Telangana GOVT

రేవంత్‌ భద్రతపై హైకోర్టు తాజా ఆదేశాలు

Submitted by arun on Sat, 12/01/2018 - 10:32

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌ భద్రతతో పాటు ఎస్కార్ట్‌ కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు భద్రత కల్పించాలని తేల్చిచెప్పింది. 

ముందస్తు ప్రచారం వేళ గ్రేటర్‌లో కీలక పరిణామం

Submitted by arun on Sat, 08/25/2018 - 08:12

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే ప్రచారం జోరందుకున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ క్లీన్‌స్వీపే లక్ష్యంగా దూసుకుపోతున్న కేసీఆర్ సర్కార్‌ గ్రేటర్‌లో పట్టుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు జలమండలి, హెచ్‌ఎండీఏ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే బదిలీలు ఇక్కడితో ఆగవని త్వరలోనే జిల్లా కలెక్టర్లకు కూడా ట్రాన్స్‌ఫర్లుంటాయని చెబుతున్నారు. 

ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్ఎస్ కే ఎక్కువ లాభం

Submitted by arun on Sat, 08/18/2018 - 11:22

ముందస్తు ఎన్నికలపై ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ గుర్తింపు పార్టీలకు వారి ఆఫీస్ ను నిర్మించేందుకు భూములను ఇచ్చేందుకు మార్గదర్శకాలను జారి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబందించిన పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పాలసీని సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించేలా ఓ పాలసీని రూపొందించింది. కొత్త పాలసీకి మంత్రివర్గం ఆమోదం లభించిన నేపథ్యంలో రెవెన్యూశాఖ  జారీ చేశారు.  

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాక్

Submitted by arun on Fri, 08/10/2018 - 12:17

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో మద్దతు ఇచ్చిన రోజే తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం, పాలమూరుకు రెండింట్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఎంపీ వినోద్ లేఖకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని తేల్చి చెప్పారు. 

  

ఇక కళాశాలలు కడుపునింపు

Submitted by arun on Mon, 07/30/2018 - 16:22

ఇక ప్రభుత్వ కళాశాలలో 

మధ్యాహ్నం భోజనం వంతట,

ఈ విద్యా సంవత్సరంలో,

పెడతారట తెలంగాణ అంతట,

కాస్త కయ్యం లేని బియ్యం పెట్టండయ్యా. శ్రీ.కో

ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!

Submitted by arun on Sat, 06/09/2018 - 15:51

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నివారణ దిశగా మంత్రుల బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నిన్న విస్తృత స్థాయిలో మంతనాలు జరిపిన మంత్రులు... ఇవాళ మరోమారు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్‌, హరీశ్ రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి‌తోపాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. సమ్మె నివారణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్‌ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు.

టీ సర్కార్‌కు కాగ్ అక్షింతలు

Submitted by arun on Thu, 03/29/2018 - 16:27

తెలంగాణ సర్కార్ తీరును కాగ్ తీవ్ర స్ధాయిలో ఆక్షేపించింది. ఆర్ధిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించడం లేదంటూ 2016-17 వ్యయాలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇసుక కొనుగోలులో 18 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూర్చినట్టు తెలిపింది. అప్పులను రెవెన్యూ రాబడిగా చూపడం ద్వారా ద్రవ్య లోటు తక్కువగా చూపారంటూ చెప్పిన కాగ్ వివిధ పథకాల కోసం డ్రా చేసిన నిధులకు UCలు సమర్పించలేదని తెలిపింది.  గరిష్ట సీలింగ్ పరిమితిని మించి విద్యుత్ కొనుగోళ్లు జరిపడం ద్వారా 2012-17 మధ్య 5 వేల  8 వందల 20 కోట్లు అధికంగా ఖర్చు చేశారంటూ తప్పుబట్టింది.

మరో కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

Submitted by arun on Mon, 02/12/2018 - 11:06

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మరో ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఈసారి కబ్జాకు గురైన అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అసైన్డ్‌ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యం ప్రియులకు శుభవార్త

Submitted by arun on Mon, 02/12/2018 - 09:42

మద్యంప్రియులకు శుభవార్త. వివిధ రకాల మద్యం బ్రాండులు, వాటి ఎంఆర్‌పీ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ప్రారంభించారు. వినియోగదారుల్లో చైతన్యం కల్పించడానికే ‘లిక్కర్ ప్రైస్ యాప్‌’ను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు అరచేతిలోకి మద్యం ధరలు వచ్చేయడంతో  వైన్‌షాపుల ఆగడాలకు కళ్లెం పడినట్టయ్యింది.