Manikyala Rao

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు ?

Submitted by arun on Thu, 03/29/2018 - 15:08

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి మాణిక్యాలరావును అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాణిక్యాలరావు పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయ్. 2019 ఎన్నికల్లో దూకుడుగా వెళ్లాలన్న లక్ష్యంతో కంభంపాటి హరిబాబును పక్కన పెట్టి అధ్యక్ష పదవిని మాణిక్యారావుకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌‌లో దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రిగా సుమారు నాలుగేళ్ల పాటు పని చేశారు.

ఏపీలో కొనసాగుతున్న ఆపరేషన్ ద్రవిడ ప్రకంపనలు

Submitted by arun on Sat, 03/24/2018 - 16:46

ఏపీలో ఆపరేషన్ ద్రవిడ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. సినీనటుడు శివాజీ వెల్లడించిన ఆపరేషన్ అంశాలపై  సమ్రగ విచారణ జరపాలంటూ మాజీ మంత్రి మాణిక్యాల రావు ఏపీ డీజీపీకి లేఖరాశారు. ద్రవిడ ఆపరేషన్ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొందరు కుట్రలకు పాల్పడుతారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్ధాయి విచారణ జరపాలన్నారు.  
 

తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నా

Submitted by arun on Thu, 03/08/2018 - 11:46

మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేయాల్సి వస్తోందని పైడికొండల మాణిక్యాలరావు అసెంబ్లీలో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చూసి చాలా నేర్చుకున్నానని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.  పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన ఆయన సెల్‌ఫోన్‌ను కేవలం మాట్లాడటానికి, మెసేజ్‌లు చూడటానికి మాత్రమే వాడేవాడినన్నారు. చంద్రబాబును చూసిన తర్వాత కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడంతో పాటు టెక్నాలజీలో చాలా విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు.  నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన శాఖలో ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు.