Anchor Pradeep

మద్యం హానికరం..నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దు: యాంకర్‌ ప్రదీప్‌

Submitted by arun on Mon, 01/08/2018 - 16:30

మద్యం ఆరోగ్యానికి హానికరమని యాంకర్ ప్రదీప్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి పట్టుబడ్డ ప్రదీప్.. సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ తన తండ్రితో కలిసి హాజరయ్యారు. కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు.  ‘‘ఈ రోజు కౌన్సెలింగ్‌ సెషన్‌కు హాజరు కావాలని మెసేజ్‌ వచ్చింది. అందుకే వచ్చాను. ఇప్పటివరకు రాలేదంటని అంతా అనుకుంటున్నారు. తప్పించుకుంటున్నానని.. అజ్ఞాతంలోకి వెళ్లానని రకరకాలుగా అంటున్నారు. అలాంటిదేమీ లేదు. పోలీసులు నాకు కేటాయించిన తేదీని బట్టే ఇక్కడికి వచ్చాను.

ప్ర‌దీప్ కారులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే

Submitted by arun on Sun, 01/07/2018 - 16:21

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో కారులో ప్ర‌దీప్ తో పాటు మ‌రో ముగ్గురు ప్ర‌యాణించారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక అబ్బాయి  ప్ర‌దీప్. మ‌రి  ప‌క్క‌నే ఉన్న ఆ  అమ్మాయిలు ఎవ‌రు అని నెటిజ‌న్లు ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అయితే వారిలో స‌గం క‌వ‌ర్ అయిన ఫోటోని చూసి  శ్రీముఖి అని కొంద‌రు గెస్ చేశారు.  ఆఫోటో పై వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ఖండించిన శ్రీముఖి తాను కాద‌ని తేల్చేసింది. ఒక‌రు అప్ క‌మింగ్  హీరోయిన్ అని, మ‌రికొంద‌రు ప్ర‌దీప్ డీప్ ల‌వ్ లో ఉన్నాడ‌ని ఊహాగానాలు చేశారు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు: ప్రదీప్

Submitted by arun on Fri, 01/05/2018 - 11:08

యాంకర్ ప్రదీప్ టచ్‌లోకి వచ్చాడు. డిసెంబర్ 31 అర్ధరాత్రి.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రదీప్.. మొత్తానికి అజ్ఞాతం వీడాడు. తాను ఎందుకు కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయానన్న దానిపై ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన దగ్గర్నుంచి.. అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారమే నడుచుకుంటున్నానని వీడియోలో చెప్పాడు ప్రదీప్. చట్టానికి లోబడే ఉంటాను కానీ అతిక్రమించబోనన్నాడు. పోలీసులిచ్చే కౌన్సిలింగ్‌తో పాటు దాని తర్వాత జరిగే వాటికి కూడా హాజరవుతానని చెప్పాడు ప్రదీప్.

ఒగ్గేయండి సార్..ప్ర‌దీప్ చిన్న‌పిల్లోడు

Submitted by arun on Thu, 01/04/2018 - 18:33

 న్యూ ఇయర్‌ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రదీప్‌ ఎవరికి టచ్‌లో లేకుండా పోయాడు. మోతాదుకు మించి మద్యం సేవించి కారు డ్రైవ్‌ చేసిన ప్రదీప్‌ను కౌన్సిలింగ్ కు రావాలని నోటీసులు  పంపినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం

సోషల్‌ మీడియాలో ప్రదీప్‌ వీడియో హల్‌చల్‌.. తాగొద్ద‌న్నాడు.. తాగేసి దొరికిపోయాడు

Submitted by arun on Tue, 01/02/2018 - 12:14

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని ప్ర‌దీప్ నీతి వాక్యాలు చెప్పాడు. ఇలా నీతి వాక్యాలు చెప్పిన వాడే ఇవాళ త‌ప్పతాగి దొరికిపోయాడంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన వారికి ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. ఇందు కోసం బేగంపేటలోని ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రావాలని ప్రదీప్‌కు నోటీసులిచ్చారు. అయితే ప్ర‌దీప్‌కి క‌చ్చితంగా రెండు నుంచి వారం రోజుల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
 

కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌..

Submitted by arun on Tue, 01/02/2018 - 10:44

న్యూ ఇయర్‌ వేడుకల్లో మద్యం తాగి...వాహనాలు నడిపిన వారికి ఇవాళ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ 150 డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టీంలు...22వేల 450 వాహనాలను తనిఖీలు నిర్వహించాయి. ఇందులో తాగి వాహనాలు నడిపిన వారిపై 16 వందల 83 కేసులు నమోదు చేశారు. 1,683 వాహనాలను సీజ్‌ చేసి...స్టేషన్లకు తరలించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2449 కేసులు నమోదయ్యాయి.

ప్రదీప్‌కు జైలు తప్పదా ?

Submitted by arun on Mon, 01/01/2018 - 14:08

న్యూ వేడుకలు సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదా ? డిసెంబర్‌ 31లోపు పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా మందుబాబులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మందు కొట్టి చిందులు వేశారు. కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రముఖ తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం సేవించారు. బ్రీతింగ్‌ ఎనలైజర్‌లో 30పాయింట్లకు మించితే పోలీసులు జైలుకు పంపుతారు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్‌ డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అలా ఇలా కాదు మోతాదుకు మించి 6 రెట్లు ఎక్కువ మందు కొట్టారు యాంకర్ ప్రదీప్‌.