Wife Kills Husband

వదినతో వివాహేతర సంబంధం.. విమానంలో వచ్చి మరీ...

Submitted by arun on Fri, 02/09/2018 - 10:22

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. పథకం ప్రకారం విమానంలో వచ్చిన ప్రియుడు హత్య చేసి వెళ్లిపోయాడు. కేసును చేధించిన పోలీసులు సనత్‌నగర్‌ ఠాణాలో గురువారం డీసీపీ సాయిశేఖర్‌, ఏసీపీ గోవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.ఫతేనగర్‌లోని పైపులైను కాలనీలో నివాసముంటున్న బీహార్‌ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్‌కు చెందిన జయ్‌మంగళ్‌దాస్‌ (35) ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా స్వగ్రామంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు.

మరో స్వాతి ఎపిసోడ్..బావ సాయంతో భర్తను కడతేర్చిన కసాయి పెళ్లాం

Submitted by arun on Sat, 01/06/2018 - 11:56

గుంటూరు జిల్లాలో మరో స్వాతి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. బావ సాయంతో భర్తను చంపేసింది ఓ కసాయి పెళ్లాం. బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీవిద్య భర్తను అడ్డుగా భావించింది. బావతో పాటు మరో ఇద్దరి సాయంతో భర్తను హత్య చేసింది. సాతులూరులో గత నెల 19న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు నివాసి నల్లబోతు నరేంద్ర(27)కు అదే గ్రామంలో ఉండే మేనమామ కూతురు శ్రీవిద్యతో మూడున్నరేళ్ల కిందట పెళ్లయింది. నరేంద్ర పరిశ్రమ కాపలాదారుగా, శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.