Ram Charan

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

Submitted by arun on Fri, 04/20/2018 - 11:55

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

Submitted by arun on Sat, 04/14/2018 - 14:36

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది. 

ఫ‌స్ట్ డే రంగ‌స్థ‌లం క‌లెక్షన్స్

Submitted by lakshman on Sat, 03/31/2018 - 00:36

సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుద‌లైన‌ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. సుమారు ఏడాది తరువాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కోసం గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అన్ని థియేటర్లలోనూ ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ కాగా..

రంగస్థలం ఫస్ట్ రివ్యూ..నెగెటివ్ సెంటిమెంట్ లో మెగా అభిమానులు

Submitted by arun on Fri, 03/30/2018 - 07:31

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. నేడు ఈ మూవీ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా బాగుందనేది సెన్సార్ టాక్. కాగా సినిమాలకు ముందుగానే రివ్యూలు ఇచ్చే ఉమర్ సంధూ ‘రంగస్థలం’కు కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చి ఈమూవీ పై ప్రశంసలు కురిపించాడు.

రంగస్థలం ఫస్ట్ రివ్యూ.. ఆ ముగ్గురి నటన హైలెట్!

Submitted by arun on Thu, 03/29/2018 - 15:46

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. శుక్రవారం ఈ మూవీ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా బాగుందనేది సెన్సార్ టాక్. కాగా సినిమాలకు ముందుగానే రివ్యూలు ఇచ్చే ఉమర్ సంధూ ‘రంగస్థలం’కు కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చి ఈమూవీ పై ప్రశంసలు కురిపించాడు.

చరణ్, తారక్ పాలిట విలన్ గా రాజశేఖర్?

Submitted by arun on Wed, 03/28/2018 - 14:36

దర్శక ధీరుడు.. జక్కన్న రాజమౌళి తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది కానీ.. పూర్తి వివరాలు మాత్రం ఒక్కోటిగా బయటికి వస్తూ హైప్ పెంచేస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నాదమ్ములుగా నటిస్తున్నారని.. బాక్సింగ్ ప్లేయర్లుగా కనిపించనున్నారని గుసగుసలు ఇప్పటికే వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటికొచ్చింది.

రాజకీయం వేరు.. అనుబంధం వేరు!

Submitted by arun on Wed, 03/28/2018 - 13:42

రాజకీయం వేరు.. అన్నాదమ్ముల అనుబంధం వేరు. ఈ మాటను.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. రాజకీయంగా.. వ్యక్తిగతంగా.. చిరంజీవితో తనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అన్నాదమ్ములుగా తాము ఎన్నడూ కలిసే ఉంటామని.. అన్నయ్య విషయంలో తన ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని.. పవన్ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు.. ఇప్పుడు ఆ మాటను నిజం అని నిరూపించుకున్నాడు కూడా.

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:03

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది.