Vijayawada

విజయవాడలో విషాదం.. గగారిన్‌ మృతి

Submitted by arun on Mon, 11/26/2018 - 11:35

విజయవాడలో దుండగుల నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఆయనపై మాదాల సురేష్, మాదాల సుధాకర్ అనే వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన గగారిన్ మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. ఈ కేసులో నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే, మొఘల్‌ రాజుపురం శిఖామణి సెంటర్లో ఓ భవనం విషయంలో వివాదమే గగారిన్‌పై హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. 

విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

Submitted by arun on Sat, 11/24/2018 - 11:16

విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గగారిన్ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో గవర్నర్ పేట బిగ్ బజార్ సమీపంలో దారుణం జరిగింది. బీసెంట్ రోడ్‌లో పట్టపగలు జనాలంతా చూస్తుండగానే గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ ప్రాణ భయంతో బాధితుడు రోడ్డుపైకి పరుగులు తీయగా పక్కనే షాపులో ఉన్న ఓ యువకుడు నీళ్లు తెచ్చి పోశాడు.

Tags

దారుణం.. ఆఫీస్‌లోనే వ్యాపారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

Submitted by arun on Fri, 11/23/2018 - 15:55

ఏపీలోని విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గగారిన్ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. తోటి ఫైనాన్సర్లతో వివాదమే ఈ ఘాతుకానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గగారిన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Tags

ఉత్సాహంగా..రేస్‌

Submitted by chandram on Sun, 11/18/2018 - 12:19

అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలో నిర్వహిస్తున్న F1 H2O బోట్ రేస్ పోటీలు చివరిరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరిగే ఫైనల్ పోటీలు మూడు రౌండ్స్‌లో జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో 18 టీమ్‌లు, రెండో రౌండ్‌లో 12 టీమ్‌లు, మూడో రౌండ్‌లో 6 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో ఫైనల్ విజేతకు సీఎం చంద్రబాబు బహుమతి ప్రదానం చేస్తారు. ఇది ఫైనల్ రేస్ కావడంతో వీక్షించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లు చేసింది.  నేడు ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు. 

దుర్గగుడిలో అధికారుల మధ్య ముదురుతున్న వివాదం

Submitted by arun on Mon, 11/05/2018 - 15:14

ఇంద్రకీలాద్రిపై అధికారుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా అసిస్టెంట్‌ ఈవో అచ్యుతరామయ్యపై ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించేలా వ్యాఖ్యానించారంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఏఈవోపై కేసు నమోదు చేశారు. ఇటు మెమెంటోల కొనుగోళ్లు అక్రమాలపై విచారణ జరుగుతుందని దీనికి సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని ఈవో తెలిపారు. 

పవన్ కల్యాణ్ ట్రైన్ జర్నీ..

Submitted by arun on Fri, 11/02/2018 - 12:31

పవన్ కల్యాణ్ మరో దఫా ప్ర‌జా పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇవాల్టి నుంచి పోరు బాట పడుతున్నారు. తుని నుంచి శ్రీకారం చుట్టే ఈ యాత్ర‌ను పవన్ వినూత్నంగా ప్రారంభించబోతున్నారు. తుని వెళ్ళడానికి పవన్ రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. వివిధ వర్గాల ప్రజలను, అభిమానులను కలుసుకుంటూ ఇవాళ మధ్యాహ్నం పవన్ విజ‌య‌వాడ నుంచి రైలు ప్రయాణం ప్రారంభిస్తారు. ఇందుకు జన్మ‌భూమి ఎక్స్ ప్రెస్ వేదిక కాబోతోంది. 

దుర్గగుడిలో ప్రొటోకాల్‌ వివాదం...ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర అవమానం

Submitted by arun on Tue, 10/16/2018 - 12:49

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ప్రోటోకాల్‌ వివాదం రేగింది. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర  అవమానం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్‌ ఉన్న ఆయన రాకముందే అసిస్టెంట్‌ ఈవో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తీవ్ర వివాదాస్పదమైంది.  అధికారలు తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. 

ప్రాణం తీసిన ఐటీ నోటీసులు

Submitted by arun on Tue, 10/16/2018 - 11:03

ఐటీ నోటీసులు విజయవాడలో ఓ వ్యాపారి ప్రాణాలు తీశాయి. ఆటోనగర్ లో లారీ బాడీబిల్డింగ్  వర్క్ షాప్  నిర్వహిస్తున్న సాధిక్ కు పన్ను చెల్లించాలని ఇటీవల ఐటీ అధికారుల నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న సాదిక్ రెండు రోజుల క్రితం స్క్రూ బిడ్జి  దగ్గర బందర్  కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఐటీ అధికారుల వేధింపులతో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 
 

Tags

విజయవాడకి ఎందుకా పేరు

Submitted by arun on Fri, 10/12/2018 - 17:20

విజయవాడ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా..  విజయవాడ అనే పేరు వెనుక అనేక పురాణములు ఉన్నాయి. అందులో ఒకటి దుర్గ దేవత రాక్షసుడిని హతమార్చి, కొంతకాలం ఈ ప్రదేశంలో విశ్రమించిందని ప్రసిద్ది. అలాగే  ఆమె విజయం సాధించినప్పుడు ఈ ప్రదేశం విజయవాడ "ప్లేస్ అఫ్ విక్టరీ" అని పిలువబడుతుంది అని కొందరి నమ్మకం. శ్రీ.కో.

Tags

ఎన్నికల వేళ తెరపైకి మరో కొత్త పార్టీ...ఓట్లతో సత్తా చూపుతామని శపధం

Submitted by arun on Mon, 10/01/2018 - 10:28

విజయవాడలో సమావేశమైన భార్యా బాధితుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అది తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చాలని డిసైడ్ అయింది. అన్ని చట్టాలు భార్యలకు అనుకూలంగానే ఉన్నాయని, భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని భార్యా బాధితుల సంఘం ఆరోపించింది. తెలుగు రాష్ట్రాలలో ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి తద్వారా భార్యా బాధితుల సంఘం వెల్లడించింది.