Congress MLAs

కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వ ర‌ద్దు తీర్పుపై టీఆర్ఎస్ వ్యూహమేంటి..?

Submitted by arun on Fri, 04/20/2018 - 13:34

కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వ ర‌ద్దు తీర్పుపై టీఆర్ఎస్ వ్యూహమేంటి..? ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏం చేయాల‌నుకుంటోంది...? తీర్పును అధికార పార్టీ శిర‌సా పాటిస్తుందా...లేదంటే అప్పీలుకు వెళుతుందా..? అసలు కోమ‌టిరెడ్డి , సంప‌త్‌‌పై కేసు గురించి టీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు..? 

ఎమ్మెల్యేల బహిష్కరణ; హైకోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Tue, 04/17/2018 - 14:41

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది.  అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన హైకోర్టు వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా  కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. 

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Submitted by arun on Tue, 04/17/2018 - 13:53

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ  తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది.  అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన హైకోర్టు ..వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా   కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. 

ఊహించని మలుపులు తిరిగిన సభ్యత్వ రద్దు కేసు

Submitted by arun on Tue, 04/17/2018 - 12:54

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై కాసేపట్లో తీర్పు వెలవడనుంది. హైకోర్టు నిర్ణయంపై అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై  వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసు పలు మలుపులు తిరిగింది.  విచారణ సందర్భంగా ఘటన జరిగిన రోజు శాసనసభలో వీడియోలను తమకు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. దీనికి అడ్వకేట్ జనరల్ అంగీకరించినా తరువాత జరిగిన పరిణామాల్లో తన పదవికి రాజీనామా చేయడంతో విచారణకు బ్రేక్ పడింది. చివరకు వీడియోలు లేకుండానే విచారణ జరిపిన న్యాయస్ధానం తీర్పు ఈ రోజుకు రిజర్వ్ చేసింది.

కోమటిరెడ్డి, సంపత్‌లకు మరో ఇబ్బంది

Submitted by arun on Thu, 03/22/2018 - 10:14

శాసనసభలో రచ్చతో సభ్యత్వాన్ని కోల్పోయిన టీ కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఓటేసే హక్కుకూ దూరమవుతున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు ఓటు హక్కు దాదాపు  లేనట్టే. ఈ నెల 12న శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌ వీరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాలు ఖాళీ అయినట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా సమాచారం అందించారు. 

శాసన సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో విచారణ

Submitted by arun on Mon, 03/19/2018 - 16:05

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఒరిజినల్ సీసీ ఫుటేజ్ సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై వారంపాటు స్టే విధిస్తే అభ్యంతరమా అని ఈసీని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనిపై సాయంత్రం మూడున్నరకు తమ నిర్ణయాన్ని తెలుపుతామని ఈసీ కోర్టుకు తెలిపింది. 

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దు మంచిదే: అక్బరుద్దీన్

Submitted by arun on Tue, 03/13/2018 - 11:19

అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి, సంపత్‌పై బహిష్కరణ వేటును, మిగిలిన కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ను ఎంఐఎం సమర్థించింది. వేటు వేయడం న్యాయబద్ధమైనదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అసహన రాజకీయాలతో ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా మానుకోవాలని సూచించారాయన. గవర్నర్ మీద దాడి చేయాలనుకున్నాం కానీ మండలి చైర్మన్‌కు తగిలిందంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 

11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు

Submitted by arun on Tue, 03/13/2018 - 10:49

తెలంగాణ శాషన సభలో నిన్న జరిగిన దాడి ఘటనపై స్సీకర్ మధుసూదనాచారి కఠిన చర్యలు తీసుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ నుంచి పూర్తిగా బహిష్కరించారు. అంతేకాదు నిన్నటి ఘటనకు సంబంధించి 11మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఈ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. సస్పెండయిన వారిలో సీఎల్పీనేత జానారెడ్డి , ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి
,  చిన్నారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, పద్మావతి, వంశీచంద్‌, రామ్మోహన్‌రెడ్డి, మాధవ్‌ ఉన్నారు. 

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ..ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

Submitted by arun on Fri, 12/29/2017 - 17:13

మేఘాలయలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు గడువు ఉన్న సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి రోవెల్‌ లింగోడ్‌ కూడా ఉన్నారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 30 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో ‘కాంగ్రెస్’ బలం 24కు పడిపోయింది. కాగా, ఇద్దరు ఇండిపెండెంట్ లు, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించారు.