Agnyaathavaasi

కీర్తీసురేష్ కూడా మొద‌లు పెట్టిందా

Submitted by lakshman on Thu, 02/22/2018 - 07:25

నేను శైల‌జ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బొద్దుగుమ్మ కీర్తి సురేష్ .  తొలి చూపులోనే తెలుగు ఆడియన్స్ ఈమెకు ఫిదా అయిపోయారు. చూడముచ్చటైన ఆమె చిరునవ్వు, అమాయకత్వంతో కూడుకున్న నటన అందరిని ఆకట్టుకున్నాయి.
 కీర్తి సురేష్ ఆ తరువాత నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ఈ బొద్దు గుమ్మ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కానీ అజ్ఞాతవాసి చిత్ర ఫలితంతో కీర్తికి నిరాశే మిగిలింది. అయినా కూడా ఇప్పటికి కీర్తి సురేష్ క్రేజీ హీరోయినే. సావిత్రి బయోపిక్ మహానటి వంటి బిగ్ ప్రాజెక్ట్ కీర్తి చేతుల్లో ఉంది.

పవన్, మహేష్ ఇచ్చిన షాక్ లో దిల్ రాజు

Submitted by arun on Wed, 01/24/2018 - 16:25

పెద్ద హీరోల సినిమాలను నిర్మించాలని..డిస్టిబ్యూట్ చేయాలని మూవీ మేకర్స్ తెగ పోటీపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ఇక అలాంటి తప్పు చేయనంటున్నాడు. పెద్ద హీరోల పేర్లు చెబితేనే ఆమాడ దూరం పరిగెడుతున్నాడు. పవన్, మహేష్ ఇచ్చిన షాక్ తో ఇంకా కోలుకోలేకపోతున్నాడు.  

యువకుడిని చితకబాదిన పవన్‌ అభిమానులు

Submitted by arun on Thu, 01/18/2018 - 15:42

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొట్టిన ఓ యువకుడిని పవన్ ఫ్యాన్స్  చితకబాదారు. తెలిసో తెలియకో ఆ కుర్రాడు చేసిన పనికి పవన్ అభిమానులు ఆగ్రహించి అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఆ కుర్రాడి చేత క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియోను వెబ్‌లో అప్‌లోడ్ చేసి.. పవన్‌ని దూషించే ఎవరికైనా ఇలాంటి శాస్తి తప్పదని హెచ్చరించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలైంది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరకుపోయారు. 

జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్‌

Submitted by arun on Wed, 01/17/2018 - 15:33

టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన బ్యానర్లే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ లాభాలు సాధిస్తున్న పలు నిర్మాణ సంస్థలు టీడీఎస్ సక్రమంగా కట్టడం లేదని గుర్తించిన ఐటీ అధికారుల వారి ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహించారు. ఇటీవల జై సింహా సినిమాను నిర్మించిన సి.కళ్యాణ్ , అజ్ఞాతవాసి సినిమాను నిర్మించిన హారికా హాసిని క్రియేషన్స్ ఆఫీసులతో పాటు సురేష్‌ ప్రొడక్షన్స్‌, భవ్య క్రియేషన్స్‌, డీవీవీ క్రియేషన్స్, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ లాంటి ఎనిమిది నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.

తాను ఒకటి తలుస్తే..దైవం ఒకటి తలిచినట్టు

Submitted by arun on Sun, 01/14/2018 - 16:45

అజ్ఞాతవాసి మూవీతో పవన్ కళ్యాణ్ అగాధంలో పడిపోయాడు. తాను ఒకటి తలుస్తే...దైవం ఒకటి తలిచినట్టు...అజ్ఞాతవాసి మూవీ ప్లాప్ తో ప్లాన్ అంతా రివర్స్ ఐంది. అజ్ఞాతవాసి హిట్ తో ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి జనాల్లోకి వెళ్లానుకున్నాడు. కానీ ఈసినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో మరో సినిమా చేయాలా వద్దా అనే సందిగ్గంలో పడ్డాడు. ఇంతకు పవన్ ఇంకో సినిమా చేస్తాడా..లేదా..

అజ్ఞాతవాసి సినిమా చూసిన కొద్దిసేప‌టికే ...చనిపోయిన అభిమాని

Submitted by lakshman on Sat, 01/13/2018 - 00:53

 సంక్రాతి బ‌రిలో విడుద‌లైన అఙ్ఞాతవాసి సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. అయితే ఆ అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేని అఙ్ఞాతవాసి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అఙ్ఞాతవాసి సినిమా చూసేందుకు వ‌చ్చిన ఓ అభిమాని మృతి చెందాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  

అజ్ఞాతవాసిలో యాడ్ చేసే సీన్లు ఇవే

Submitted by arun on Fri, 01/12/2018 - 16:07

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడులైంది. సినిమా విడుద‌ల‌తో భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే అభిమానుల అంచ‌నాల‌కు ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఢీలా ప‌డిపోయింది. దీంతో నిర్మాత  సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేస్తే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అలా చేస్తే సినిమా మ‌రికొన్ని రోజులు ఆడుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి లో విక్ట‌రీవెంక‌టేష్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కాకపోతే సినిమా నిడివి పెర‌గ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లో వాయిస్ ఓవ‌ర్ కే ప‌రిమితం చేశారు.

అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు..లార్గోవించ్ డైరెక్టర్ నోటీసులు పంపే అవకాశం

Submitted by arun on Fri, 01/12/2018 - 14:02

నెగిటీవ్ టాక్ తో ఇప్పటికే సతమతమవుతున్న అజ్ఞాతవాసి మూవీకి మరోకొత్త చిక్కు వచ్చి పడింది. ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ ను కాపీ కొట్టారనే అంశం మళ్లీ రచ్చ చేస్తోంది. కాపీ కొట్టారనే ఆరోపణలు రావడంతో..అజ్ఞాతవాసి టీం..భారతదేశంలో ఆ రైట్స్ దక్కించుకున్న టీ సిరీస్ కు 70లక్షలు ఇచ్చి సమస్యకు పుల్ స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు లార్గోవించ్ డైరెక్టర్ జరోమ్ సెల్లె మళ్లీ వివాదాన్ని లేవనెత్తాడు. కేవలం ఇండియా వరకే లార్గోవించ్ కాపీ రైట్ హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది. కానీ అజ్ఞాతవాసి మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. కాబట్టి ఇది కాపీ రైట్ హక్కులను ఉల్లగించడమే అంటూ వివాదాన్ని తెలనెత్తాడు.

త్రివిక్ర‌మ్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Submitted by arun on Fri, 01/12/2018 - 12:55

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇండస్ట్రీ కొడుతుందునుకున్నారు. సినిమాను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేశాడు. సినిమాను ఆకాశానికెత్తేస్తాడనుకుంటే..పాతానికి పడేశాడు. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. అసలు అజ్ఞాతవాసి ఇలా కావడానికి త్రివిక్రమ్ చేసిన తప్పేంటి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

Submitted by lakshman on Fri, 01/12/2018 - 07:02

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘అజ్ఞాతవాసి’ అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలబ‌డింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఢీలా ప‌డిపోయారు. త‌మ అభిమాన న‌టుడి సినిమా రికార్డ్ ల‌ను క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతుంటే ఆనందించాల‌ని అనుకున్నారు. కానీ ఫ‌లితం డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ నింపేలా ఓ వార్త సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 2019ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ ‘అజ్ఞాతవాసి’ చివ‌రి సినిమా అనుకున్నారు. అయితే ప‌వ‌న్ ‘అజ్ఞాతవాసి’తో ఆగిపోడం లేద‌ని..."చ‌రిత్ర" తిర‌గ‌రాసేలా మ‌రో కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌న‌నున్న‌ట్లు టాక్.