sexual harassment

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన

Submitted by arun on Fri, 10/26/2018 - 11:39

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

వివాదంలో మలింగా ...కలకలం రేపుతున్న చిన్మయి పోస్ట్!

Submitted by arun on Thu, 10/11/2018 - 16:32

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో  మీటూ’ ఉద్యమం భారత్ లో ఊపందుకుంది. మనవరాలి వయసులో ఉన్నప్పుడే  తనను లైంగికంగా వేధించారంటూ  ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆరోపణలు చేసింది. మొదటి నుంచి #మీటూకు మద్దతుగా ఉన్న గాయని చిన్మయి ఈ వ్యవహారానికి సంబంధించి తన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంక క్రికెటర్ లసిత్‌ మలింగాకు సంబంధించిన సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. మలింగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఈ రోజు ఆరోపించింది. సదరు ఆరోపణలను గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

మహిళకు ఎస్సై లైంగిక వేధింపులు...అర్ధరాత్రి సమయంలో...

Submitted by arun on Mon, 08/13/2018 - 11:13

కర్నూలు జిల్లాలో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి ఓ మహిళ రెండు నెలల క్రితం సారా కేసులో విచారణ కోసం ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లింది. విచారణ ముగిసిన తర్వాత ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య ఆమె సెల్‌ నంబర్‌ను అడిగి తీసుకున్నారు. అప్పటి నుంచి బాధిత మహిళకు ఫోన్‌లో ఎస్ఐ వేధింపులు ప్రారంభమయ్యాయి.

మత్తు మందు ఇచ్చి.. వీడియోలు తీసి

Submitted by arun on Fri, 07/13/2018 - 12:13

ఓ స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడి కన్ను, పక్కనే ఉన్న ఇంట్లోని యువతిపై పడింది. ఆట మధ్యలో మంచినీళ్లు కావాలంటూ ఇంటికి వెళుతూ మాటలు కలిపి, పరిచయం పెంచుకుని, నమ్మించి తీసుకెళ్లి, ఆపై మత్తుమందిచ్చి అత్యాచారం చేయడంతో పాటు వీడియో తీసి వేధించాడు. విజయవాడ పరిధిలోని చిట్టినగర్ లో జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు పొట్నూరి లక్ష్మణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఓ స్కూల్‌లో పనిచేస్తున్న యువతి (20) తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. అన్నయ్య మానసిక పరిస్థితి సరిగా ఉండదు.

బయటపడ్డ దాచేపల్లి జెడ్పీటీసీ లైంగిక వేధింపులు

Submitted by arun on Fri, 05/25/2018 - 14:57

గుంటూరు జిల్లా దాచేపల్లి జెడ్పీటీసీ  ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ముత్యాలంపాడుకు చెందిన జ్యోతి  ఎస్పీ అప్పల నాయుడికి ఫిర్యాదు చేసింది. జ్యోతి భర్త చనిపోయినప్పటి నుంచి ఆస్తి పంపకాలలో జెడ్పీటీసీ తలదూర్చారని.... పొలం పాసు పుస్తకాలు రాకుండా రెవిన్యూ సిబ్బందితో కలసి ప్రకాష్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు మహిళ వాపోయింది. 

ప్రేమజంటలపై రౌడీ గ్యాంగ్‌ల లైంగికదాడి

Submitted by arun on Tue, 04/03/2018 - 14:24

వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం.. యువతులపై లైంగికదాడులకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. ఎప్పుడూ ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు బయట చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ గ్యాంగ్‌ రెండేళ్లుగా అడ్డూఅదుపులేకుండా అకృత్యాలకు పాల్పడుతోంది. ప్రకాశం జిల్లా కేంద్రం సమీపంలో వరుసగా జరిగిన ఈ ఘటనలు వేలెత్తిచూపుతున్నాయి.  

లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్‌

Submitted by arun on Tue, 03/27/2018 - 13:56

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఎంత దుమారం రేగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనిపై మీటూ అనే ఉద్యమం కూడా చేప‌ట్టారు. హ్య‌ష్ ట్యాగ్‌తో మొద‌లైన‌ మీటూ ఉద్య‌మానికి చాలా మ‌ద్ద‌తు ల‌భించింది. అమెరికన్ స్టార్ హీరోయిన్ అలిస్సా మిలానో ఈ హ్యాష్‌టాగ్‌కు ఆద్యం పోసారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు భామ‌లు తమ చేదు అనుభవాలను 'మీటూ' అని హ్యాష్ టాగ్ చేసి ఇండ‌స్ట్రీలో జ‌రిగిన‌ ఆకృత్యాలను వివ‌రించారు. గ్లోబ‌ల్ గార్ల్ ప్రియాంక చోప్రా ..

గ‌లీజు శ్రీనివాస్ కెరియ‌ర్ ముగిసిన‌ట్లేనా

Submitted by arun on Sun, 01/07/2018 - 17:22

గ‌జ‌ల్ శ్రీనివాస్ కెరియ‌ర్ ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న ఓ యువ‌తిని లైంగికంగా వేధించిన విష‌యంలో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే.  దీంతో బెయిల్ మీద భ‌య‌ట‌కు రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం అయ్యాయి. రెండుసార్లు బెయిల్ కి అప్ల‌య్ చేసిన‌ నాంపల్లి కోర్ట్ తిరస్కరించింది. బెయిల్ మీ భ‌య‌ట‌కొచ్చిన ఆయన జీవితం ప్ర‌శ్నార్ధ‌క‌మే.  గ‌జ‌ల్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న శ్రీనివాస్ ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా కొన‌సాగుతున్నాడు.