samantha

అతడ్ని కిడ్నాప్‌ చేస్తా: సమంత

Submitted by arun on Fri, 06/08/2018 - 16:24

రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్‌ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్‌ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్‌ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.

‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 06/01/2018 - 10:42

నిర్మాణ సంస్థ‌లు: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, హ‌రి వెంక‌టేశ్వ‌ర పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ త‌దిత‌రులు
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
కూర్పు: రూబెన్స్‌
క‌ళ‌: ఉమేశ్ కుమార్‌
మాట‌లు: రాజేశ్ ఎ.మూర్తి
నిర్మాత‌: జి.హ‌రి
ద‌ర్శ‌క‌త్వం: పి.ఎస్‌.మిత్ర‌న్‌

అభిమానులకు సమంత బంపర్ ఆఫర్!

Submitted by hmtvdt on Sun, 04/29/2018 - 23:31

మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత.. ఆ మూవీని డిఫరెంట్ గా.. ప్రమోట్ చేసేస్తోంది. మహానటి సావిత్రికి సంబంధించిన అహనా పెళ్లంట పాటలు చూస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మీరు కూడా.. సావిత్రిగారికి సంబంధించిన బెస్ట్ వీడియో కలెక్షన్స్ నాకు పంపించండి.. మంచి బహుమతులు అందుకోండి సమంత ఊరిస్తోంది. సమంత అలా చెప్పగానే.. ఫ్యాన్స్ కూడా ఇలా ఎగ్జయిట్ అవుతూ.. సావిత్రి వీడియోస్ చెక్ చేసేస్తున్నారు.

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

Submitted by arun on Fri, 04/20/2018 - 11:55

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

Submitted by arun on Sat, 04/14/2018 - 14:36

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది. 

అది నిజం ముద్దు కాదు...

Submitted by arun on Wed, 04/11/2018 - 11:43

రామ్ చరణ్, సమంతల కామినేషన్లో వచ్చిన 'రంగస్థలం' మూవీ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఓ చుంబన దృశ్యం ఉంది. ఈ ముద్దు సీన్ పై తాజాగా ఓ మీడియా సంస్థలో సమంత స్పందించింది. వాస్తవానికి అది నిజమైన ముద్దు కాదని తెలిపింది. చరణ్ బుగ్గపై తాను ముద్దు పెట్టానని... దాన్ని ఒక కెమెరా ట్రిక్కుతో లిప్ లాక్ లా భ్రమించేలా తీశారని చెప్పింది. కథకి ఆ సన్నివేశం అవసరం కాబట్టే అలా చిత్రీకరించాల్సి వచ్చిందని తెలిపింది. నేను ఓ నటిని. సన్నివేశానికి తగినట్టుగా నటించాలి. పెళ్లయిన కథానాయికని ‘లిప్‌ లాక్‌ ఎందుకు చేశారు’ అని అడిగినట్టు.. పెళ్లయిన కథానాయకుల్ని అడగరెందుకని?

రంగ‌స్థ‌లం 3 రోజుల కలెక్షన్ ఎంతంటే

Submitted by lakshman on Mon, 04/02/2018 - 22:55

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవుటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి.

ఏనిమిదేళ్ల ప్రేమ‌కి థ్యాంక్స్

Submitted by lakshman on Sun, 04/01/2018 - 23:34

సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. తన భర్త చైతన్యతో కలిసి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌‌లో సెల్ఫీ దిగిన ఆమె అభిమానులకు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాకు సెల్ఫీలు దిగడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దిగాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ పార్క్‌లోనే 8 ఏళ్ల క్రితం మా మధ్య ప్రేమ మొదలైంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని మా నమ్మకం. అందుకే ఈ ప్లేసుకు థాంక్స్ చెప్పుకోవడానికే తిరిగి ఇక్కడకు వచ్చాము... అని సమంత తెలిపారు.

రాజ‌మండ్రిలో ‘యు టర్న్’ తీసుకున్న సామ్

Submitted by lakshman on Sun, 02/18/2018 - 14:45

సినిమాల్లో పీహెచ్ డీ  చేసిన స‌మంత రాజ‌మండ్రిలో యూట‌ర్న్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన సామ్ టాప్ హీరోల‌తో 
 వ‌రుస సినిమాల‌తో హిట్లు కొట్టింది. కానీ తాను ఎన్ని బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టినా త‌న‌కు ఓ చిరకాల కోరిక ఉన్న‌ట్లు మీడియాకు చెప్పింది.   సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ‘యు టర్న్’ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ క్యార‌క్ట‌ర్ చేయాల‌ని ఆశ‌గా ఉందంటూ చెప్పుకొచ్చింది. 

'రంగ‌స్థ‌లం' రామ‌ల‌క్ష్మి వ‌చ్చేసింది

Submitted by arun on Fri, 02/09/2018 - 12:08

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రామ‌ల‌క్ష్మి పాత్ర చేస్తున్న స‌మంత‌కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ పిల్లెదురు వ‌స్తుంటే మా ఊరికి 18సం. వ‌య‌స్సు వ‌చ్చిన‌ట్టుంట‌దండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామ‌ల‌క్ష్మేనండి అంటూ చ‌ర‌ణ్ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతుండ‌గా, ఎంతో ఇంప్రెసివ్‌గా ఉన్న లుక్స్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.