Pawan Kalayan

మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారు? : పవన్‌

Submitted by arun on Mon, 08/06/2018 - 16:22

కర్నూలు జిల్లా హత్తిబెళగల్‌ క్వారీ ప్రమాద స్థలాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. పేలుళ్ల ఘటనపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఘటనస్థలిని పూర్తిగా పరిశీలించేందుకు పవన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కార్యకర్తలు దూసుకెళ్లారు. 

అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్ క్వారీ పేలుడు వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు ప్రదేశాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. అ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

JFC లెక్క తేల్చింది.. కేంద్రం ఏం చెబుతుంది?

Submitted by arun on Mon, 03/05/2018 - 11:50

ఏపీకి కేంద్రం అందిస్తున్న సహాయంపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి నిజ నిర్థారణ కమిటీ.. తుది నివేదక ఇచ్చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి 74 వేల 542 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని లెక్క తేల్చింది. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమే లేదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని.. ఆ బాధ్యత తమదే అని కేంద్రం మాటలు చెప్పడం కాదన్న జేఎఫ్సీ.. ఆ దిశగా సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

అజ్ఞాతవాసిలో యాడ్ చేసే సీన్లు ఇవే

Submitted by arun on Fri, 01/12/2018 - 16:07

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడులైంది. సినిమా విడుద‌ల‌తో భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే అభిమానుల అంచ‌నాల‌కు ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఢీలా ప‌డిపోయింది. దీంతో నిర్మాత  సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేస్తే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అలా చేస్తే సినిమా మ‌రికొన్ని రోజులు ఆడుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి లో విక్ట‌రీవెంక‌టేష్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కాకపోతే సినిమా నిడివి పెర‌గ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లో వాయిస్ ఓవ‌ర్ కే ప‌రిమితం చేశారు.

క‌త్తి ప్ర‌శ్న‌ల‌కు పవన్ అభిమానుల స‌మాధానాలు!

Submitted by arun on Tue, 01/09/2018 - 14:27

నటి పూనం కౌర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ, రెండు రోజుల క్రితం సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ కొన్ని ప్రశ్నలను సంధించిన తరువాత, వాటికి సమాధానాలను పవన్ ఫ్యాన్స్ ప్రిపేర్ చేశారు. కత్తి ప్రశ్నలకు సమాధానాలను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ సమాధానాల్లో ఉన్న వివరాల ప్రకారం, ‘‘ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట‌గా పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారు. ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొంది.

వేల కోట్ల దోపిడీకి పవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూస్తున్నారు : రేవంత్‌

Submitted by arun on Tue, 01/02/2018 - 15:17

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ కలవడంపై స్పందించిన రేవంత్.. కేసీఆర్ మాయలో పవన్‌కల్యాన్ పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు మేలు చేయడానికే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని రేవంత్ అన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో సాగే వేల కోట్ల దోపిడీకి పవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.