Doctors

చిట్టిత‌ల్లిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్ట‌ర్లు

Submitted by arun on Sat, 02/17/2018 - 11:03

తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు రావాల్సిన పాప 2 నెలల ముందే వచ్చేసింది. తోడుగా తనతో వచ్చిన చెల్లి పుట్టిన నిమిషాల్లోనే చనిపోయింది 3 రోజుల తర్వాత కన్నతల్లి మరణించింది. చివరికి తండ్రి కూడా పాపను సాకడం తనతో కాదని వదిలేసి వెళ్లిపోయాడు. కానీ ఆ తల్లికి పురుడు పోసిన డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందే పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నవీనగా మార్చి ఏడాది తర్వాత నవయుగంలోకి నడిపించారు.

నవీన చూస్తున్నారుగా ఎంత ముద్దుగా ఉందో. మీరు చూస్తున్న ఈ పాప పుట్టినప్పుడు ఇంత బాగా పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఈరోజు ఈ చిన్నారి ఇలా ఉందంటే దానికి కారణం నల్గొండ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే.

స‌మ్మెబాట ప‌ట్టిన 2.9ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు

Submitted by arun on Tue, 01/02/2018 - 15:12

దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్ల స‌మ్మెకొన‌సాగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు డాక్ట‌ర్లు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. కేంద్ర ప్రభుత్వం  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న డాక్ట‌ర్లు ఉద‌యం 6గంట‌ల నుంచి సాయంత్రం 6గంట‌ల పాటు విధుల్ని బ‌హిష్క‌రించారు.  ఇదిలా ఉంటే  మెడికల్ కమిషన్ బిల్లులో ఉన్న క్రాస్‌పథిని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. క్రాస్‌పథి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ చదవిన వారు కూడా అలోపతి ట్రీట్‌మెంట్ ఇవ్వడం.