warangal

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ రోడ్ షో

Submitted by chandram on Tue, 12/04/2018 - 11:49

కేసీఆర్, టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక జత కట్టిన పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి కేటీఆర్. సింహం సింగిల్ గా వస్తుందని అదే గుంపు గుంపులుగా ఎవరు  వస్తారని ప్రశ్నించారు. 57ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 17 సంవత్సరాలు పాలించిన టీడీపీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశాయని కేటీఆర్  అన్నారు.  వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్దన్నపేట నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. 

వరంగల్‌లో ఆ 4 సీట్లు ఎందుకు హాట్‌ ఫేవరేట్‌?

Submitted by santosh on Mon, 11/19/2018 - 17:31

ఈ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ నాలుగు స్దానాల్లో హోరాహోరీ తప్పదా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఢీ అంటే ఢీ అంటున్నాయా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠపై బెట్టింగ్‌లు సైతం జోరు మీద సాగుతున్నాయా అసలు టఫ్‌ వార్‌కు కారణమేంటి ఎలాంటి సమీకారణాలు సమరాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి వరంగల్ జిల్లాలో అ రెండు పార్టీల మద్య నాలుగు సీట్ల ఫైట్‌పై స్పెషల్‌ స్టోరి. 

వరంగల్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

Submitted by chandram on Sun, 11/11/2018 - 14:22

వరంగల్ అర్బన్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు ఎగిసి పడ్డాయి. వరంగల్ పశ్చిమ టికెట్ నాయిని రాజేందర్ రెడ్డికి ఇవ్వాలంటూ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  హన్మకొండలోని పార్టీ కార్యాలయంగేటుకు తాళాలు వేసి దీక్షకు దిగారు. గ్రేటర్ కాంగ్రెస్  అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు ఇతర కార్యకర్తలు ఆందోళన దిగారు. రాజేందర్‌ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ స్ధానిక ప్రజాప్రతినిధుల వార్నింగ్‌ ఇచ్చారు. కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన సీనియర్ నేతలు బుజ్జగించే పనిల్లో పడ్డారు. 

వరంగల్‌లో మావో పోస్టర్ల కలకలం...

Submitted by arun on Sat, 11/10/2018 - 13:33

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. కొంతమంది టీఆర్ ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని  హెచ్చరించారు. మావోయిస్టు నేత శంకర్ పేరిట ఈ లేఖ విడుదలైంది. 
 

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత

Submitted by arun on Thu, 11/08/2018 - 13:09

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ కార్యాలయం తాళాన్ని పగులగొట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారే తాళం పగులగొట్టారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారి సతీష్‌తో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యాలయం తాళాన్ని పగులగొట్టిన ఘటనపై విచారణ జరపాలంటూ నర్సంపేటలో భారీ ర్యాలీ చేపట్టారు.  
 

అర్చకుడి ప్రాణాలు తీసిన మైక్ వివాదం

Submitted by arun on Fri, 11/02/2018 - 11:02

మైక్‌ ఒకరి ప్రాణాలు తీసింది. తెల్లవారుజామున మైక్‌లో భక్తి గీతాలు పెట్టినందుకు అర్చకుడిని కొట్టిచంపేశాడు ఓ యువకుడు. వరంగల్‌లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

వరంగల్ టీఆర్ఎస్‌లో వర్గపోరు

Submitted by arun on Tue, 10/02/2018 - 16:06

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. 13, 14 డివిజన్లకుచెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు క్రిస్టల్ గార్డెన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, మేయర్ నరేందర్
 ఎదుటే టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో సమావేశం మధ్యలో ఆగిపోయింది. కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. ఎంపీ, మేయర్ సర్దిచెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇరువర్గాల తోపులాటతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

వరంగల్ వెస్ట్ లో ముందస్తు జోరు

Submitted by arun on Thu, 07/12/2018 - 16:24

ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలీదు కానీ గ్రేటర్ వరంగల్ లో మాత్రం ఆ జోరు కనిపిస్తోంది. టిఆరెస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు ఈసారి గట్టి పోటీ తప్పేలా లేదు. టిఆరెస్ సంక్షేమ యాత్రలు చేస్తుంటే..  ప్రతిపక్షాలు ప్రజా సంకల్ప యాత్రలు చేస్తున్నాయి మరోవైపు మేం కూడా ఉన్నామని బరిలోకి దిగుతోంది బీజేపీ  దాంతో ఈసారి వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

ప్రాణాలు తీసిన పటాకులు

Submitted by arun on Wed, 07/04/2018 - 17:23

వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు పదకొండు మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కాశిబుగ్గ సెంటర్‌లోని కోటిలింగాలలో ఉన్న భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది సజీవ దహనం కాగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక దళాలు రంగంలో దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. 

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం...నలుగురు మృతి

Submitted by arun on Wed, 07/04/2018 - 12:47

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ సెంటర్‌లో భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయ్. 2 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ప్రమాదం జరిగిన భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో  13 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటికే నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం సమయంలో 13 మంది కార్మికులుంటే ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికితీశారు. భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలం వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.