balakrishna

‘జైసింహా’ మూవీ ఆఫీస్‌పై ఐటీ దాడులు

Submitted by arun on Wed, 01/17/2018 - 13:54

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ‘జై సింహా’కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు  థియేటర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నేపథ్యంలో ‘జైసింహా’ కార్యాలయంపై ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని నిర్మాత సీ కల్యాణ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
 

ఓన్లీ బాలయ్య

Submitted by arun on Wed, 01/17/2018 - 11:46

డైలాగులు కొట్టాలన్నా..దడ పుట్టించాలన్నా నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. బాలయ్య డైలాగులే కాదు..సినిమాల్లో చేసే విన్యాసాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. తొడ కొట్టి ట్రైన్ ని వెనక్కి నడిపించినా..ప్యారాచూట్ తో పాకిస్తాన్ బార్డర్ దాటినా..అది బాలయ్య ఒక్కడికే సాధ్యమవుతుంది. అందుకే ఆడియన్స్ అవాక్కయ్యేలా స్టంట్లు చేయడంలో..బాలయ్య వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నాడు. 

ఆనంద్ మ‌హీంద్రాకు షాకిచ్చిన బాల‌య్య‌

Submitted by lakshman on Tue, 01/16/2018 - 21:58

సంక్రాంతి బ‌రిలో దిగిన జైసింహా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను సృష్టింస్తుంది. ఈ సినిమాలో హీరో బాల‌కృష్ణ ఉన్న స‌న్నివేశంలో ఓ చిన్నబాలుడు  త‌న పాల డ‌బ్బాను పోగొట్టుకుంటాడు. అయితే ఆ పాల‌డ‌బ్బా బొలేరో వాహనం కింద ఉన్న‌ విష‌యాన్ని బాల‌య్య గుర్తిస్తాడు. వెంట‌నే బొలేరో వాహ‌నాన్ని త‌న ఒంటిచేస్తో పైకెత్తి పాల డ‌బ్బ‌తీసి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. అయితే  ఇప్పుడా సీన్ చూసిన ప్ర‌తీఒక్క‌రు విజిల్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అలా చైత‌న్య అనే  ఓ నెటిజ‌న్ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే స‌న్నివేశాన్ని బిజినెస్ మ్యాన్ ఆనంద్ మ‌హీంద్రాకు ట్వీటర్ లో పంపిచాడు.

మ‌హేష్ బాబుపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన బాల‌య్య‌

Submitted by lakshman on Mon, 01/15/2018 - 14:26

జైసింహ‌తో మాంచి జోరుమీదున్న బాల‌కృష్ణ ఓ మీడియా ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. రీమేక్ సినిమాలు చేస్తారా అన్న ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన ఆయ‌న డైర‌క్ట‌ర్ కెఎస్ రవికుమార్ త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఓ సినిమా రిమేక్ చేద్దామ‌ని ప్ర‌స్తావించార‌ట‌. అందుకు బాల‌య్య రిమేక్ లు చేస్తే మ‌న‌కుచ్చే పేరు ఏమీ ఉండ‌ద‌ని అందుకే అలాంటి సినిమాలకు దూరంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు.

మ‌ద్యం మ‌త్తులో ప‌వ‌న్ -బాల‌య్య అభిమానుల దాడి

Submitted by arun on Fri, 01/12/2018 - 17:35

పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ అభిమానులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగింది. గత రాత్రి పురుషోత్తపురంలో పవన్ అభిమాని హరిశ్చంద్ర, బాలయ్య అభిమాని ఫకీరు... ఇద్దరూ మద్యం సేవించి మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప అని వాదించుకున్నారు. క్రమంగా మాటలు పెరిగి, బాలయ్య అభిమాని ఫకీర్‌, పవన్‌ అభిమాని హరిశ్చంద్రపై ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేశాడు. దీంతో పవన్‌ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పవన్‌ అభిమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘జైసింహా’ రివ్యూ

Submitted by arun on Fri, 01/12/2018 - 12:17

‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్ డైర‌క్ష‌న్ లో జైసింహా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మ‌రి ఈ చిత్రం ఫ‌స్టాఫ్ లో  అభిమానుల్ని ఏమేర‌కు అల‌రిస్తుంద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం.  
ఫస్టాఫ్  

ముందు చూస్తే నుయ్యి..వెన‌క చూస్తే గొయ్యి

Submitted by arun on Fri, 01/12/2018 - 11:56

బాలయ్య ఖాతాలో హిట్ పడింది. సంక్రాంతి పందెంకోడిలా సినీ బరిలోకి దిగిన జై సింహా టీం కష్టానికి తగిన ఫలితం దక్కింది. పాజిటివ్ టాక్ వచ్చిన జైసింహాకు డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ రాసుకున్న పకడ్బందీ స్క్రీన్ ప్లే ఎంతో బలాన్నిచ్చింది. బాలయ్యకు తగ్గట్లుగానే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. జైసింహా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ముందు వినిపించే డైలాగ్స్ ఈలలు వేయిస్తాయి. యాక్షన్ సీన్స్ టెన్షప్ పెంచుతాయి. సెంటిమెంట్‌తో పాటు బ్రాహ్మిణ్ సీన్, ధర్నా సీన్... అమ్మకుట్టి సాంగ్ అన్నీ సీనిమాకు ప్లస్ పాయింట్ గా మారాయి. అయితే జై సింహా పూర్తిగా మాస్ సినిమా.

మరోసారి రెచ్చిపోయిన బాలయ్య

Submitted by arun on Fri, 01/12/2018 - 11:15

బాక్సాఫీస్  బాలయ్యకు మరోసారి ఆగ్రహం వచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానిని సుతిమెత్తగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ ‌భ్రమరాంబ ధియేటర్ దగ్గర జరిగింది. కూకట్‌పల్లి భ్రమరాంబ ధియేటర్ లో జైసింహా సినిమాను చూసేందుకు బాలయ్య రావడంతో అభిమానులు హంగామా చేశారు. టపాసులు కాల్చుతూ...పెద్దపెట్టున నినాదాలు చేస్తూ..ఫేక్ హ్యండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు. అభిమానుల అత్యుత్సాహం చూసి బాలయ్యకు కోపం వచ్చింది. దారికి అడ్డంగా చేతులు పెట్టిన ఓ అభిమాని చేతిపై బాలయ్య కాస్త కోపంగా కొట్టారు, చేతులు అడ్డంపెట్టవద్దని అందరికీ హితవు పలికారు.  

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ విష‌యం లేన‌ట్లేనా

Submitted by arun on Mon, 01/08/2018 - 18:21

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యాక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తుంది. ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ మాట్లాడుతు తాను 62గెట‌ప్పుల్లో క‌నిపిస్తాన‌ని అన్నారు. అంతేకాదు సినిమాల్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అన్నీ అంశాలు తెర‌పై చూపిస్తామ‌ని తెలిపారు. మ‌రి ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీల‌క ఘ‌ట్టాల‌ని చూపిస్తారా లేదా అనేది ప్ర‌శ్నార్ధకంగా మారింది. అంతేకాదు తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని అనేకోణాల్లో  మిత్రులు, శ‌త్రువులు సైతం ఈ బ‌యోపిక్ లో ప్ర‌త్య‌క్ష‌మవుతార‌ని వెల్ల‌డించారు.