jabardasth

జబర్దస్త్‌కి వెళ్దామని రాలేదు: హైపర్ ఆది

Submitted by arun on Wed, 06/27/2018 - 13:36

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.  కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆది తాను జబర్దస్త్‌కి రావడానికి కారణాలను వెల్లడించాడు. ‘‘జబర్దస్త్‌లోకి వెళ్దామన్న సెన్స్‌తో రాలేదు. ఒకచోట కూర్చొని చేసే జాబ్ నాకు బోర్ కొట్టేసింది. నాకు సరదాగా పక్కన వాళ్లను ఎంటర్‌టైన్ చేయడం వంటి ఇంట్రస్ట్ ఎక్కువగా ఉండేది. దానికి ఏది యాప్ట్ అని ఆలోచిస్తే ఇది కనిపించింది.

'జబర్దస్త్' నుంచి అందుకే బయటికి వచ్చేశాను: షకలక శంకర్

Submitted by arun on Fri, 06/22/2018 - 17:49

'జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా ఎంట‌ర్టైన్ చేసి... మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగానూ మారాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 'జబర్దస్త్' నుంచి ఎందుకు బయటికి వచ్చేశారు అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున 'జబర్దస్త్' చేసేవాడిని. కొంతకాలం 'జబర్దస్త్' చేసిన తరువాత నాకు కొత్త కాన్సెప్ట్ లు దొరకలేదు. అలాగని చెప్పేసి నేను ఏదిపడితే అది చేసేరకం కాదు .. డబ్బులొస్తున్నాయిగదా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.

సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!

Submitted by arun on Fri, 06/22/2018 - 10:25

జబర్దస్త్ తో యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ జరుగుతోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ని సుధీర్, రష్మీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వారి తరహాలోనే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. వీరిమధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలపై రూమర్స్ సహజమే కదా అన్నట్లుగా గతంలో వీరి స్పందన ఉండేది. తాజగా సోషల్ మీడియాలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. నెటిజన్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

రూ.అయిదు లక్షల జీతమిచ్చే ఉద్యోగం వదిలేశా : హైపర్ ఆది

Submitted by arun on Mon, 04/16/2018 - 13:20

"ఎవరినైనా సరే ఏడిపించడం చాలా తేలిక .. కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. అలాంటిది అందరినీ నవ్వించే శక్తిని దేవుడు నాకిచ్చాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను .. ఆదరణ లభిస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ 'జబర్దస్త్' హైపర్ ఆది అన్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్ వేస్తూ.. టీవీ ముందు కూర్చున్న వాళ్లను కితకితలు పెట్టించడంలో ఇతగాడు మహా దిట్ట. షో మొదలైందంటే చాలు హైపర్ ఆది కామెడీ ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆతృత మొదలవుతుంది ప్రేక్షకుల్లో. నవ్వులతో విందు ఇచ్చే ఈయన మాత్రం తన నిజ జీవితంలో చాల కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.

జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో యాంక‌ర్ ప్ర‌దీప్

Submitted by arun on Fri, 01/05/2018 - 14:12

డ్రంక‌న్ డ్రైవ్ లో ప‌ట్టుబడ్డ యాంక‌ర్ ప్ర‌దీప్ జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా, మీడియా ప్రాధాన్యంతో సెల‌బ్రిటీలు ఏ చిన్న‌వివాదంలో దొరికినా ట్రోల్ అవుతున్నారు.  వీటిలో సెల‌బ్రిటీల వివాదాన్ని  త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఎంట‌ర్ టైన్ మెంట్ గా మార్చుకోవ‌డంలో దిట్టైన జ‌బ‌ర్ద‌స్త్ దొంగ స్వామీజీలు, సుత్తిరాజేష్ , మ్యాథ్స్ లో ఫిజిక్స్ అంటూ కామెడీ చేసి విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది.  ఇప్పుడు యాంక‌ర్ ప్ర‌దీప్ ను తన స్కిట్లతో కామెడీ చేస్తుందేమోన‌ని ప్ర‌దీప్  భ‌య‌ప‌డుతున్న‌ట్లు టాక్ . మందు కొట్టొద్దూ అని చెప్పడం.. చివర్లోమందు కొట్టి పడిపోవడం.. ఆ ప్రదీప్ లాగా..