jc diwakar reddy

భగ్గుమన్న తాడిపత్రి

Submitted by arun on Mon, 09/17/2018 - 10:49

 అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రబోదానందస్వామి భక్తులకు జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.  వినాయక నిమజ్జన సమయంలో రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారి 48 గంటలు గడుస్తున్నా పరిస్ధితులు ఇంకా సద్దుమణగలేదు.  చిన్నపడమల, పెద్దపడమల గ్రామాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల కు చెందిన పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట భైఠాయించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ప్రబోదానందస్వామి ఆశ్రమాన్ని సీజ్ చేయాలంటూ పట్టుబట్టారు.  పట్టణంలో 144వ సెక్షన్ విధించిన పోలీసులు వినాయక నిమజ్జన వేడుకలను వాయిదా వేశారు.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/05/2018 - 13:45

తనదైన కామెంట్స్‌తో రోజుకో వివాదం పూటకో రాద్ధాంతం చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాజకీయ విమర్శలతో వివాదాలు రేపిన ఆయన తాజాగా  పోలీస్ వ్యవస్ధ తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  ఫ్రెండ్లీ పోలీస్‌తో శాంతిభద్రతలు కాపాడలేరన్న ఆయన ఆలూరులో ఎస్సైపై దాడి జరిగితే ఫిర్యాదు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. పోలీసుల్లో చావ చచ్చిందా అంటూ ప్రశ్నించిన జేసీ ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. జిల్లాల్లో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 

జేసీకి ఎదురుపడిన సోనియా.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Submitted by arun on Fri, 07/20/2018 - 15:02

పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు. ఈ సందర్భంలో జేసీ సోనియాతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు’’ అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు. జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

సొంత పార్టీ నేతలకు జేసీ ఝలక్

Submitted by arun on Thu, 07/19/2018 - 10:16

కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ మద్దతు కూడగడుతున్న సమయంలో ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డి సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుని కలకలం రేపారు. అవిశ్వాసానికి దూరంగా ఉంటానని ప్రకటించిన జేసీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అసలు హాజరుకాబోనంటూ ప్రకటించారు. అంతేకాదు విప్ జారీ చేసినా వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పారు. తనకు హిందీ ఇంగ్లీష్ రాదనీ అలాంటప్పుడు పార్లమెంటు సమావేశాలకు వెళ్లి ఏం చేయాలంటూ టీడీపీలో కాక పుట్టించారు. 

జేసీ రఫ్ఫాడేశారు.. మోడీని, బాబునీ.. చివరకు జగన్ నూ

Submitted by arun on Thu, 07/12/2018 - 14:43

ఆయన సామాన్యుడు కాదండి ఎవర్నయినా తిట్టడంలో అస్సలు మొహమాటపడరు రాజీపడరు నోటి కెంతోస్తే అంత కాస్త వెటకారం, కాస్త సీమ మోటుదనం కలగలిపి రఫ్ఫాడేస్తుంటారు. అనంతపురం రాజకీయాల్లో జేసి దివాకర్ రెడ్డి స్టైలే వేరు ఆయన ఎవరికి భయపడరు పైపెచ్చు ఎవరి పార్టీలో ఉంటే వారినే తిట్టడం ఆయన స్పెషాలిటీ. వైఎస్ కేబినెట్ లో ఉన్నప్పుడు ఆయన్ను అప్పుడప్పుడు ఆడిపోసుకునేవారు అవి పైకి సరదా మాటల్లాగే కనిపించినా ఒక్కోసారి శృతిమించినట్లు కనిపిస్తాయి.

జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం...త్వరలోనే...

Submitted by arun on Wed, 07/11/2018 - 17:18

ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన తనయుడు పవన్‌రెడ్డి నిలబడతారనే ప్రచారం పాకిపోయింది. ఈ విషయంలో ఎంపీ జేసీ కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

రాహుల్ పెళ్లి గురించి సోనియాకు ఓ సలహా ఇచ్చా..ఆ అమ్మాయితో పెళ్లి చేస్తే...: జేసీ

Submitted by arun on Fri, 07/06/2018 - 14:37

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ మంత్రిగా చేసిన ఆయన .. అప్పటి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘రాహుల్ ప్రధాని కావాలంటే ఉత్తరప్రదేశ్‌లో బలమైన సామాజిక వర్గం అయిన బ్రాహ్మణుల మద్దతు కావాలని నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి చెప్పాను. యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది డిసైడ్ చేయడంలో బ్రాహ్మణ సామాజిక వర్గమే కీలకం.

సీఎం రమేష్ ఉక్కు దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/22/2018 - 15:39

కడప సీఎం రమేష్ ఉక్కు దీక్షలో.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దీక్షల వల్ల.. స్టీల్ ప్లాంటు రాను గాక రాదని కుండబద్దలు కొట్టారు. సీఎం రమేష్.. దీక్ష చేసినంత మాత్రాన ఉక్కు రాదు.. తుక్కు రాదు అన్నారు. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి.

జగన్‌కు తాత బుద్ధులే వచ్చాయి

Submitted by arun on Tue, 05/29/2018 - 16:10

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎవరి మాట వినేవారుకాదని, ఆయనకు అన్నీ తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడోవ రోజు మహానాడులో జేసీ మాట్లాడుతూ...జగన్‌ తీరు పట్ల ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో బాధపడేవారు. ఎవరి మాటా వినని తత్వం జగన్‌ది. వైసీపీలో చేరాలని నాకు జగన్‌ రాయబారం పంపాడు. నీకు ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి నా వద్దకు వచ్చారు. కానీ జగన్‌ సంగతి తెలిసిన నేను దాన్ని తిరస్కరించాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయింది. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆస్తి.

ఇక సీఎం పదవి చాలు, ఇకపై

Submitted by arun on Tue, 05/29/2018 - 15:32

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం.చాలామంది కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక్క ముక్కలో తేల్చేశారు. రేపటి రోజున లోకేశ్‌ సీఎం అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా?