arun jaitley

కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

Submitted by lakshman on Tue, 03/13/2018 - 18:05

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి చ‌ర్చించారు. నాడు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్రతిప‌క్షంలో బీజేపీ ఎన్నో హామీల్ని ఇచ్చింద‌ని, ఆ హామీల్లో ఎన్ని నెర‌వేర్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వలేమ‌ని చెప్పిన కేంద్ర ఆర్ధిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న‌పై తూర్పార‌బ‌ట్టారు. 

ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి ఈ-వే బిల్లు

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:53

ఏప్రిల్ 1 నుంచి ఎల‌క్ట్రానిక్ -వే బిల్లును త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. దీంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలపాటు  పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్‌–3బీ, జీఎస్టీఆర్‌–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని  భావించామన్నారు.  

జీఎస్‌టీ మండలి స‌మావేశం.. కీల‌క నిర్ణ‌యం..

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:37

ఢిల్లీలో 26వ జీఎస్టీ మండలి స‌మావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అథ్య‌క్ష‌త‌న‌ జ‌రిగింది. జీఎస్టీ రిట‌ర్న్ ల స‌ర‌ళీక‌ర‌ణపై ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. అందుకే ఈ అంశంపై మ‌రో స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. మూడు నెల‌ల పాటు జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 

బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ

Submitted by arun on Wed, 03/07/2018 - 18:18

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణవారు విభజన కోరుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయన్నారు.

ఎవ్వరికీ హోదా లేదు

Submitted by arun on Wed, 03/07/2018 - 10:28

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి కుండబద్దలు కొట్టింది. ప్రత్యేక హోదా కన్నా ఇంతకు ముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్యాకేజీని మాత్రమే అమలు చేసి మిగిలిన హామీలు సాధ్యం కావని ప్రకటించాలని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని టీడీపీ నేతలు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి చెప్పారు. అయితే, హోదాకు బదులు ప్యాకేజీ వైపే ఆర్థిక శాఖ మొగ్గుచూపుతోంది.

జ‌గ‌న్ కేసు మోడీకి చుట్టుకుంటుందా?

Submitted by arun on Fri, 02/23/2018 - 16:27

అక్రమాస్తుల కేసు జగన్ మెడకు చుట్టుకుంటుందా? మోడీ మెడకు బిగుసుకుంటుందా? జగన్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయన్న ఆరోపణలతో పాటు ఇందూ టెక్‌ బాగోతంపై అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధానికి నోటీసులు పంపించింది. అసలేంటి? మారిషస్‌ సర్కార్‌ ఏకంగా ప్రధానికే నోటీసులు ఎందుకు ఇచ్చింది? జగన్‌ కేసుకు, మోడీకి లింకేంటి? జగన్‌, మోడీ మధ్యలో మారిషస్‌ అసలు కథేంటి? 

దిగొచ్చిన కేంద్రం.. లోటు భర్తీకి సుముఖత..!

Submitted by arun on Sat, 02/10/2018 - 10:53

ఏపీ ఎంపీల ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఏపీ అంశాలపై పరిష్కారానికి.. సుజనా చౌదరి, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, రైల్వేజోన్ తో పాటు పలు కీలక అంశాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
   

చెవిలో పాత పువ్వు

Submitted by arun on Fri, 02/09/2018 - 10:02

ఆంధ్రా ఎంపీల ఆందోళనలతో కేంద్రం కొత్త వార్త వినిపిస్తుందేమోనని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. మూడు రోజులపాటు పార్లమెంట్లో ఒత్తిడి చేసినా.. ఏపీలో బంద్ నిర్వహించినా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మనసు కరగలేదు. ఏపీకి సాయం అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, సాయం కొనసాగుతుందంటూ పాత పొడిపొడి మాటల్నే రిపీట్ చేశారు. 

ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం

Submitted by arun on Tue, 02/06/2018 - 17:08

తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, విభజన చట్ట ప్రకారం ఏపీకి చాలా సంస్థలు ఇచ్చామని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు. 
 

ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పందించిన జైట్లీ

Submitted by arun on Tue, 02/06/2018 - 16:19

ఏపీకి ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీల ఆందోళనకు స్పందించిన జైట్లీ ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల ద్వారా సమకూర్చుతున్నామని తెలిపారు. హోదా ఇవ్వలేని పరిస్థితుల్లోనే ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ ప్రకటించారు. హోదా ఉంటే 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుందని, అదే, ప్యాకేజీ రూపంలో తామూ 60 శాతం నిధులు ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన నిధులను కూడా విదేశీ పెట్టుబడుల రూపంలో ఏపీకి సాయం చేస్తున్నామన్నారు.