TDP leader

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

Submitted by chandram on Sat, 11/10/2018 - 12:12

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త సోమేశ్వర గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. దేవనకోండ మండలం కె.వెంకటాపురం శివారులో ఈ ఘటన జరిగింది. సోమేశ్వర గౌడ్‌ను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపేశారు. ఈ దాడిలో ఆయన కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడితో ఇంటికి వెళ్తున్నప్పుడు సోమేశ్వర గౌడ్ కంట్లో కారం కొట్టి ప్రత్యర్థులు చంపేశారు. మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

చంద్రబాబుకి మరో షాక్.. పార్టీని వీడుతున్న మరో సీనియర్

Submitted by arun on Thu, 08/16/2018 - 11:46

తెలుగుదేశం పార్టీకి కొంత కాలం నుంచి దూరంగా ఉంటున్న అంబర్‌పేట నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు, విద్యానగర్‌ మాజీ కార్పొరేటర్‌ అడపా చంద్రమౌళి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోవడంతోపాటు జిల్లా కమిటీలోనూ సముచిత స్థానం కల్పించలేదన్న భావనతో ఆ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కోల్పోవడం, మారుతున్న రాజకీయ నేపథ్యంలో రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 

పవన్‌ కోరితే టీడీపీకి రాజీనామా చేయిస్తా: జనసేన నేత

Submitted by arun on Thu, 07/12/2018 - 13:06

తాను జనసేనలో ఉన్నానని, తన భార్య మాత్రం టీడీపీ తరఫున గెలిచి జడ్పీటీసీ పదవిలో ఉందని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేత బర్రె జయరాజు, పవన్ కోరితే తన భార్యను టీడీపీ నుంచి రాజీనామా చేయించేందుకు సిద్ధమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు సైతం చెప్పానని ఆయన మీడియాతో అన్నారు. బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌ ఇస్తే తాను జనసేన తరుపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జనసేన అధినేత ఎవరికి అవకాశం కల్పించినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. టిక్కెట్‌ ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పవన్‌ సిద్ధాంతాలు, అభిమానం మీద ఆ పార్టీలో చేరానన్నారు.

టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య

Submitted by arun on Mon, 06/25/2018 - 16:51

ఏడాదిగా భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ... తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర తనను శారీరకంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని హరిణి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసిన హరిణి... ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్‌ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు.

టీడీపీకి షాక్..కాంగ్రెస్ పార్టీలోచేర‌నున్న కీల‌క నేత

Submitted by arun on Fri, 01/05/2018 - 14:22

టీటీడీపీకి షాక్ త‌గల‌నున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల‌తో నేత‌ల్ని కోల్పోయిన టీడీపీ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ల‌ను కోల్పోనున్న‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజ‌వ‌ర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ మాలోతు రాందాస్ నాయ‌క్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌నే వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.