mahesh babu

అక్క కోసం మహేష్‌ మరో సాయం

Submitted by arun on Thu, 02/15/2018 - 10:48

తాను దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఘట్టమనేని మంజుల, హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే మహేష్ ఒప్పుకున్నాడని, ఆ తరువాత కొన్ని మార్పులు చెబితే మాత్రం, 'వేరే వాళ్లతో చెప్పించుకో' అని తప్పించుకున్నాడని చెప్పింది.
 

మ‌హేష్ ను ఇంప్రెస్ చేసిన నేహా

Submitted by arun on Mon, 02/05/2018 - 11:49

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూత్‌, మ‌హిళ‌ల‌తో పాటు చిన్నారులు కూడా మ‌హేష్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా యూఎస్‌కి చెందిన మ‌హేష్ ఫ్యాన్ నేహా అనే చిన్నారి మ‌హేష్‌కి లెట‌ర్ రాసి అత‌నిని ఇంప్రెస్ చేసింది.ఆరో తరగతి చదువుతున్న నేహా సనంపుడిని, స్కూల్‌ యాజమాన్యం మీ అభిమాన సెలబ్రిటీకి లేఖ రాయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకు నేహా, తనకు ఎంతో ఇష్టమైన మహేష్‌బాబుకి లేఖ రాసింది. ఆ లేఖకు ఎంతో ఇంప్రెస్‌ అయిన మహేష్‌ వెంటనే ఓ స్వీట్‌ రిప్లైను కూడా ఇచ్చారు.

భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..

Submitted by arun on Fri, 01/26/2018 - 13:04

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు విడుదల చేసింది.

ఎట్టకేలకు ధైర్యం చేసిన మహేష్ బాబు

Submitted by arun on Wed, 01/17/2018 - 13:06

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సంక్రాంతికి నిరాశ తప్పలేదు. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడని ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ తీరా చూస్తే...లుక్ రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఆశలన్నీఆవిరైయ్యాయి. ఐతే మ‌హేష్ త్వరలోనే ఫ్యాన్స్ లో జోష్ నింపబోతున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేసి..డేట్ అనౌన్స్ చేశాడు.

మ‌హేష్ బాబుపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన బాల‌య్య‌

Submitted by lakshman on Mon, 01/15/2018 - 14:26

జైసింహ‌తో మాంచి జోరుమీదున్న బాల‌కృష్ణ ఓ మీడియా ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. రీమేక్ సినిమాలు చేస్తారా అన్న ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన ఆయ‌న డైర‌క్ట‌ర్ కెఎస్ రవికుమార్ త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఓ సినిమా రిమేక్ చేద్దామ‌ని ప్ర‌స్తావించార‌ట‌. అందుకు బాల‌య్య రిమేక్ లు చేస్తే మ‌న‌కుచ్చే పేరు ఏమీ ఉండ‌ద‌ని అందుకే అలాంటి సినిమాలకు దూరంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు.

భరత్ అనే నేను టీం పై ఫుల్ ప్రెషర్..డేంజర్ జోన్ లో పడ్డ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్

Submitted by arun on Tue, 01/09/2018 - 15:48

భరత్ అనే నేను మూవీతో హోల్ టీం అంతా ప్రెషర్ కుక్కర్ లా మారిపోయారు. మహేష్ బాబు నుంచి మొదలుకోని..డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అందరిపైనా ఒత్తిడి పెరుగుతోంది. భరత్ అనే నేను మూవీ అందరికీ చాలా కీలకంగా మారడంతో ఏ జరుగుద్దో అని తెగ టెన్షన్ పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పడుతున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు ఫ్లాప్ లు పడ్డాయి..మరి ఇలాంటి పరిస్థితిలోమరో ఫ్లాప్ పడితే ఇక అంతే సంగతులు. దీంతో భరత్ అనే నేను మూవీ మహేష్ కు డూ ఆర్ డై లా మారింది. దీంతో ఈసినిమా మహేష్ పై రోజు రోజుకు ప్రెషర్ పెంచుతోంది. ఈ సినిమాను హిట్ గా మలుచుకునేందుకు చుట్టు పీక్కుంటున్నాడు.

మహేష్, అల్లు అర్జున్ సినిమాలపై రజినీ ఎఫెక్ట్

Submitted by arun on Tue, 01/02/2018 - 15:03

మహేష్ బాబు, అల్లు అర్జున్ కు రజినీకాంత్ చుక్కలు చూపిస్తున్నాడు. వాళ్లను ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేసుకోనివ్వడం లేదు. ఈ హీరోలిద్దరూ ఏ రిలీజ్ డేట్ పై ఖర్చీఫ్ వేస్తే రజినీకాంత్ కూడా అక్కడికే వెళుతున్నాడు. ఇప్పటికే ఓసారి మహేష్, బన్నీ సినిమా రిలీజ్ డేట్లను తారుమారు చేసిన రజినీ, తాజాగా మరోసారి షాక్ ఇచ్చాడు. తన రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవడంతో సూపర్ స్టార్ కు, స్టైలీష్ స్టార్ ను గందరగోళంలో పడేశాడు.

'స్పైడ‌ర్' రివ్యూ

Submitted by kasi on Wed, 09/27/2017 - 17:09

'ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందే స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారిని కాపాడి సంతోషించే క‌థానాయ‌కుడు.. ఓ మ‌నిషిని చంపి వాళ్ల బంధువులు ఏడిస్తే అది చూసి సంతోషించే శాడిస్టిక్ ప‌ర్స‌నాలిటీ డిజార్డర్ ఉన్న‌ ప్ర‌తినాయ‌కుడు.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే మైండ్‌గేమ్ సినిమానే స్పైడ‌ర్‌'. అగ్ర క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబు, అగ్ర ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్ర‌మిది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా, క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించారు.

'స్పైడ‌ర్' క‌థ ఏమిటంటే..

Submitted by kasi on Tue, 09/26/2017 - 15:16

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ తెర‌కెక్కించే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉండ‌వు. ఏదో ఒక సందేశాన్ని క‌థ‌లో అంత‌ర్లీనంగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. 'గ‌జిని' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన‌ మురుగ‌దాస్ 'స్టాలిన్‌', 'తుపాకి' చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న తాజా చిత్రం 'స్పైడ‌ర్' రేపు విడుద‌ల కానుంది. ఈ చిత్రం క‌థ‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే మురుగ‌దాస్‌నే నేరుగా ఈ సినిమా క‌థేంటో చెప్పుకొచ్చారు.. ఓ ఇంట‌ర్వ్యూలో.

'స్పైడ‌ర్‌'.. 2500 థియేట‌ర్స్‌లో

Submitted by kasi on Mon, 09/25/2017 - 19:57

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 2,500 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తున్న 'స్పైడ‌ర్‌'.. యుఎస్ఎలో ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల అడ్వాన్స్ బుకింగ్‌ని ప్రీమియ‌ర్స్‌కే సొంతం చేసుకుంది.