RK roja

అందుకే శివాజీ అమెరికా పారిపోయాడు

Submitted by arun on Tue, 10/30/2018 - 10:42

చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆపరేషన్ గరుడ సాగుతోందని, గతంలో శివాజీ కేబినెట్ మీటింగ్‌లో పాల్గొనడమే దీనికి నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శివాజీ భయపడి అమెరికా పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌పై దాడి నాటకమంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని  ప్రతిపక్ష నేతలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకే కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసినట్లు రోజా తెలిపారు.
 

వైఎస్‌ జగన్‌కి ఏమైనా జరిగితే ఊరుకోం : రోజా

Submitted by arun on Thu, 10/25/2018 - 14:14

విశాఖ విమానాశ్రయంలోని విజిటర్స్ లాంజ్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...జగన్ గొంతు కోయడానికే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఫోర్క్‌తో పొడిచారని కొన్ని మీడియాల్లో రాస్తున్నారని, దీన్నొక చిన్న విషయంగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పుకొచ్చారు. మాకేం సంబంధం అని ప్రభుత్వం తప్పించుకోజూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.

రోజాపై కామెంట్స్: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Submitted by arun on Tue, 09/18/2018 - 13:26

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే రోజా తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 

నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:42

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.

ఆయన విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ‌

Submitted by arun on Wed, 04/11/2018 - 15:40

టీడీపీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కడుపు నిండా తిని స్పీకర్ లేని సమయంలో ఆ రూంలో దొర్లుతారుగానీ, పక్కనే ఉన్న ప్రధాని నరేంద్రమోడీ రూంకు వెళ్లే ధైర్యం లేదని మండిపడ్డారు. కిలో మీటర్ దూరం ముందు నుంచే మోడీ ఇంటిపై దాడి అంటూ మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సుల్లో ఎక్కేసి..పోలీసులు తమను బస్సుల్లో కుక్కేశారని చెబుతున్నారని విమర్శించారు. మీడియా కోసం ధర్నాలు చేసి, భోజనం సమయానికి పరుగెడతారని, వీళ్లు మా ఎంపీలను విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు

Submitted by arun on Wed, 01/03/2018 - 14:23

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పుకు మహిళా అధికారిని బలి చేశారని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రోజా మాట్లాడుతూ, కొడుకు లోకేష్ కోసమే చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు.

2017 నారావారి నరకాసుర నామ సంవత్సరం

Submitted by arun on Sat, 12/30/2017 - 15:54

2017 నారావారి నరకాసుర సంవత్సరమని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన మొత్తం అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అబద్ధాలతో సాగుతోందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారాయే కానీ, మహిళల తలరాతలు మాత్రం మారలేదని అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించవద్దని ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన తెల్లవారుజాము ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించిందని మండిపడ్డారు. బాబు హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టారని, అయినా చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు.