Karnataka

కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : అమిత్‌ షా

Submitted by arun on Wed, 04/18/2018 - 15:58

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగుర వేస్తూ వస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అన్ని రాష్ట్రాల్లో గెలిచిన విధంగానే దక్షిణాదికి ముఖద్వారమైన కర్ణాటకలోనూ విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని సాగనంపి యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో విజయం సామాన్యమైంది కాదన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముఖద్వారమన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళలోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. 

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

Submitted by arun on Mon, 04/16/2018 - 17:13

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. మొత్తం 224 సీట్లకు గానూ 218మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అనూహ్యంగా 90శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. ప్రస్తుతమున్న 122మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 107మందికి టికెట్లు ఇచ్చారు. అయితే టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పలుచోట్ల ఆశావహులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మాండ్యా, చిక్‌ మంగళూరు, రాజాజీనగర్‌‌, బళ్లారి, మంగళూరులో ఆశావహులు రచ్చరచ్చ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. 

రాహుల్‌గాంధీని గురిచూసి విసిరాడు..

Submitted by arun on Fri, 04/06/2018 - 15:24

ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తుముకూరులో ఓపెన్‌టాప్ ఎస్‌యూవీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో సడెన్‌గా ఓ దండ వచ్చి ఆయన మెడలో పడింది. ఎవరో ముందుండి చాలా శ్రద్ధగా మెడలో వేసినట్లు ఆ పూలమాల పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాహుల్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ పూలమాలను తొలగించి అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్‌షోను కొనసాగించారు.

అమావాస్య రోజు ఓట్ల లెక్కింపు... నేతల ఆందోళన

Submitted by arun on Fri, 03/30/2018 - 15:58

కర్ణాటకలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలకు..., తిధి, వారాలు, ముహూర్తాలు, వాస్తు దోషాలు టెన్షన్‌ పెడుతున్నాయా.? కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారా ? ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలకు గ్రహాల అనుకూలతలు లేవా ? పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలపై నేతలకు ఎందుకంత భయం పట్టుకుంది. 

మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగరా

Submitted by arun on Tue, 03/27/2018 - 12:48

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఏప్రిల్‌ 17న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. 224 స్థానాలున్న కర్ణాటకలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్‌ రావత్‌ తెలిపారు. మే 12 పోలింగ్‌ నిర్వహించి15న ఫలితాలు ప్రకటించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 25న స్క్రూటినీ, 27న నామినేషన్లను విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. 

ఆసక్తి రేపుతోన్న సీఫోర్స్ సర్వే

Submitted by arun on Tue, 03/27/2018 - 11:34

కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్‌ మూడో స్థానంలో సరిపెట్టుకుంటుందా ? ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఓటర్లు షాకివ్వనున్నారా ? సిద్ధరామయ్య మరోసారి సీఎం కావడం ఖాయమేనని సీ ఫోర్స్‌ సర్వేలో తేలింది. గతం ఎన్నికల కంటే ఈ సారి ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా వేసింది.

మళ్లీ కాంగ్రెస్సే..బీజేపీకి షాక్..

Submitted by arun on Mon, 03/26/2018 - 16:11

కర్ణాటక తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే అవుననే చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తనకు సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. దక్షిణాది మినహా దేశంలో దాదాపుగా బీజేపీ పాగా వేసింది. అయితే దక్షిణాదిలో కూడా పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి ఈ సర్వేతో షాక్ తగిలింది.

ఎమ్మెల్యే కూతురు.. సినీ డైరెక్టర్‌..సస్పెన్స్‌ రేపిన ప్రేమ పెళ్లి

Submitted by arun on Fri, 03/09/2018 - 11:39

కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కుమార్తె, సినిమా దర్శకుడి ప్రేమ వివాహం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి, 'కన్నడ మాస్తిగుడి' దర్శకుడు పీ సుందర్‌ గౌడలు గురువారం నాడు చాముండి కొండపై వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సుందర్ బంధువులు పలువురు హాజరయ్యారు. ఎమ్మెల్యే శివమూర్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మైసూరులో వరుడి బంధువులు బసచేసిన హోటల్ వద్దకు వచ్చి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిరంజీవి

Submitted by arun on Thu, 02/15/2018 - 13:21

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల ఫలితాలు 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డబోతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే కర్ణాటకలో ఓ ర్యాలీ నిర్వహించారు.

రాహుల్ గాంధీ ‘పకోడా’ బ్రేక్...!

Submitted by arun on Mon, 02/12/2018 - 18:04

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఊహించని విధంగా ఇలా చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమేనంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఆగి మరీ మిర్చి పకోడాలు తినడంపై ఆసక్తికర చర్చ సాగింది. కాగా ఇవాళ ఉదయం రాహుల్ సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని రాయ్‌చూర్‌లోని దర్గాను దర్శించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహించారు.