Gundu Hanumantha Rao

గుండు మ‌ర‌ణం..అస‌త్య‌ప్ర‌చారంపై స్పందించిన మా

Submitted by arun on Thu, 02/22/2018 - 14:02

గోరంతని కొండంతగా చేసి చూపించడంలో..సోషల్ మీడియా తర్వాతే ఎవరైనా. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ..అందరినీ గందరగోళంలో పడేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. కమెడియన్ గుండుహనుమంతరావు మరణం తర్వాత..మా అసోసియేషన్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. అసలేంటా విషయం..? సోషల్ మీడియా పై మా అసోసియేషన్ ఎందుకు ఫైర్ అవుతుంది..? హ్యావే లుక్
 

గుండు హనుమంతరావు మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Submitted by arun on Mon, 02/19/2018 - 14:31

 ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ రంగస్థలాల్లో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు.
 

హన్మంతరావు నటించిన చిత్రాలు...

Submitted by arun on Mon, 02/19/2018 - 12:41

తెలుగు సినీ పరిశ్రమ.. మరో కమెడియన్ ను కోల్పోయింది. ప్రముఖ హాస్యనటుడు.. గుండు హనుమంతారావు.. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

కన్నీళ్లు పెట్టిన శివాజీరాజా

Submitted by arun on Mon, 02/19/2018 - 11:12

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

విషాదంలో బ్రహ్మానందం

Submitted by arun on Mon, 02/19/2018 - 10:19

హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుండు హనుమంతరావుతో తనది 30 ఏళ్ల అనుబంధమని, ఆహ నా పెళ్లంట సినిమాతోనే తామిద్దరికీ గుర్తింపు వచ్చిందని బ్రహ్మానందం గుర్తు చేసుకొని కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తనను బ్రహ్మానందం బావ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలే ఆయన తన ఇంటికి వచ్చాడని, హనుమంతు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి హనుమంతరావు. నాకున్న అతితక్కువ మంది మిత్రుల్లో ఆయన ఒకరు. హనుమంతరావు ధన్యజీవి. హాస్యప్రదర్శనలతో ఎంతోమందిని అలరించాడు.

కమెడియన్ గుండు హనుమంతరావు కన్నుమూత

Submitted by arun on Mon, 02/19/2018 - 10:05

తెలుగు సినీ పరిశ్రమ.. మరో కమెడియన్ ను కోల్పోయింది. ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతారావు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సాయం

Submitted by arun on Mon, 01/08/2018 - 15:49

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి గుండు హనుమంతరావుకి 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదుని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదల చేసింది.