Telangana

అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న పంచాయతీ భయం

Submitted by arun on Wed, 01/17/2018 - 18:18

అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొత్త పంచాయతీ చట్టం ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు నిర్వహిస్తే టికెట్ల కోసం పోటీలు తీవ్రమవుతాయని టెన్షన్ పడుతున్నారు. టికెట్లు రాని వారు ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తే తమకే నష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

వనస్థలిపురంలో ఇసుక లారీ భీభత్సం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Submitted by arun on Wed, 01/17/2018 - 17:23

ఆఫీసుకెళ్లాలన్నా, స్కూలుకెళ్లాలన్నా, ఎక్కడికెళ్లాలన్నా ఎవరైనా సరే రోడ్డెక్కాల్సిందే. అయితే అవే రోడ్లు మృత్యు మార్గాలైతే.. రోడ్డుపైకి రావడానికే భయపడతారు. సరిగ్గా వనస్థలిపురం సుష్మా థియేటర్‌ దగ్గర అదే జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారు రోడ్డుపైకి రావడానికి జడసుకుంటున్నారు. అంత బీభత్సం సృష్టించిందో ఇసుక లారీ.

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..కిషన్‌రెడ్డితో సహా బీజేపీ నేతలు అరెస్ట్

Submitted by arun on Wed, 01/17/2018 - 17:12

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

నారాయణ విద్యాసంస్థల్లో మరో విద్యార్ధి మృతి

Submitted by arun on Wed, 01/17/2018 - 17:06

నారాయణ విద్యాసంస్థల నిర్లక్ష్యానికి మరో విద్యార్ధి బలయ్యాడు. శంషాబాద్‌ నారాయణ క్యాంపస్‌లో కరెంట్‌ షాక్‌ కొట్టి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్ధి ఖాసిమ్‌ మృత్యువాతపడ్డాడు. మంచినీళ్లు పట్టుకుంటుండగా కరెంట్‌ షాక్‌ కొట్టిందని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్థి మంచినీళ్లు తాగేందుకు వెళ్లాడు. అయితే పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌ తగిలి కింద పడిపోయాడు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే కాషీఫ్‌ చనిపోయినట్టు వైద్యులు చెప్పడంతో, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కత్తి మహేశ్ తీవ్ర విమర్శలు

Submitted by arun on Wed, 01/17/2018 - 16:03

సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని పేర్కొంటూ ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ప్రకటించారు.

నడిరోడ్డుపై గ్యాంగ్ వార్...హడలెత్తిన జనం!

Submitted by arun on Wed, 01/17/2018 - 14:30

హైదరాబాద్‌ కాచిగూడలో గ్యాంగ్‌ వార్‌ జరిగింది. నడిరోడ్డుపై ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వెంకటేశ్వరనగర్‌లో ఇరువర్గాలు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. గంటల తరబడి ఇరువర్గాలు కొట్టుకోవడంతో బస్తీవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్యాంగ్‌ వార్‌ వెనుక ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఓ కేసు పెట్టి వదిలేశారు. నడిరోడ్డుపై ఇంతపెద్ద గొడవ జరిగినా.. పోలీసులు పెట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ బైక్ విషయంలో ఈ గొడవ జరిగిందని తెలిపారు.

స్ట్రీట్‌ ఫైట్‌..ఇద్దరు టెన్త్‌ విద్యార్ధుల మధ్య ఘర్షణ

Submitted by arun on Wed, 01/17/2018 - 14:20

హైదరాబాద్‌ నాచారంలో ఇద్దరు టెన్త్‌ విద్యార్ధులు స్ట్రీట్‌ ఫైట్‌కి దిగారు. వీరారెడ్డినగర్‌లో పదో తరగతి చదువుతోన్న అరవింద్‌, సాయినాథ్‌ మధ్య ఏర్పడిన చిన్నపాటి ఘర్షణ... చివరికి కత్తిపోట్లకు దారితీసింది. అరవింద్‌పై సాయినాథ్‌ కత్తితో దాడి చేశాడు. అరవింద్‌కి తీవ్ర గాయాలు కావడంతో నాచారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

తల్లిని రోడ్డుపై వదిలేశాడు..కనిపించడం లేదని కేసు పెట్టాడు..

Submitted by arun on Wed, 01/17/2018 - 13:46

ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురుంది. అయినా ఆ వృద్ధురాలు రోడ్డున పడింది. కొడుకే తల్లిని రోడ్డపై వదిలేసి.. కనిపించడం లేదని పోలీసు కేసు కూడా పెట్టాడు. కానీ సంఘం చూస్తూ ఊరుకోదు కదా? కొంతమంది సహృదయులు ముందుకొచ్చారు. సహృదయ్‌ ఆశ్రమానికి తరలించారు. 

పిల్లనిచ్చిన అత్తారింటికే కన్నం వేసిన అల్లుడు

Submitted by arun on Wed, 01/17/2018 - 11:28

అప్పులు చేసాడు. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకు అత్తింటికే కన్నం వేసాడు. పోలీసులకు దొరక్కుండా సినీఫక్కీలో తప్పుదోవ పట్టించ్చాడు. సీసీ కెమెరాలు ఆ ఇంటిదొంగను పట్టించాయి. గత నెల 30న హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో జరిగిన ఓ చోరీ కేసులో దొంగల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదు 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

యువతి వీరంగం

Submitted by arun on Wed, 01/17/2018 - 10:46

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. 20 నిమిషాలపాటు కారు దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. చివరికి ఆమె స్నేహితులు వేరే వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.