heart problems

గుండె సంబంధిత వ్యాధుల్ని గుర్తించే టూత్ బ్ర‌ష్

Submitted by arun on Thu, 01/04/2018 - 18:15

బ్ర‌ష్ లు దంతాల్ని శుభ్రం చేయ‌డమే కాదు. గుండె జ‌బ్బుల్ని గుర్తిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరిగించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు కావాల్సినట్లుగా దంతాలు త‌యార‌వుతాయి. ఈ బ్ర‌ష్ లు దంతాల‌ శుభ్రం కోసమే కాకుండా  గుండె జ‌బ్బుల్ని గుర్తించేలా స్పెయిన్ కు చెందిన డాక్ట‌ర్ల బృందం ప‌రిశోద‌న‌లు చేస్తుంది.