Jr NTR

నందమూరి సుహాసిని గురించి స్పందించిన ఎన్టీఆర్

Submitted by arun on Fri, 12/07/2018 - 10:49

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలిసి ఎన్టీఆర్ పోలింగ్ సెంటర్ కు వచ్చారు. 40 నిమిషాలు క్యూలైన్ లో వేచి ఉండి ఎన్టీఆర్ ఓటేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కంప్లైంట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు... మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే.

ఎన్టీఆర్ ఓటు వేస్తాడా?

Submitted by arun on Thu, 12/06/2018 - 15:18

జూనీయర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మరో రెండు రోజుల దాక జరుగుతుంది దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఇందులో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడని తెలుసు దీని కోసం ఇప్పటికే ఓ ట్రైనర్ తో బాడీ లుక్ మార్చుకున్నాడు. ఇది రివీల్ చేయకూడదని రాజమౌళి ముందుగానే చెప్పటంతో జూనీయర్ బయటకు వచ్చే అవకాశాలు కూడ లేవు తన సొంత అక్క నందమూరి సుహాసిని కుకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటి చేస్తున్నారు.

అక్క సుహాసిని ప్రచారానికి జూనియర్‌ ...కానీ క్యాంపెయిన్‌లో ఏం మాట్లాడాలో డైలమా?

Submitted by arun on Thu, 11/29/2018 - 17:53

కూకట్‌పల్లిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తాడని, దాదాపు కన్‌ఫామ్‌ అయ్యింది. అక్క తరపున క్యాంపెయిన్ చేస్తాడని ఖరారైంది. ఇక్కడే జూనియర్‌ ఎన్టీఆర్‌ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఈ డైలమా ఎందుకు అందుకు కారణాలేంటి?

అక్క కోసం తమ్ముడు వస్తాడా? కూటమికి అండగా ఎన్టీఆర్‌ నిలుస్తాడా..?

Submitted by santosh on Tue, 11/27/2018 - 13:42


కూకట్‌పల్లిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తాడా? అక్క తరపున క్యాంపెయిన్ చేయడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఈ డైలమా ఎందుకు. అందుకు కారణాలేంటి? 
కూకట్‌పల్లిలో మహాకూటమి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు నందమూరి సుహాసిని. హరికృష్ణ తనయ. కల్యాణ్‌ రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ల సోదరి. హరికృష్ణ కుటుంబానికి తాము అండగా ఉన్నామంటూ, చంద్రబాబు కూకట్‌పల్లి సీటును ఆ కుటుంబానికే చెందిన సుహాసినికి  ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలే మారిపోయాయి.

అక్క కోసం తారక్‌ వస్తాడా?

Submitted by arun on Wed, 11/21/2018 - 11:46

ఒకవైపు కేసీఆర్‌ ప్రచార దూకుడు పెంచారు. మహాకూటమి మాత్రం క్యాంపెయిన్‌లో వేగం పెంచలేదు. అటు కాంగ్రెస్‌ ఏమో సోనియా గాంధీ సభతో చెలరేగిపోవాలని ప్రణాళిక వేస్తోంది. ఇక టీడీపీ కూడా స్టార్‌ క్యాంపెయినర్స్‌తో, తెలంగాణ గట్టుపై సత్తా చాటాలని ఆలోచిస్తోంది. మరి టీడీపీ స్టార్  క్యాంపెయిన్స్ ఎవరు....బాలయ్య షెడ్యూల్ ఏంటి...తారక్‌ వస్తాడా?

Tags

బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్

Submitted by arun on Mon, 10/22/2018 - 16:52

జూనీయర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా దసర బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో సక్సెస్ సెలెబ్రెషన్స్ చేసుకుంది చిత్ర యూనిట్.. ఈ సక్సెస్ మీట్ కు చీప్ గెస్ట్ గా బాలయ్య రావటంతో నందమూరి అభిమానులకు దసరా దీపావళి ఒకేసారి వచ్చేసాయి.. బాలయ్య త్వరలోనే సినిమా చూస్తా అన్నాడు.. కానీ బాలయ్య కూతురు నారా చంద్ర బాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి అరవింద సమేత సినిమా మొన్ననే చూసిందంటా.. సినిమాలో తారక్ యాక్టీంగ్ సూపర్ అంటు ఎన్టీఆర్ ను పొగడటమే కాదు ఓ మంచి గిప్ట్ పంపింది.

‘అరవింద సమేత’ ప్రీమియర్‌ షో కలెక్షన్లు అదుర్స్‌

Submitted by arun on Fri, 10/12/2018 - 11:18

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఓవర్సీస్‌లో ఒక్కరోజులోనే మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్‌ను కూడా అవలీలగా క్రాస్‌ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి.

హరికృష్ణ విగ్రహం సిద్ధం.. రేపు ఎన్టీయార్‌కు అందజేత

Submitted by arun on Sat, 09/01/2018 - 15:34

తెలుగుదేశం సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుముూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో ఆయన విగ్రహాన్ని రూపొందించారు.

కన్నీటి పర్యంతం

Submitted by arun on Thu, 08/30/2018 - 15:44

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పటించారు. ఇక తండ్రిని కడసారి చూస్తూ జూనియర్ ఎంటీఆర్ భావాద్వేగానికి లోనయ్యారు.. తండ్రిని చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి హరికృష్ణ పార్థివ దేహం చేరుకున్న అనంతరం శాస్త్రోక్తమైన క్రతువు చేశారు ఇక హరికృష్ణ చివరి చూపు కోసం తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు అంత్యక్రియల సందర్భంగా మెదట హరికృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం పోలీసులు గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తండ్రికి కళ్యాణ్ రామ్ తలకొరువి పెట్టారు. 

టీజ‌ర్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్

Submitted by arun on Wed, 08/15/2018 - 10:32

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘అర‌వింద స‌మేత‌’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.