ్డికి ముందే షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు శ్రీధర్ మర్రి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వ్యసనం, మోసాలు కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

‘తొలిప్రేమ’ టాక్: మాట నిలబెట్టుకున్న వరుణ్

Submitted by arun on Sat, 02/10/2018 - 10:56

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. యూత్ కి నచ్చేలా..అందమైన ప్రేమకథని అంతే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ వెంకి అట్లూరి. మ్యూజిక్ కూడా మనుస్సుకు హత్తుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఫస్ట్ ఆఫ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. 

మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకున్న అజ్ఞాతవాసి

Submitted by arun on Wed, 01/10/2018 - 11:53

పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి మూవీపై మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. బాగుందని కొందరు యావరేజ్‌ అని మరికొందరు చెబుతున్నారు. మొదటి రోజు సినిమా చూసేది ఎక్కువమంది ఫ్యాన్సే ఉంటారు. అయితే అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. పవన్‌-త్రివిక్రమ్‌ మార్కు మూవీయే అయినా వీళ్లిద్దరి కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌‌కున్న భారీ అంచనాలను అందుకోలేకపోయిందంటున్నారు.