Andhrapradesh

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

Submitted by chandram on Mon, 12/17/2018 - 20:40

భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. రేపు వేకూవజామున ప్రారంభకానున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే లక్ష మంది భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. పెథాయ్‌ తుపాన్‌ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలికి దుప్పట్లను కూడా టీటీడీ పంపిణీ చేస్తోంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఏర్పాట్ల‌ను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనార్థం పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు‌ తరలి వస్తున్నారు.

పెథాయ్‌ తుపానుతో రైతన్న విల విల

Submitted by chandram on Mon, 12/17/2018 - 19:45

పెథాయ్ రైతన్నలను నిండా ముంచింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీటిపాలైంది. అరటి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు నాశనం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. పెథాయ్‌ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చివరి దశలో ఉన్న పంటపై తుపాను విరుచుకుపడింది. కురుస్తోన్న వర్షాలకు వరిపంట పూర్తిగా నాశనమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు,  పాలకొ్ల్లు, పెదపాడు, నరసాపురం, మొగల్తూరు, పెదవేగి, ఏలూరు గ్రామీణ మండలాల్లో పంట నీటమునిగింది. కోతకోసి పొలాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

తీరంలో ఇరుక్కుపోయిన మంత్రి గంటా కారు

Submitted by arun on Mon, 12/17/2018 - 13:50

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలో ఇసుకలో ఇరుక్కుపోయింది. భీమిలి బీచ్ దగ్గర్లోని మంగమర్రిపేట వద్ద తీరంలో గంటా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

పెథాయ్‌ ఎఫెక్ట్‌ : తీరం తాకిన పెథాయ్ తుపాను

Submitted by arun on Mon, 12/17/2018 - 12:37

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతాల్లోని ఆరువేల మందిని ఇప్పటికే తుపాను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. 

పెథాయ్‌ ఎఫెక్ట్‌ : కోనసీమపై తీవ్ర ప్రభావం చూపనున్న పెథాయ్

Submitted by arun on Mon, 12/17/2018 - 12:04

పెథాయ్ తుపాను ప్రభావం కోనసీమపై తీవ్రంగా ఉంది. పెథాయ్ తుపాను ఐ.పోలవరం, తాళ్లరేవులలో తీరం దాటే అవకాశం ఉండటంతో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. కోనసీమ వ్యాప్తంగా ఆరు వేల మందిని తుపాను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో గౌతమి పాయపై యానాం - ఎదుర్లంక వారధిపై రాకపోకలు నిషేధించారు. 216 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. కాట్రేనికోన మండలంలో పలుచోట్ల కొబ్బరిచెట్లు కూలి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 

అత్యవసర పరిస్థితి ఇది...పెథాయ్‌ తుపానుపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

Submitted by arun on Mon, 12/17/2018 - 11:42

పెథాయ్ తుపాను నేథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది అత్యవసర పరిస్థిగా భావించాలని సీఎం అధికారులకు సూచించారు దానికి తగ్గట్టుగా పనిచేయాలని ఎవరూ సెలవులు పెట్టకూడదని చంద్రబాబు అన్నారు. అందరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్న చంద్రబాబు విపత్తును ఎదుర్కోవడానికి ప్రతిశాఖకు యాక్షన్ ప్లాన్, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేయాలన్నారు. సకాలంలో విద్యుత్‌ పునరుద్ధరణ, ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ జరగాలన్నారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలకు కొరత లేకుండా సిద్ధం చేసి ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే..

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఆరుగురు జాలర్లు...ఆయిల్ అయిపోవడంతో సముద్రంలో ఆగిపోయిన బోటు

Submitted by arun on Mon, 12/17/2018 - 11:23

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు.  ఈ నెల 11న బైరవపాలెం - కొత్తపాలెం మధ్యలో ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు. ఆయిల్ అయిపోవడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. పెథాయ్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఒడ్డు చేరడం వారికి కష్టంగా మారింది. సముద్రంలో చిక్కుకున్న వారిలో వాసుపల్లి దానియేలు, మారిపల్లి సత్తిబాబు, పేర్ల కాసులు, కుదిడు కాశీ, వాసుపల్లి ఎర్రయ్య, మెరుగు ఏసేబు ఉన్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సూరి పేరు చెప్పుకొని కోట్లాది రూపాయల ఆస్తులు వెనకేసుకున్నాడు

Submitted by arun on Mon, 12/17/2018 - 11:18

మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసులో నిందితుడుగా ఉన్న భాను కిరణ్ కు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణ శిక్ష పడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సూరి భార్య గంగుల భానుమతి తెలిపారు. నమ్మకంగా వెంట ఉంటూ సూరి పేరు చెప్పుకొని  కోట్లాది రూపాయల ఆస్తులు వెనకేసుకున్న భాను కిరణ్ నమ్మక ద్రోహం చేశాడని గంగుల భానుమతి తెలిపారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని భానుమతి అన్నారు.
 

ఏపీని వణికిస్తోన్న పెథాయ్...ఇవాళ కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశం..

Submitted by arun on Mon, 12/17/2018 - 09:53

పెథాయ్‌ తుపాను తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత.. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కాకినాడ పరిసరాల్లో తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అయితే, ఆర్టీజీఎస్‌ మాత్రం కాకినాడ–తునిల మధ్య తీరం దాటవచ్చని వెల్లడించింది. మరోవైపు అమెరికా నిర్వహిస్తున్న జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ విశాఖ సమీపంలో తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. ఇలా మూడు సంస్థల వేర్వేరు అంచనాలతో పెథాయ్‌ ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై గందరగోళం నెలకొంది.