Ghazal Srinivas Arrested

చంచ‌ల్ గూడ జైలుకు గ‌జ‌ల్ శ్రీనివాస్

Submitted by arun on Tue, 01/02/2018 - 16:46

 గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గజల్‌ శ్రీనివాస్‌.. కుమారి అనే అమ్మాయిని వేధించాడు. దీంతో ఈ వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. భాదితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు గ‌జ‌ల్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలు ఫిర్యాదు తో పాటు కొన్ని వీడియోల‌ను పోలీసులకు అందించింది. ఆ వీడియోల్ని ప‌రిశీలించిన ఏసీపీ విజయ్‌కుమార్ గ‌జ‌ల్ పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విచార‌ణలో భాగంగా గ‌జ‌ల్ బాధితురాల్ని వేధించిన‌ట్లు  తేల‌డంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.