tickets

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

Submitted by arun on Mon, 04/16/2018 - 17:13

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. మొత్తం 224 సీట్లకు గానూ 218మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అనూహ్యంగా 90శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. ప్రస్తుతమున్న 122మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 107మందికి టికెట్లు ఇచ్చారు. అయితే టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పలుచోట్ల ఆశావహులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మాండ్యా, చిక్‌ మంగళూరు, రాజాజీనగర్‌‌, బళ్లారి, మంగళూరులో ఆశావహులు రచ్చరచ్చ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. 

భారీగా పెరిగిన అజ్ఞాతవాసి టికెట్ల‌ ధ‌ర‌లు

Submitted by arun on Thu, 01/04/2018 - 14:49

సినిమా కాపీ రైట్స్ చిక్కులు ఎలా ఉన్నా అజ్ఞాతవాసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న‌ట్లు మార్కెట్ పండితులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ‌తంలో డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ -ప‌వ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురింపిచాయి. అంత‌కు మించి భారీగా వ‌సూళ్ల రాబ‌డుతూ  బాహుబలి 2, ఖైది నెంబర్ 150 రికార్డ్స్ బద్దలు కొడుతుంద‌ని పవన్ ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.