sharwanand

సాయిపల్లవిపై కీలకవ్యాఖ్యలు...:శర్వానంద్!

Submitted by chandram on Wed, 11/14/2018 - 18:44

తెలంగాణ యాస, బాషతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన బామా నటీ సాయిపల్లవి. తనకు ఈమధ్యనే షూటింగ్ కి లేట్ గా వస్తుందీ, తన ధోరణీతో హీరోలకు అసహనాన్ని కలిగిస్తుందనే వార్తాలు షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ నేఫథ్యంలో శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా పూర్తిచేసుకొని వచ్చేనెల 21న విడుదల కానుంది. సాయిపల్లిపై వచ్చిన అవాస్తమైన వార్తలను శర్వానంద్ తిప్పికొట్టారు. సాయిపల్లవి మంచి నటీ, కథను అర్ధం చేసుకోని జీవించే గొప్పనటీ అని అన్నారు. హీరోయిన్స్ లో తనకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వోచ్చని, ఆమె చాలా తెలివైన హీరోయిన్" అని పేర్కోన్నారు. 

శర్వా.. ఆ సినిమా ఏమైంది..?

Submitted by chandram on Sat, 11/10/2018 - 11:38

యువతకు కావల్సిన విధంగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే హీరో  శర్వనంద్. శర్వానంద్ తన సినీ ప్రయాణం మొదటి నుంచే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ తనకంటూ డిఫరెంట్ క్రెజ్ ను సంపదించుకుని కమర్షియల్ హీరో గా నిరూపించుకున్నాడు. కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' సినిమా శర్వా బీజీ బీజీగా ఉన్నాడు.గత ఏడాది నవంబర్ లో శర్వా, సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.

అర్జున్ రెడ్డి ని మిస్ అయ్యిన..శర్వానంద్!

Submitted by arun on Mon, 11/05/2018 - 16:48

ఒకో సారి... ఒకరి... నో ..మరొకరికి ఎస్ .. అవుంతుంది... అలా ఎన్నో సినిమాలు ఒకరు చెయ్యాల్సినవి, ఇంకొకరు చేసే అవకశాలు వచ్చుయి... అలాగే...అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్రకోసం శర్వానంద్ ను సంప్రదించాడు. కానీ, అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ ఒక్క సినిమాతోనే... విజయ్ టాప్ స్టార్స్ లిస్టు లోకి వెళ్ళిపోయాడు...శ్రీ.కో.

సాయిపల్లవి, శర్వానంద్ మధ్య గొడవేంటి..?

Submitted by arun on Sat, 08/04/2018 - 15:51

హీరోయిన్ సాయిపల్లవి, హీరో శర్వానంద్ తెగ గొడవపడుతున్నారు. అది కూడా సినిమా కోసమే. ఈ హీరో, హీరోయిన్ గొడవే ఇప్పుడు ఓ సినిమాకి ప్రమోషన్ గా మారింది. సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ పట్టాలెక్కినప్పటి నుంచి ఇద్దరికీ ఒకటే గొడవ. మరి సాయిపల్లవి, శర్వానంద్ మధ్య అగ్గిరాజేసిన ఆ సినిమా ఏది..? ఏంటా కథ..?  

శర్వాతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి!

Submitted by arun on Wed, 08/01/2018 - 15:57

తెలుగు సినీ రంగంలో హీరోయిన్ సాయి పల్లవి కి హిట్స్ అయితే వస్తున్నాయి కానీ అంతకు మించి వివాదాలు కూడా పుడుతున్నాయి. అంతకుముందు ఆమె హీరోయిన్ గా నటించిన హీరోలు నాగ శౌర్య, నాని లతో విభేదాలు వచ్చాయని రూమర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో హీరో శర్వానంద్‌తో కూడా అదే పరిస్థితి ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌ కు బ్రేక్‌ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వటంపై స్పందించారు.

అప్పుడు మ‌హాల‌క్ష్మీ.. ఇప్పుడు మేఘ‌న‌..

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 14:28

'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చూసిన వారెవ‌రైనా అందులో మ‌హాలక్ష్మీ పాత్ర‌లో న‌టించిన మెహ‌రీన్‌ని అంత ఈజీగా మరిచిపోలేరు. అంత‌గా త‌న అందంతో, అభిన‌యంతో క‌ట్టిప‌డేసిందీ పంజాబీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పూర్త‌యినా ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. అయితేనేం.. ఇప్పుడు ఈ చిన్న‌ది న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'మ‌హానుభావుడు', 'రాజా ది గ్రేట్‌', 'c/o సూర్య‌', 'జ‌వాన్‌'. వీటిలో ముందుగా రాబోతున్న సినిమా 'మ‌హానుభావుడు'.

'మ‌హానుభావుడు'కి ప్ర‌భాస్ అతిథి

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 21:09

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 'మ‌హానుభావుడు'. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి2' చిత్రాల క‌థానాయ‌కుడు, రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భాస్‌తో 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

'మ‌హానుభావుడు'కి నో క‌ట్స్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 15:53

'గ‌మ్యం', 'ప్ర‌స్థానం', 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ర‌న్ రాజా ర‌న్‌', 'ఎక్స్ ప్రెస్‌ రాజా', 'శ‌త‌మానం భ‌వతి' చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల న‌టుడు అని పేరు తెచ్చుకున్నాడు శ‌ర్వానంద్‌. ఈ యువ క‌థానాయ‌కుడి నుంచి వ‌స్తున్న తాజా చిత్రం 'మ‌హానుభావుడు'. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది.

 మారుతికి అది ప్ల‌స్స‌వుతుందా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:34

'ఈరోజుల్లో', 'బ‌స్‌స్టాప్‌', 'కొత్త జంట‌', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యూత్ చిత్రాల స్పెష‌లిస్ట్‌ మారుతికి అత‌ని గ‌త చిత్రం 'బాబు బంగారం' రిజ‌ల్ట్‌ షాక్ ఇచ్చింది. దీంతో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు మారుతి. అందుకే.. ప్ర‌స్తుతం వ‌రుస‌ విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న శ‌ర్వానంద్‌తో 'మ‌హానుభావుడు' సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ‌రీన్‌ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

మూడో ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా?

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 18:57

ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. 'ర‌న్ రాజా ర‌న్‌', 'మళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల‌డ‌న్న పేరు తెచ్చుకున్నాడు.  ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ 'మ‌హానుభావుడు' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ‌ర్వానంద్‌తో ఇప్ప‌టికే 'ర‌న్ రాజా ర‌న్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన యువి క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.